Begin typing your search above and press return to search.

అంచ‌నాల‌కు భిన్నంగా ఉబెర్ సీఈవో!

By:  Tupaki Desk   |   28 Aug 2017 9:55 AM GMT
అంచ‌నాల‌కు భిన్నంగా ఉబెర్ సీఈవో!
X
ఇటీవ‌ల కాలంలో మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లకు - ముఖ్యంగా సాఫ్ట్ వేర్ రంగంలోని వారికి అత్యంత చేరువైన ఉబెర్ ట్యాక్సీలు ఎన్నో ప్ర‌శంస‌లు పొందాయి. స్టార్ట‌ప్ కంపెనీగా ప్రారంభ‌మైన ఈ ఉబెర్ ప్ర‌స్థానం అనూహ్యంగా పెరిగిపోయింది. ప్ర‌పంచ దేశాల్లో మంచి గుర్తింపు పొందింది. ముఖ్యంగా భార‌త్ వంటి వ‌ర్ధ‌మాన దేశాల్లో ఉబెర్ వాహ‌నాల వాడ‌కం ఇప్పుడిప్పుడే పెరుగుతున్న నేప‌థ్యంలో మార్కెట్‌ ను అందిపుచ్చుకుంది. అయితే, అదేస‌మ‌యంలో ఒంట‌రిగా ప్ర‌యాణిస్తున్న‌ మ‌హిళ‌ల‌పై జరుగుతున్న దాడులు పెరుగుతుండ‌డం కూడా సంస్థ‌కు బ్యాడ్ నేమ్ తెచ్చిపెట్టింది. ఈ క్ర‌మంలోనే విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి.

దీంతో కంపెనీ వాటాదారుల నుంచి ఒత్తిడి పెరగడంతో సీఈవో రాజీనామా చేయక తప్పలేదు. ఉబెర్‌ మాజీ సైట్ ఇంజనీర్ అయిన సుసాన్ ఫౌలర్ తన సుదీర్ఘమైన బ్లాగ్ పోస్ట్ లో తన మాజీ అధికారులపై లైంగిక ఆరోపణల చేయడం వైరల్‌ అయింది. దీంతో సంస్థ అంతర్గత విచారణను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో లైంగిక వేధింపు - వివక్షత - బెదిరింపు మరియు అనైతిక ప్రవర్తన తదితర 200 ఆరోపణలతో యుబర్ అప్పటికే 20 మంది ఉద్యోగులను తొలగించింది. మ‌రోప‌క్క‌ - వ్యవస్థాపకుడు - మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ట్రావిస్ కాలనిక్ కూడా త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు.

ఈ నేప‌థ్యంలో ఇప్పుడు తాజాగా అమెరికాలోని శాన్‌ ఫ్రాన్సిస్కోకు చెందిన ప్రముఖ క్యాబ్‌ అగ్రిగేటర్‌ - అమెరికా ట్రావెల్ కంపెనీ ఎక్స్‌ పీడియాకు చెందిన దారా ఖోస్రోషాహి ప్ర‌స్తుతం ఉబెర్ కంపెనీకి సీఈవోగా ఎంపిక‌య్యారు. ఆదివారం రాత్రి కంపెనీ జారీ చేసిన ప్రకటన ప్రకారం ఇరాన్‌ కు చెందిన ఖోస్రోషాహిని కొత్త సీఈవోగా ఎంపిక చేసిన‌ట్టు తెలిసింది. కాగా 2015నుంచి ప్రధాన ఆర్థిక అధికారి (సీఎఫ్‌ వో) లేకుండానే ఉబెర్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. రెండవ త్రైమాసికంలో యుబెర్ సేల్స్‌ గత త్రైమాసికం నుంచి 17 శాతం పెరిగి రెండవ త్రైమాసికంలో 1.75 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇంత పెద్ద కంపెనీకి ఇరానీయ‌న్‌ ను సీఈవోగా నియ‌మించ‌డం గ‌మ‌నార్హం.