Begin typing your search above and press return to search.

తిట్టినా మోడీకి మ‌ద్దతు ఇస్తున్న మిత్రుడి మాట ఇది

By:  Tupaki Desk   |   20 April 2019 12:28 PM GMT
తిట్టినా మోడీకి మ‌ద్దతు ఇస్తున్న మిత్రుడి మాట ఇది
X
మంట పుట్టేలా మాట్లాడుతూ.. ఇవాళో.. రేపో క‌చ్ఛితంగా క‌టీఫ్ చెప్పేస్తార‌న్న‌ట్లుగా క‌ర‌కు వ్యాఖ్య‌లు చేయ‌టంలో శివ‌సేన అధినేత ఉద్ద‌వ్ ఠాక్రేగా చెప్పాలి. మోడీషాలు చేసే త‌ప్పుల‌కు త‌ర‌చూ పంచ్ లు వేస్తూ.. వారిని ఏమైనా అన‌గ‌లిగిన స‌త్తా త‌మ‌కు సొంత‌మ‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌టంలో శివసేన చీఫ్ ముందుంటారు. మోడీషాల నిర్ణ‌యాల‌పై విమ‌ర్శ‌లు చేస్తూనే.. మ‌రోవైపు మిత్రుడిగా ఎన్నిక‌ల బ‌రిలోకి దిగ‌టానికి కార‌ణం ఏమిటి? అన్న ప్ర‌శ్న‌కు ఇప్ప‌టివ‌ర‌కూ స‌మాధానం రాని ప‌రిస్థితి.

తాజాగా ఆ ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పేశారు ఉద్ద‌వ్ ఠాక్రే. మోడీతో క‌లిసి ఎన్నిక‌ల బ‌రిలోకి దిగటానికి ఉన్న బ‌ల‌మైన‌ కార‌ణాన్ని ఆయ‌న వివ‌రించారు. పాక్ లాంటి శ‌త్రుదేశాల‌పై దాడి చేసే ధైర్య సాహ‌సాలు మోడీలో ఉన్నాయ‌ని.. అందుకే త‌మ మ‌ద్ద‌తు ఇచ్చిన‌ట్లు పేర్క‌న్నారు.

గ‌డిచిన నాలుగేళ్ల‌లో బీజేపీపై అనేక ఆరోప‌ణ‌లు చేసిన ఆయ‌న‌.. తాజాగా ఎన్నిక‌ల్లో క‌లిసి పోటీ చేయ‌టాన్ని స‌మ‌ర్థించుకున్నారు. మోడీపై అనేక ఆరోప‌ణ‌లు వ‌చ్చిన‌ప్ప‌టికీ.. దాయాదికి ధీటైన స‌మాధానం చెప్ప‌గ‌లిగే వ్య‌క్తి కోస‌మే బీజేపీతో క‌లిసి పోటీకి దిగామ‌న్నారు. బీజేపీతో పొత్తు విష‌యంలో.. తాము మ‌హారాష్ట్ర ప్ర‌యోజ‌నాల్ని కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న‌ట్లుగా చెప్పారు.

ఆర్టిక‌ల్ 370ను..దేశ వ్యాప్తంగా ఒకే చ‌ట్టాలు అమ‌లుకావాల‌న్న త‌మ పార్టీ నిర్ణ‌యంగా ఆయ‌న చెప్పారు. ముస్లింలు త‌మకు సోద‌రులేనంటూ ఓవైసీకి చెక్ పెట్టే ప్ర‌య‌త్నం చేశారు. ముస్లిం మైనార్టీలు త‌మ‌కు విల‌న్లు ఎంత‌మాత్రం కాదంటూ ఓవైసీకి చెక్ పెట్టే ప్ర‌య‌త్నం చేశారు.

బీజేపీ- శివ‌సేన పొత్తును త‌ప్పుప్ట‌టిన ప‌వార్ కు హిస్ట‌రీ పంచ్ వేశారు ఉద్ద‌వ్ ఠాక్రే. గ‌తంలోకాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ప‌వార్.. తిరిగి ఆ ఆపార్టీతో ఎప్పుడూ క‌లువ‌న‌ని శ‌ప‌ధం చేశార‌ని.. అలాంటి ఆయ‌న ఇప్ప‌టికి రెండుసార్లు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న విష‌యాన్ని ప్ర‌స్తావించారు. అలాంటి నేతలు.. త‌మను ఉద్దేశించి విమ‌ర్శ‌లు చేయ‌ట‌మా? అంటూ ఉద్ద‌వ్ ప్ర‌శ్నిస్తున్నారు.