Begin typing your search above and press return to search.
కలలో కూడా ఊహించని నిర్ణయాల్ని తీసుకున్న యూఏఈ
By: Tupaki Desk | 9 Nov 2020 4:40 PM GMTకఠిన చట్టాలకు కేరాఫ్ అడ్రస్ గా యూఏఈని చెబుతారు. చిన్న నేరానికి తీవ్రమైన శిక్షల్ని అమలు చేస్తుంటారు. కొద్దిమంది ఇలాంటి తీరును తప్పు పట్టినా.. అలాంటి విధానాల వల్లే.. నేరాలు తక్కువగా జరుగుతున్నాయన్న మాట వినిపిస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే.. మారుతున్న కాలానికి తగ్గట్లు యూఏఈ తన తీరును మార్చుకోవటానికి.. ఇప్పటివరకు నేరాలుగా భావించిన కొన్ని అంశాల విషయంలో తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి.
ఇప్పటివరకు యూఏఈలో మద్యం సేవించటం.. యువతీయువకులు సహజీవనం చేయటం నేరం. తీవ్రమైన శిక్షలు విధించే వారు. ఇప్పుడు ఆ అంశాల విషయంలో సంచలన నిర్ణయాల్ని ప్రకటించింది యూఏఈ ప్రభుత్వం. దీని ప్రకారం ఇప్పటి నుంచి మద్యం సేవించటం ఆ దేశంలో నేరం కాదు. అంతేకాదు.. యువతీ యువకులు సహజీవనం చేయటం కూడా తప్పు కాదు. 21 ఏళ్లకు పైబడిన వారు మద్యాన్ని సేవించొచ్చు. తమతో పాటు ఉంచుకోవచ్చు.
పెళ్లి కాని యువతీయువకులు కలిసి ఒకే చోట ఉండొచ్చని పేర్కొన్నారు. పెట్టుబడుల వాతావరణాన్ని మరింతగా సులువు చేయటంతో పాటు.. చట్టాల అమలును మెరుగుపరిచే చర్యల్లో భాగంగా కొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టామని చెబుతోంది యూఏఈ ప్రభుత్వం. తాజాగా వెలువడిన నిర్ణయాల్ని అక్కడి ప్రజలు స్వాగతిస్తున్నారు. పలు సవాళ్లు ఎదురైన ఈ ఏడాదిలో.. కీలక మార్పుల దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. మొత్తానికి.. కొత్త నిర్ణయాలతో యూఏఈ మొత్తంగా మారిపోనుందా? ప్రాశ్చాత్య దేశాలతో పోటీ పడే వాతావరణం ఆ దేశాల్లో త్వరలో చోటు చేసుకోనుందా? అన్న భావన కలుగక మానదు.