Begin typing your search above and press return to search.

బీజేపీకి మాత్రమే దూరం..హిందుత్వనికి కాదు!

By:  Tupaki Desk   |   7 March 2020 12:44 PM GMT
బీజేపీకి మాత్రమే దూరం..హిందుత్వనికి కాదు!
X
మహారాష్ట్ర సీఎం ఉధ్ధవ్ థాక్రే ..మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత మొట్టమొదటి సారిగ అయోధ్య పర్యటనకి వచ్చారు. గతంలో అయన రెండుసార్లు అయోధ్య పర్యటనకి వచ్చినప్పటికీ ..సీఎం అయ్యాక , ముఖ్యమంత్రి హోదాలో రావడం ఇదే తొలిసారి. అయోధ్య లో పర్యటన సందర్భంగా శనివారం మీడియా తో మాట్లాడిన సీఎం ఉధ్ధవ్ థాక్రే .. భారతీయ జనతా పార్టీ హిందుత్వనికి కాదని, అదిమరో అంశమని, శివసేన బీజేపీకి మాత్రమే దూరమైంది అని, హిందూత్వకు మాత్రం తాము దూరం కాలేదని తెలిపారు.

అలాగే, అయోధ్యలో రామాలయ నిర్మాణానికి తమ ప్రభుత్వం కోటి రూపాయల విరాళం ఇస్తుందని ఆయన ప్రకటించారు. గతంలో చివరిసారి తాను ఇక్కడికి వచ్చినప్పుడు.. రామాలయ నిర్మాణంపై అయోమయ పరిస్థితి నెలకొని ఉందని ఆయన గుర్తు చేశారు. 2018 నవంబరులో ఇక్కడికి వచ్చానని, అయితే గత ఏడాది నవంబరులో సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ప్రకటించిందని, తాను దాదాపు అదే సమయంలో ముఖ్యమంత్రిని అయ్యానని ఆయన చెప్పారు. మూడో సారి ఇక్కడికి వచ్చాను. అయోధ్యను నేను ఎప్పుడు సందర్శించినా ఇక్కడ నాకు శుభ సమాచారం లభిస్తోంది అని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే గుడి నిర్మాణంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో మాట్లాడాను అని , ఆలయ నిర్మాణం జరగడం తథ్యమని అన్నారు. అయితే ఈ గుడి నిర్మాణానికి తోడ్పడే భక్తులకోసం ఏదైనా కొంత స్థలాన్ని కేటాయించాలని కోరాను అని సీఎం ఉధ్ధవ్ థాక్రే తెలిపారు.