Begin typing your search above and press return to search.
కొండను నిర్మిస్తామంటున్న దేశం
By: Tupaki Desk | 28 Sep 2016 10:30 PM GMT వర్షమంటే వరం.. వరుణుడి కరుణ ఉన్న దేశాలు సుభిక్షంగా లేని దేశాలు నీటికి - తిండికి కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు. ఆహారాన్ని దిగుమతి చేసుకోవాలి. వర్షాలు కురవాలంటే అడవులు - కొండలు ఉంటే మంచింది. మేఘాలను కొండలు అడ్డుకున్నప్పుడు ఆ ప్రాంతాల్లో వర్షాలు పడతాయి. కానీ... అన్ని చోట్లా కొండలు ఉండవు కదా.. లేకపోతేనేం.. కొండలు కట్టయినా సరే వర్షాలు కురిపిస్తాం అంటున్నారు యునైట్ అరబ్ ఎమిరేట్స్ వారు. అవును కృత్రిమంగా కొండనే సృష్టించేందుకు సిద్ధమవుతోంది అక్కడి ప్రభుత్వం.
ఎడారి దేశమైన ఎమిరేట్సులో వర్షాలు కురిసేలా కొండలను సృష్టించేందుకు ఆ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రస్తుతం మేఘమధనం ద్వారా వర్షాలు కురిపిస్తున్నా అందుకు భారీగా ఖర్చవుతోంది. అయితే.. అంతకంటే ఎక్కువ ఖర్చుతో కూడిన పనైనా కూడా ఒకసారి నిర్మిస్తే చాలాకాలంపాటు ఉంటుందన్న ఉద్దేశంతో ఏకంగా కొండనే నిర్మించాలని భావిస్తున్నారట. కానీ.. ఇదింకా ప్రణాళికలను దాటి ముందుకెళ్లలేదు. దేంతో నిర్మించాలి.. ఎంత కొండ కట్టాలన్నది తేల్చుకోలేదు.
కొండలు లేని దేశాలు ఇలా కొండలను సృష్టించుకుంటే నదులు - సముద్రాలు లేని దేశాలు వాటినీ సృష్టించుకుంటాయేమో చూడాలి. అవన్నీ చేయడానికి ముందు ఉన్న అడవులను నరికేయకుండా పరిరక్షించుకుంటే చాలు ప్రపంచమంతటా ఏడాది పొడవునా వర్షాలు కురుస్తూనే ఉంటాయి. ప్రజల అవసరాలన్నీ తీరుతూనే ఉంటాయి.