Begin typing your search above and press return to search.
ఉబర్ బస్సులు వచ్చేస్తున్నాయ్
By: Tupaki Desk | 23 Oct 2019 7:00 AM GMTక్యాబ్, ఆటో, కొన్నిచోట్ల మోటార్ సైకిల్ సర్వీసులు కూడా అందిస్తున్న ఉబర్ సంస్థ ఇప్పుడు పెద్దనగరాల్లో బస్సులు కూడా తిప్పడానికి రెడీ అవుతోంది. భారత్‌లో మొట్టమొదట ప్రయోగాత్మకంగా దిల్లీలో ఈ సేవలు అందించడానికి ఏర్పాట్లు చేస్తోంది. దీనికి సంబంధించి ఒక యాప్‌ను ఆవిష్కరించింది కూడా. అయితే, ఈ బస్సులు క్యాబ్‌ల్లా ఇంటివరకు రావు. నిర్దేశిత పికప్ పాయింట్లలో ఎక్కాల్సిందే.
వీటిని తొలుత దిల్లీలో కొన్ని ఎంపిక చేసిన ప్రధాన రూట్లలో నడుపుతారు. ఒకవేళ విజయవంతమైతే అన్ని చోట్లకూ, అన్ని ప్రధాన నగరాలకూ విస్తరిస్తామని ఉబర్ తెలిపింది. ఓ రకంగా ఇది ప్రస్తుతం క్యాబ్‌ల తరహాలోనే నడుస్తుంది. యాప్‌లో వినియోగదారులు తమ పికప్, డ్రాపింగ్ పాయింట్లను లోడ్ చేయవచ్చు. నిర్ణీత ప్రదేశంలో మాత్రమే ఎక్కాలి తప్ప ఇంటి వరకూరాదు. కేవలం రెండు నుంచి ఐదు నిమిషాల సేపు మాత్రమే ఆగుతుంది. వెయిటింగ్ ఉండదు. అదే విధంగా మన గమ్యస్థానానికి అతి సమీపాన విడిచిపెడతారు. బస్సులన్నీ ఏసీవే ఉంటాయి.
యాప్ ద్వారా సీట్లు ముందే రిజర్వ్ చేసుకోవాలి. మధ్యమధ్యలో ఆపి యాప్ ద్వారా బుకింగ్ చేసుకోని వారిని ఎక్కించుకోవడం ఉండదు. బస్సు ఎక్కగానే బార్‌కోడ్‌ను స్కాన్ చేసి టికెట్‌ను చూపి- నగదు ద్వారా గానీ లేదా పేటీఎం లాంటి ద్వారా గానీ ధర చెల్లించవచ్చు. బస్సు ట్రాకింగ్ చేసుకోవచ్చు. మనం దిగే పాయింట్ చేరువైనపుడు యూబర్ నుంచి అలర్ట్స్ వస్తాయి. మన గమ్యస్థానానికి వెళ్లేందుకు నోటిఫికేషన్లూ వస్తాయి.
దిల్లీలో ఇది సక్సెస్ అయితే, దేశంలోని ఇతర రాష్ట్రాలకూ దీన్ని విస్తరిస్తామని ఉబర్ చెబుతోంది. మొత్తానికి నగరాల్లో ఇది మంచి ఆప్షన్‌గా మారే అవకాశం ఉంది. అయితే, రేట్లు ఎలా ఉంటాయన్నదే అసలు ప్రశ్న.