Begin typing your search above and press return to search.
ఆయన సూచనతో రెండు రోజుల ముందే ఉద్దవ్ ప్రమాణస్వీకారం?
By: Tupaki Desk | 27 Nov 2019 4:44 AM GMTరీల్ లో కూడా సాధ్యం కాని మలుపులు రియల్ గా చూపించిన ఘనత మహారాష్ట్ర రాజకీయానిదే. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచి నిన్నటి వరకూ చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలు అన్ని ఇన్ని కావు. ఇక.. మహా ట్విస్టులకు కొదవలేదని చెప్పాలి. బలం లేకున్నా అత్యాశతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి.. చివరకు చేతులెత్తేసిన వైనం చూస్తే.. మోడీషాలకు దిమ్మ తిరిగే షాక్ ను మహారాష్ట్ర ఇచ్చిందని చెప్పాలి.
మంగళవారం ఉదయం సుప్రీంకోర్టు తీర్పుతో మొదలైన కలకలం.. కొద్ది గంటల్లోనే నాలుగు రోజుల పాటు ప్రభుత్వాన్ని నడిపిన దేవేంద్ర ఫడ్నవీస్ తన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో కూటమి ముఖ్యమంత్రిగా శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేందుకు సిద్ధమయ్యారు. ఆయన్ను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ కోరారు.
ముందుగా డిసైడ్ చేసిన దాని ప్రకారం ఈ ఆదివారం (డిసెంబరు 1న) ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయాలని ఉద్దవ్ నిర్ణయించుకున్నారు. అయితే.. గవర్నర్ ను కలిసిన సందర్భంగా కాస్త ముందుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరటంతో మనసు మార్చుకున్న ఉద్దవ్ రేపు (గురువారం) ప్రమాణస్వీకారం చేయటానికి ఓకే చెప్పారు. ముంబయిలోని ట్రైడెంట్ హోటల్లో భేటీ అయిన మహావికాస్ అఘాడీ నేతలు.. తమ నేతగా ఉద్దవ్ ను ఎన్నుకున్నారు. డిసెంబరు ఒకటిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
అనంతరం రాజ్ భవన్ కు వెళ్లిన ఉద్దవ్.. గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ తో దాదాపు రెండు గంటల పాటు చర్చలు జరిపారు. అనంతరం ఆయన సూచన మేరకు ఆదివారం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న తమ నిర్ణయాన్ని మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ముందుగా అనుకున్న దాని కంటే మూడు రోజుల ముందే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వీలుగా ప్రమాణస్వీకారం చేస్తామన్నారు. ఇదిలా ఉంటే.. తనను సీఎంగా ఎంపిక చేస్తూ తీసుకున్న నిర్ణయంపై ఫడ్నవీస్ చేసిన విమర్శల్లో ప్రతి ఒక్కదానికి తాను సమాధానం ఇస్తానని ఉద్దవ్ వ్యాఖ్యానించారు.