Begin typing your search above and press return to search.
రేప్ చేస్తాడేమోనని క్యాబ్ దూకేసింది
By: Tupaki Desk | 8 July 2016 8:08 AM GMT'ఏక్ దమ్ చుప్! తోకీ కిడ్నాప్ కోరే రేప్ కోరే దేబో (నోరు ముయ్యి! లేకుంటే నిన్ను కిడ్నాప్ చేసి అత్యాచారం చేస్తా)' అన్న క్యాబ్ డ్రైవర్ మాటలు విని వణికిపోయిన ఓ యువతి కారులో నుంచి దూకేసింది. కోలకతాలో జరిగిన ఈ ఘటనకు ఉబర్ డ్రైవర్ కారణం. ఆయన్ను సస్పెండ్ చేసినట్లు ఆ సంస్థ తాపీగా ప్రకటించింది.
కోల్కతాలోని సాల్ట్ లేక్ సమీపంలోని జేడీ బ్లాక్ సమీపం నుంచి బాధితురాలు - తన స్నేహితురాలితో కలసి రాత్రి 10 గంటల సమయంలో ఓ క్యాబ్ ను బుక్ చేసుకుంది. ఆపై తన స్నేహితురాలిని ఆర్యన్ భవన్ వద్ద దిగబెట్టి - తన గమ్యస్థానానికి వెళుతున్న వేళ ఈ ఘటన జరిగింది. కారు రాంగ్ రూట్ లో వెళుతున్న విషయాన్ని గమనించిన బాధితురాలు హెచ్చరించగా - కాసేపు సరైన దారిలోనే వచ్చిన క్యాబ్ డ్రైవర్ మరోసారి తప్పు దారిలోకి కారును నడిపించాడు. దీంతో ఆమె ప్రమాదాన్ని గమనించి కేకలు పెడుతుంటే - డ్రైవర్ నోటికి వచ్చినట్టు దూషించడం మొదలు పెట్టాడు. కిటికీ అద్దాలు తెరచి సహాయం కోసం ఆమె అరుస్తూ - రోడ్డుపై ఎవరూ లేరని తెలుసుకుని కారులో నుంచి దూకేందుకు సిద్ధపడింది.
అయితే ఆమె ప్రయత్నాన్ని గమనించిన డ్రైవర్ కాళ్లను బంధించేందుకు - ముందు సీటును వెనక్కు నెట్టాడు. కారు దిగాలని చూస్తే - గుద్ది చంపుతానని బెదరించాడు. దీంతో వెన్నులో వణుకు పుట్టి, ఆమె కారు నుంచి సడన్ గా కిందకు దూకింది. ఆ తరువాత కూడా కారును రివర్స్ చేసుకుని ఆమెపైకి ఎక్కించేందుకు డ్రైవర్ ప్రయత్నించగా, ఓపిక తెచ్చుకున్న బాధితురాలు డివైడర్ ను దాటుకుని అవతలికి చేరి ప్రాణాలు కాపాడుకుంది. జరిగిన ఘటనను ఉబర్ కు - విధాన్ నగర్ ఉత్తర పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, నిందితుడు సంతూ ప్రమాణిక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని సస్పెండ్ చేసినట్టు ఉబర్ వెల్లడించింది.