Begin typing your search above and press return to search.
మోడీషాల పేర్లు చెప్పకుండానే పరువు తీసిన ఆ రాష్ట్ర సీఎం
By: Tupaki Desk | 17 Oct 2021 5:03 AM GMTఅధికారం చేతిలో ఉన్న వారు.. తమకున్న ఆయుధాల్ని అర్థవంతంగా వినియోగించాల్సి ఉంటుంది. వ్యవస్థల్ని తమకున్న పవర్ తో నియంత్రించటం ద్వారా.. వ్యవస్థల్ని నిర్వీర్యం చేయటమేకాదు.. దరిద్రపుగొట్టు సంప్రదయాల్ని తీసుకురావటం ఈ మధ్యన ఎక్కువైంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న వేళ.. రాష్ట్రాల్ని నియంత్రించటం.. తమకు భిన్నమైన ప్రభుత్వాలు ఉన్న వేళ.. వారిని అదే పనిగా కెలకటం.. వారి ప్రభుత్వాల్ని అస్థిరపరిచేలా చేయటం లాంటి విషయంలో కాంగ్రెస్ కున్న గ్రాండ్ హిస్టరీ మరెవరికీ లేదన్న మాట వినిపించేది.
అలాంటి లోటుపాట్లను సరిదిద్దుకుంటున్నారు మోడీషాల ద్వయం. అధికారంలోకి వచ్చిన ఏడున్నరేళ్ల కాలంలో తమ దారికి అడ్డు వచ్చిన వారిని.. రాజకీయంగా ఇబ్బంది పెట్టే వారి విషయంలో తమదైన ఫార్ములాను తెర మీదకు తీసుకొస్తూ వారందరికి చుక్కలు చూపిస్తున్న మోడీషాల తీరుపై పెద్ద ెత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తమకు అనువుగా లేని ప్రభుత్వాలకు చుక్కలు చూపించేందుకుకేంద్రం పరిధిలోని దర్యాప్తు సంస్థల్ని రంగంలోకి దించుతున్నట్లుగా విపక్షాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే విలేకరులతో మాట్లాడారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు (వచ్చే నెలతో) అవుతుందని చెప్పారు.
తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు పలు ప్రయత్నాలు చేశారని.. దమ్ముంటే తమ ప్రభుత్వాన్ని కూల్చాలని ఆయన సవాలు విసిరారు. మోడీషాల పేర్లను నేరుగా ప్రస్తావించకుండానే కేంద్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పు పట్టారు. మహారాష్ట్రలోనే డగ్ర్స్ దొరుకుతున్నాయా? అని ప్రశ్నించిన ఆయన.. ముంద్రా పోర్టులో పట్టుకున్న కోట్లాది రూపాయిల విలువైన డ్రగ్స్ మాటేమిటి? అని ప్రశ్నించారు.
కేంద్ర దర్యాప్తు సంస్థలు చిటికెడు డ్రగ్స్ ను పట్టుకొని హడావుడి చేస్తున్నాయని.. కానీ తమ పోలీసులు మాత్రం ఏకంగా రూ.150 కోట్ల విలువైన డ్రగ్స్ ను పట్టుకున్నారని గొప్పగా చెప్పారు. సెలబ్రిటీల్ని పట్టుకోవటం.. వారితో ఫోటోలు దిగేందుకు చూపే ఆసక్తే ఎక్కువగా ఉందంటూ సెటైర్లు వేయటం గమనార్హం.