Begin typing your search above and press return to search.

బీజేపీకి మ‌ద్ద‌తు ఉప‌సంహ‌రిస్తాం

By:  Tupaki Desk   |   30 Oct 2015 3:08 PM GMT
బీజేపీకి మ‌ద్ద‌తు ఉప‌సంహ‌రిస్తాం
X
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నిర‌స‌న‌ల జోరు పెరుగుతోంది. ఇన్నాళ్లు త‌మ అభిప్రాయాలు వెల్ల‌డిస్తూ వ‌చ్చిన మిత్ర‌పక్షాలు ఇపుడు ఏకంగా హెచ్చ‌రిక‌లు జారీచేస్తున్నాయి. అది కూడా ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తు ఉప‌సంహ‌రించుకుంటాయ‌నే స్థాయికి చేరిపోయాయి. బీజేపీ-శివ‌సేన‌లు మిత్ర‌ప‌క్ష‌మే అయిన‌ప్ప‌టికీ ఉప్పు-నిప్పులా ఉన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా శివ‌సేన నుంచే ఈ హెచ్చ‌రిక వ‌చ్చింది.

మ‌హ‌రాష్ర్టలోని కల్యాణ్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన శివసేన అధ్యక్షుడు ఉధవ్ థ్రాక్రే ఈ మేర‌కు బీజేపీపై నిప్పులు చెరిగారు. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న ఫడ్నవీస్ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ అహంభావంతో వ్యవహరిస్తోంద‌ని విమర్శించారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని సర్కార్ దుర్వినియోగం చేస్తే తాము దారిలో పెడతామని ఠాక్రే పేర్కొన్నారు. ప్ర‌జా వ్య‌తిరేక చ‌ర్య‌ల‌కు పాల్ప‌డితే బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటామని హెచ్చరించారు. ప్రజలు ఇందిరాగాంధీనే అధికారం నుంచి దింపేశారనీ, బీజేపీ ఎంత అని వ్యాఖ్యానించారు.

మ‌హారాష్ర్ట‌లో జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో త‌మ ప్రాభ‌వాన్ని చాటుకునేందుకు అధికార బీజేపీ స‌హా శివ‌సేన‌, ఎన్సీపీల‌తో పాటు కాంగ్రెస్‌, కొత్త‌గా తెర‌మీద‌కు వ‌చ్చిన ఎంఐఎంలు తీవ్ర ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. ఈ క్ర‌మంలో తాజాగా ఆయా పార్టీల నేత‌ల మ‌ధ్య వాదోప‌వాదాల జోరు పెరుగుతోంది.