Begin typing your search above and press return to search.
టాలెంట్ కు వీసా అంటున్న సంపన్న దేశం
By: Tupaki Desk | 6 Feb 2017 1:36 PM GMTసంకుచిత మనస్తత్వంతో వీసాల జారీలో కొత్త పోకడలు పోతున్న పెద్దన్న రాజ్యానికి భిన్నంగా వ్యవహరించిందో సంపన్న దేశం. తమకు టాలెంట్ ఉంటే చాలని.. తమ దేశానికి నిండు హృదయంతో ఆహ్వానిస్తామంటూ పేర్కొంటోంది యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్ (యూఏఈ). టాలెంట్ కు పెద్దపీట వేస్తూ.. సరికొత్త వీసా విధానాన్ని అమలు చేయాలని ఆ దేశం నిర్ణయించింది. వివిధ రంగాల్లో టాలెంట్ఉన్న వారిని తమ దేశం వైపు ఆకర్షించేందుకు వీలుగా సరికొత్త వీసా విధానాన్ని అమలు చేయాలని యూఏఈ ప్రధాని.. దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మఖ్తూమ్ అధ్యక్షతన జరిగిన కేబినేట్ సమావేశం నిర్ణయించటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
యూఏఈలో అన్ని రంగాల్లో అవకాశాలు కల్పిస్తూ.. ల్యాండ్ ఆఫ్ అపర్చునిటీస్ గా మంచి వాతావరణాన్ని కల్పించామని.. యూఏఈకి వచ్చే వారిలో టాలెంట్ ఎక్కువగా ఉన్న వారిని ఆకర్షించేందుకు కొత్త వీసా విధానాల్ని అమలు చేయాలని నిర్ణయించారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల వారు యూఏఈలో ఉంటున్న సంగతి తెలిసిందే.
ఇకపై విద్య.. వైద్యం.. టూరిజం.. సైన్స్.. పరిశోధనల రంగాలకు కూడా పెద్దపీట వేయాలని తాజా క్యాబినెట్ సమావేశం నిర్ణయించింది. ఈ రంగాలకు అత్యధిక ప్రాధాన్యత కల్పించి ఆయా రంగ నిపుణులకు పెద్ద ఎత్తున వీసాలు మంజూరు చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాల్ని త్వరలో విడుదల చేయాలని నిర్ణయించారు.
మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ప్రపంచంలోని పలు దేశాలతో సంబంధాల్ని మరింత పెంచుకోవటానికి వీలుగా రాజధాని నగరం అబుదాబిలో వివిధ దేశాల రాయబార కార్యలాయాల్ని ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాల్ని మొదలు పెట్టాలని నిర్ణయించారు. ఒకవైపు పెద్దన్న తలుపులు మూసేస్తున్న వేళ.. అందుకు భిన్నంగా యూఏఈ సరికొత్త తీరుతో టాలెంట్ కు తలుపులు తెరుస్తున్న వైనం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోందని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/