Begin typing your search above and press return to search.

దుబాయ్ మీదుగా జ‌ర్నీ చేసే వారికి బంప‌ర్ ఆఫ‌ర్

By:  Tupaki Desk   |   23 Jun 2018 1:30 AM GMT
దుబాయ్ మీదుగా జ‌ర్నీ చేసే వారికి బంప‌ర్ ఆఫ‌ర్
X
భార‌త్ నుంచి విదేశాల‌కు వెళ్లే ప్ర‌యాణికులు చాలామంది త‌మ జ‌ర్నీలో భాగంగా దుబాయ్ నుంచి ఫ్లైట్ మార‌టం మామూలే. ఈ సంద‌ర్భంగా ఫ్లైట్ మారిన త‌ర్వాత గంట‌ల కొద్దీ టైం ఉన్నా.. ఎయిర్ పోర్ట్‌లోనే కాల‌క్షేపం చేయాలే కానీ బ‌య‌ట‌కు వెళ్ల‌లేని ప‌రిస్థితి. తాజాగా ఆ రూల్ మారుస్తూ యూఏఈ కేబినెట్ తాజాగా నిర్ణ‌యం తీసుకుంది.

ఇప్పుడున్న నిబంధ‌న‌ల ప్ర‌కారం భార‌త్ నుంచి వివిధ దేశాల‌కు వెళ్లే అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసులు దుబాయ్ మీదుగా వెళుతుంటాయి. మార్గ‌మ‌ధ్యంలో విమానం ఆగి.. వేరే ఫ్లైట్ ను అందుకోవాల్సిన వారు.. త‌మ జ‌ర్నీ టైం వ‌ర‌కూ ఎయిర్ పోర్ట్‌లోనే ఉండాల్సి వ‌చ్చేది.

ఇప్పుడు తీసుకున్న నిర్‌న‌యంతో అలాంటి అవస‌రం ఉండ‌దు. భార‌తీయ ప్ర‌యాణికుల‌కు ఉచితంగా ట్రాన్సిట్ వీసాలు ఇవ్వాల‌ని కేబినెట్ నిర్ణ‌యం తీసుకోవ‌టం.. భార‌తీయులు త‌మ టైంకు త‌గ్గ‌ట్లు షాపింగ్ చేసుకునే వీలుంది. విమానం దిగిన నాటి నుంచి 48 గంట‌ల వ్య‌వ‌ధిలోపు ఎలాంటి రుసుములు చెల్లించ‌కుండానే షాపింగ్ చేసుకునే వెసులుబాటు ఉంది.

ఈ నిర్ణ‌యంతో ఫారిన్ వెళ్లే భార‌తీయులు మ‌ధ్య‌లో దుబాయ్ లో దిగిన‌ప్పుడు కాస్త షాపింగ్ చేసేసి త‌మ గ‌మ్య‌స్థానానికి చేరుకోవ‌చ్చు. ఇక‌.. నాలుగు రోజులు దుబాయ్ లో ఉండాల‌నుకునే వారు మాత్రం నామ‌మాత్రంగా రుసుములు చెల్లించాల్సి ఉంటుంది. అయితే.. ఈ కొత్త విధానం ఎప్ప‌టి నుంచి అమ‌లు అవుతుంద‌న్న విష‌యాన్ని మాత్రం ఇంకా ప్ర‌క‌టించ‌లేదు. కొత్త విధానం భార‌త ప్ర‌యాణికుల‌కు లాభం చేకూరుతుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.