Begin typing your search above and press return to search.

ఆ రాజును చూసైనా సిగ్గు తెచ్చుకో మోడీ

By:  Tupaki Desk   |   22 Aug 2018 5:03 AM GMT
ఆ రాజును చూసైనా సిగ్గు తెచ్చుకో మోడీ
X
నిండా మునిగిపోయినా.. న‌ష్ట‌నివారణ చ‌ర్య‌ల సంగ‌తి ఎలా ఉన్నా.. భారీగా ఆర్థిక సాయాన్ని అందించేందుకు మోడీ ప‌డే ఇబ్బంది అంతా ఇంతా కాదు. త‌న జేబులో నుంచి డ‌బ్బులు తీసిన‌ట్లుగా ఆయ‌న తెగ ఇబ్బంది ప‌డిపోతుంటారు. ప‌గోడికి కూడా క‌ల‌గ‌నంత క‌ష్టం కేర‌ళ‌కు ప్ర‌కృతి ప్ర‌కోపంతో రావ‌టం తెలిసిందే.

భారీ విధ్వంసానికి గురైన కేర‌ళ‌కు ఆర్థిక సాయాన్ని అందించేందుకు ప్ర‌ధాని మోడీ ప్ర‌క‌టించిన సాయం దేశ వాసుల్లో తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. దాదాపు వందేళ్ల త‌ర్వాత కేర‌ళ‌పై భారీ వ‌ర్షం విరుచుకుప‌డటం.. ఆ కార‌ణంగా కేర‌ళ అత‌లాకుత‌లం కావ‌ట‌మే కాదు.. ల‌క్ష‌లాది మంది ప్ర‌జ‌లు భారీగా న‌ష్ట‌పోయిన సంగ‌తి తెలిసిందే.

కేర‌ళ‌కు వ‌చ్చి ప‌డ్డ క‌ష్టంపైన యావ‌త్ దేశ‌మే కాదు.. ప్ర‌పంచవ్యాప్తంగా ప‌లు దేశాలు స్పందిస్తున్నాయి. భారీ వ‌ర్షాల‌తో.. వ‌ర‌ద‌ల‌తో అత‌లాకుత‌ల‌మైన కేర‌ళ‌కు సాయం అందించేందుకు యూఏఈ యువ‌రాజు.. డిప్యూటీ సుప్రీం క‌మాండ‌ర్ షేక్ మ‌హ‌మ్మ‌ద్ బిన్ జాయేద్ అల్ న‌హ్య‌న్ స్పందించిన‌ట్లు కేర‌ళ ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్ వెల్ల‌డించారు.

కేర‌ళ‌కు రూ.700 కోట్ల భూరి విరాళాన్ని ప్ర‌క‌టించిన‌ట్లుగా చెప్పారు. ఇదే విష‌యాన్ని ఆ దేశ యువ‌రాజు ప్ర‌ధాని మోడీతో మాట్లాడిన‌ట్లు చెప్పారు. ఈ సంద‌ర్భంగా యువ‌రాజుకు.. ఆ దేశానికి కేర‌ళ సీఎం కృతజ్ఞతలు చెప్పారు.

కేర‌ళ‌లో చోటుచేసుకున్న ప్ర‌కృతి విల‌యానికి ఆ రాష్ట్ర సర్కారు రూ.10వేల కోట్లు కోరితే.. త‌క్ష‌ణ సాయం కింద రూ.100 కోట్ల‌నే మోడీ స‌ర్కారు ఇవ్వ‌టం తెలిసిందే. పెద్ద‌న్న‌గా వ్య‌వ‌హ‌రించాల్సిన కేంద్రం తీరును ప‌లువురు త‌ప్పు ప‌ట్టారు. దేశ ప్ర‌ధానికి మించిన స్పంద‌న వేరే దేశానికి చెందిన యువ‌రాజు స్పందించ‌టం విశేషం.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. కేర‌ళ‌కు సాయం అందించ‌టానికి ప‌లు దేశాలు ముందుకు వ‌చ్చినా.. వాటిని స్వీక‌రించేందుకు కేంద్రం సుముఖంగా లేద‌న్న మాట ఇప్పుడు వినిపిస్తోంది. దేశీయ ప్ర‌య‌త్నాల ద్వారానే కేర‌ళ ప్ర‌కృతి వైప‌రీత్యాన్ని ఎదుర్కోవాల‌ని నిర్ణ‌యించిన‌ట్లుగా చెబుతున్నారు. అదే నిజ‌మైతే.. అమ్మ పెట్టా పెట్ట‌దు.. అడ‌క్క‌తినానీయ‌ద‌న్న సామెత‌కు త‌గ్గ‌ట్లే మోడీ స‌ర్కారు తీరు ఉంద‌ని చెప్పక త‌ప్ప‌దు. విదేశీ సాయాన్ని అనుమ‌తిస్తే.. దేశీయంగా త‌న వైఫ‌ల్యం అంద‌రికి తెలిసి పోతుంద‌ని మోడీ స‌ర్కారు భావిస్తుందేమో?