Begin typing your search above and press return to search.
ఉదయపూర్ మర్డర్.. రాజీకొచ్చినా కిరాతకంగా హత్య చేశారా?
By: Tupaki Desk | 30 Jun 2022 3:29 AM GMTరాజస్థాన్ లోని ఉదయపూర్ లో జరిగిన టైలర్ హత్యకు అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ఒక టైలర్ ను ఇద్దరు రాజస్థాన్ లోని ఉదయపూర్ లో మెడ నరికి చంపిన సంగతి తెలిసిందే. హతుడు కన్హయ్య లాల్‌ను హంతకులు గౌస్ మహ్మద్, రియాజ్ అహ్మద్‌లు అతిదారుణంగా పట్టపగలే అతడి టైలరింగ్ షాపులోనే నరికి చంపడం, పైగా దాన్ని వీడియో తీసుకోవడం.. వైరల్ చేయడం కలకలం రేపాయి.
పైగా హంతకులు ప్రధాని నరేంద్ర మోడీని సైతం చంపుతామని బెదిరించడం తీవ్ర ఉద్రికత్తలకు దారితీసింది. ఉదయపూర్ లో కర్ఫ్యూ, 144 సెక్షన్ విధించారు. ఇంటర్నెట్ పై నిషేధం కొనసాగుతోంది. అదనపు బలగాల పహారాలో ప్రస్తుతం ఉదయపూర్ నగరం ఉంది. వర్తక, వ్యాపార, వాణిజ్య కేంద్రాలు, మార్కెట్లు అన్నీ మూతపడ్డాయి.
పోలీసులు ఘటన జరిగిన రోజే పారిపోతున్న హంతకులు ఇద్దరిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా హంతకులకు సంబంధించి అనేక విషయాలు బయటపడుతున్నాయి. పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థలతో హంతకులిద్దరికి సంబంధాలు ఉన్నాయని వెల్లడైంది. హంతకులు ఇద్దరూ పాకిస్తాన్‌లోని ఒక ముస్లిం ఛాందసవాద సంస్థ దావత్-ఎ-ఇస్లామీతో సంబంధాలు కలిగి ఉన్నారని అంటున్నారు.
ఈ మేరకు హంతకులిద్దరూ పాకిస్థాన్ లోని ముఖ్య నగరం కరాచీకి వెళ్లి వచ్చారని తేలింది. ఈ మేరకు కేసు దర్యాప్తును తన చేతుల్లోకి తీసుకున్న నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ (ఎన్ఐఏ) దర్యాప్తులో ఈ విషయం వెల్లడైందని తెలుస్తోంది.
కాగా హతుడు కన్హయ్య లాల్ మహ్మద్ ప్రవక్తపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాక పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయనను బెయిల్ మీద వదిలిపెట్టారు. ఆ తర్వాత తనకు బెదిరింపులు వస్తున్నాయని, తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఇరు వర్గాలను పిలిచి మాట్లాడారు. దీంతో ఇరు వర్గాలు రాజీకొచ్చాయి. తమ మధ్య ఎలాంటి అపార్థాలు లేవని.. ఎలాంటి దాడులకు పాల్పడబోమని పోలీసులకు హామీ కూడా ఇచ్చారు. అయితే.. ఇంతలోనే కన్హయ్య లాల్ ను గౌస్ మహ్మద్, రియాజ్ హత్య చేశారు.
టైలర్ కన్హయ్య లాల్‌ను హత్య చేసిన హంతకులు గౌస్ మహ్మద్, రియాజ్ అహ్మద్‌లు బీజేపీ నేతలు నవీన్ జిందాల్ ను, నుపుర్ శర్మను కూడా నిందితులు చంపుతామని బెదిరించినట్టు తెలుస్తోంది.