Begin typing your search above and press return to search.
అంతరిక్షంలో కూడా ఊబెర్ ఫుడ్ డెలవరీ
By: Tupaki Desk | 16 Dec 2021 10:30 AM GMTటెక్నాలజీ మారిన నేపథ్యంలో ప్రతి ఒక్కటి కూడా ఆన్ లైన్ సర్వీస్ అయ్యింది. గుండు పిన్ను నుండి మొదలుకుని విమాన టికెట్టు వరకు ప్రతి ఒక్కటి కూడా ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకునే వెసులుబాటు కలిగింది. ప్రతి ఒక్కటి అరచేతిలో ఉన్న ఈ సమయంలో ఇంట్లో కూర్చుని మొబైల్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేస్తే ఇంటికి తీసుకు వచ్చే సదుపాయం ఊబెర్.. స్విగ్గీ వంటి సంస్థలు అందిస్తున్నాయి.
మొదట మెట్రో నగరాలకు పరిమితం అయిన ఈ ఫుడ్ డెలవరీ సేవలు ఇప్పుడు చిన్న చిన్న పట్టణాలు మరియు పల్లెలకు కూడా వ్యాప్తి చెందాయి. ప్రతి ఒక్క చోట కూడా స్విగ్గీ.. జమోటో.. ఊబెర్ లు ఉంటున్నాయి. ఊబెర్ ఈట్స్ వారు ఏకంగా అంతరిక్షంలో కూడా ఫుడ్ డెలవరీ చేసి అత్యంత అరుదైన రికార్డును నమోదు చేయడం జరిగింది.
అంతరిక్షంలో ఫుడ్ ఎలా డెలవరీ చేస్తున్నారు అనే అనుమానం కలుగవచ్చు. నిజంగానే అంతరిక్షంలో ఫుడ్ ను ఊబెర్ ఈట్స్ సంస్థ ఒక వ్యోమగామికి డెలవరీ చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జపాన్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అంతరిక్షంలోకి వెళ్లాలని చాలా కాలంగా కోరుకుంటున్నారు.
ఈమద్య కాలంలో పలువురు బిలియనీర్ లు అంతరిక్ష యాత్ర చేసి వస్తున్నారు. సరదాగా వందల కోట్లు ఖర్చు చేసి అలా వెళ్లి ఇలా వస్తున్నారు. కొందరు ఛాలెంజ్ గా తీసుకుని వెళ్తుంటే మరి కొందరు సరదాగా వెళ్తున్నారు. అలాగే జపాన్ కు చెందిన బిలియనీర్ యుసాకు మేజావా కూడా అంతరిక్షంలోకి ఈనెల 11వ తారీకున స్పెషల్ స్పేస్ లో వెళ్లాడు. ఆయనతో పాటు ఊబెర్ ఈట్స్ సంస్థ ఫుడ్ కూడా వెళ్లింది.
యుసాకు మేజావా అంతరిక్షంలో అడుగు పెట్టిన 9 గంటల తర్వాత ఊబెర్ ఈట్స్ క్యాప్ పెట్టుకుని ఉన్న మరో వ్యోమగామి ఆ ఫుడ్ ను యుసాకు అందజేశాడు. ఆ ఫొటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మేము ఎక్కడ ఉన్నా కూడా ఫుడ్ ను డెలవరీ చేస్తాం అంటూ ఊబెర్ ఈట్స్ వారు ఈ ఫొటోలను పెట్టుకుని తమ ప్రచారంకు ఉపయోగించుకుంటున్నారు. పబ్లిసిటీ లో మరో కోణం అన్నట్లుగా కొందరు దీనిని పరిగణిస్తుంటే మరి కొందరు మాత్రం ఇది జెన్యూన్ ఫుడ్ డెలవరీ ఎలా అవుతుందని విమర్శిస్తున్నారు.
అతడికి కొన్ని గంటల ముందు ఫుడ్ ను ఇచ్చేసి అతడి పక్కనే ఉన్న ఫుడ్ ను ఆ తర్వాత కొన్ని గంటలకు మళ్లీ అందజేసి అంతరిక్షంలో ఫుడ్ డెలవరీ అంటూ ప్రచారం చేసుకోవడం.. దాంతో జనాలను మోసం చేయడం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఊబెర్ ఈట్స్ క్యాప్ పెట్టుకుని.. ఊబెర్ ఈట్స్ లోగో ఉన్న ఫుడ్ కవర్ ను కస్టమర్ కు అందజేయడం వల్ల ఇది ఒక రికార్డుగానే చెప్పుకోవాలి.