Begin typing your search above and press return to search.
ఉద్ధానం బాధితులకు అండగా సర్కారు కీలక నిర్ణయం!
By: Tupaki Desk | 3 Sep 2019 3:12 PM GMTశ్రీకాకుళం జిల్లా ఉద్ధానం కిడ్ని బాధితులకు అండగా వైఎస్సార్ పార్టీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్ధానంలో వేలాది మంది కిడ్ని బాధితులు ఉన్నారు. వీరిని గత ప్రభుత్వాలు పట్టించుకున్న దాఖాలాలు లేవు. వైసీపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉద్ధానం బాధితులకు అండగా ఉంటామని హామి ఇచ్చింది. ఆ హామి మేరకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఉద్దానం బాధితుల కోసం 200 పడకల సూపర్ స్పెషాలిటి ఆస్పత్రిని మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఆస్పత్రికి అనుసంధానంగా రీసెర్చ్ సెంటర్ - డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేస్తూ ఆస్పత్రి - కిడ్నీ రీసెర్చ్ సెంటర్ - డయాలసిస్ యూనిట్ కు రూ.50 కోట్లు కేటాయించింది. ఆస్పత్రిలో సిబ్బందిని నియమిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. రెగ్యులర్ ఉద్యోగులుగా ఐదుగురు - కాంట్రాక్ట్ సిబ్బంది 98 మంది - ఔట్ సోర్సింగ్ కింద 60 పోస్టులను మంజూరు చేసింది. సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్దానం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఉద్దానంలో 112 గ్రామాల్లో బాధితులు ఉన్నారు. ఆ తర్వాత కృష్ణా జిల్లా జి.కొండూరు - ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో డయాలసిస్ బాధితులు ఉన్నారు. వీళ్లందరూ పేదవాళ్లే. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో 4 వేల మందికి మాత్రమే నెలకు రూ.2,500 చొప్పున పింఛను ఇచ్చేవారు. 2019 ఫిబ్రవరి తరువాత 8,500 మందికి రూ.3,500 చొప్పున రూ.2.80 కోట్లను వ్యయం చేశారు.
వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక రూ.10 వేల చొప్పున 8,500 మందికి నెలకు రూ.8.50 కోట్లను చెల్లిస్తున్నారు. కేవలం కిడ్నీ బాధితులకు ఇచ్చే పింఛను వ్యయమే ఏడాదికి రూ.102 కోట్లు కానుంది. అంతే కాకుండా ఉద్దాన సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ఇపుడు రూ.50 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి - రీసెర్చ్ సెంటర్ - డయాలసిస్ యూనిట్ ఏర్పాటుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.