Begin typing your search above and press return to search.
700 కోట్లు ఇస్తామని మేం చెప్పలేదే?
By: Tupaki Desk | 24 Aug 2018 10:05 AM GMTవరదలు.. భారీ వర్షాల కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్న కేరళ ప్రభుత్వానికి.. అక్కడి ప్రజలకు సహాయ సహకారాలు అందించేందుకు యూఏఈ రూ.700 కోట్ల సాయాన్ని ప్రకటించినట్లుగా వార్తలు రావటం తెలిసిందే. యూఏఈ సాయం మీద కేరళ ముఖ్యమంత్రి విజయన్ ట్వీట్ ద్వారా థ్యాంక్స్ చెప్పటాన్ని మర్చిపోలేం.
అయితే.. విదేశాల నుంచి వచ్చే సాయం సుముఖంగా లేకపోవటం... దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావటం తెలిసిందే.ఓపక్క కేంద్రం కేరళకు చేయాల్సిన సాయం చేయదు కానీ.. ఒక దేశం ఇస్తానన్న ఆర్థిక సాయానికి మాత్రం నో అని ఎలా చెబుతారంటూ మండిపాటు వ్యక్తమైంది.
ఇదిలా ఉంటే.. ఈ ఎపిసోడ్ ఆసక్తికరమైన మలుపు తిరిగింది. తాము ఎప్పుడూ కేరళకు రూ.700 కోట్ల సాయాన్ని ప్రకటించలేదని యూఏఈ రాయబారి అహ్మద్ అల్ బన్నా మీడియాకు వెల్లడించారు. వరదలు.. భారీ వర్షాల నేపథ్యంలో మిత్రుడైన కేరళకు జరిగిన నష్టానికి ఎంత ఆర్థిక సాయం అవసరమో అంచనా వేస్తున్నామే కానీ.. ఎలాంటి సాయాన్ని తాము ప్రకటించలేదన్నారు.
తాము కేరళకు ఆర్థిక సాయాన్ని ప్రకటించినట్లుగా వచ్చిన వార్తల్లోనిజం లేదన్నారు. తమకు స్నేహితులైన కేరళ ప్రజలకు అవసరమైన సాయాన్ని.. మందులను పంపటమే తమ ఉద్దేశమని.. అందుకే కమిటీ వేసినట్లుగా వెల్లడించారు. మరి.. రాయబారి మాటలే నిజమనుకుంటే.. యూఏఈ ఇస్తానన్న రూ.700 కోట్ల సాయంపై కేరళ ముఖ్యమంత్రి థ్యాంక్స్ ఎందుకు చెప్పినట్లు? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అసలు కేరళకు యూఏఈ ఆర్థిక సాయాన్ని ప్రకటించిందా? లేదా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారటమే కాదు.. ఎవరూ చెప్పకుండానే కేరళ ముఖ్యమంత్రి నోటి నుంచి యూఏఈ మాట ఎలా వచ్చిందన్నది ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.