Begin typing your search above and press return to search.
విరాట్ ఆఖరి సెంచరీకి రెండేళ్లు.. పరుగుల యంత్రానికి ఏమైంది ?
By: Tupaki Desk | 24 Nov 2021 12:30 AM GMTదశాబ్ద కాలంలో 20 వేలకు పైగా అంతర్జాతీయ పరుగులు చేసిన మొట్టమొదటి క్రికెటర్‌గా నిలిచిన విరాట్ కోహ్లీ, ‘ఐసీసీ దశాబ్దపు క్రికెటర్’గా అవార్డు కూడా అందుకున్నాడు. చివరిగా 2019లో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో సెంచరీ చేశాడు విరాట్ కోహ్లీ. పింక్ బాల్ టెస్టులో సెంచరీ మార్కు అందుకున్న మొట్టమొదటి భారత బ్యాట్స్‌మెన్‌గా చరిత్ర క్రియేట్ చేశాడు.
అంతర్జాతీయ క్రికెట్ లోకి వచ్చిన సమయం నుండి కోహ్లీ వరుసగా రికార్డులను బ్రేక్ చేస్తూ… కొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ వస్తున్నాడు. అయితే కోహ్లీ ఒక్కడే సచిన్ నెలకొల్పిన 100 సెంచరీల రికార్డును బద్దలు కొట్టగలడు అని అందరూ అనుకున్నారు.
కానీ ఈ మధ్య కోహ్లీ అనుకున్న విధంగా పరుగులు చేయడం లేదు. ఎంతలా అంటే.. ఈ రోజుతో కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ లో సెంచరీ నమోదు చేసి రెండు సంవత్సరాలు పూర్తి అవుతుంది. 194 బంతుల్లో 18 ఫోర్లతో 136 పరుగులు చేసి, అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో 70వ సెంచరీ మార్కు అందుకున్నాడు కోహ్లీ.
విరాట్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత బంగ్లాదేశ్ క్రికెటర్లు చప్పట్లతో అభినందించడం, ఓ బంగ్లా క్రికెటర్ అయితే భారత కెప్టెన్‌కి సెల్యూట్ చేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.
సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ కూడా అభిమానులుగా మారిపోయి, ఆయన బ్యాటింగ్‌ని వీక్షించేవారో, విరాట్ కోహ్లీ బ్యాటింగ్, అప్పటిదాకా అలా సాగింది.
రెండేళ్లుగా కనిపించని ఆ సెంచరీ సెలబ్రేషన్స్‌ని చూడాలని ఆశపడుతున్నారు. ఎందుకంటే మళ్లీ ఒక్కసారి సెంచరీ మార్కు అందుకుంటే, రన్ మెషిన్ బ్రేకులు లేని బండిగా దూసుకుపోతుందని వారికి తెలుసు. అయితే అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీ అత్యధిక శతకాలు చేసిన జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. మొదటి రెండు స్థానాల్లో సచిన్ టెండూల్కర్ 100, రికీ పాంటింగ్ 71 సెంచరీలతో ఉన్నారు.

ఈడెన్ గార్డెన్స్‌లో సెంచరీ చేసిన తర్వాత మళ్లీ సెంచరీ మార్కు అందుకోలేకపోయాడు విరాట్. కరోనా కారణంగా 2020 సీజన్‌లో పెద్దగా క్రికెట్ జరగకపోవడం, తండ్రి కావడంతో ఆస్ట్రేలియా టూర్ ఒకే టెస్టు ఆడడంతో 71వ శతకాన్ని అందుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు విరాట్.
70వ సెంచరీ తర్వాత మొత్తంగా టీ20, వన్డే, టెస్టుల్లో కలిపి 50 మ్యాచుల్లో 56 ఇన్నింగ్స్ ల్లో బ్యాటింగ్ కి వచ్చిన విరాట్ కోహ్లీ, 40.59 సగటుతో 1989 పరుగులు చేశాడు. ఇందులో 20 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. విరాట్ కోహ్లీ 71వ సెంచరీ కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.