Begin typing your search above and press return to search.
హిట్లర్.. పుష్ప మూవీ డైలాగ్.. మాజీ సీఎం ఉద్దవ్ నోట తాజా మాటలు
By: Tupaki Desk | 2 Aug 2022 4:27 AM GMTమాజీ ముఖ్యమంత్రి.. శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే నోట నియంత హిట్లర్ ప్రస్తావన.. ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన పుష్ప మూవీ డైలాగ్ వచ్చాయి. గడిచిన రెండు రోజులుగా చోటు చేసుకున్న పరిణామాలతో ఇలాంటి పరిస్థితి నెలకొంది.
సీఎం కుర్చీ నుంచి దిగిపోయే పరిణామాలు చోటు చేసుకోవటం.. తనకు అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించే ఎంపీ సంజయ్ రౌత్ ను ఈడీ ఆరోపణల నేపథ్యంలో అరెస్టు చేయటం లాంటి వరుస పరిణామాలు చోటు చేసుకోవటం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో రౌత్ ఇంటికి వెళ్లి.. వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు శివసేన చీఫ్.
ఈ సందర్భంగా బీజేపీ పాలనను నియంత హిట్లర్ కాలంతో పోల్చిన ఉద్దవ్.. తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. శివసేన పార్టీకి అన్నీ తానై అన్నట్లుగా వ్యవహరించి.. కొండంత అండగా నిలిచే సంజయ్ రౌత్ ప్రస్తుతం కటకటాల్లో ఉండటం తెలిసిందే. తనకు.. తన పార్టీకి కొమ్ము కాసే రౌత్.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన కుటుంబానికి దన్నుగా నిలిచారు ఉద్దవ్. వారి ఇంటికి స్వయంగా వెళ్లిన ఆయన.. వారిని ఓదార్చారు. తాము వారికి అండగా ఉంటామని చెప్పారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఉద్దవ్.. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో ఒక సందర్భంలో అతను గెలుస్తున్నట్లుగా కనిపించాడని.. అలాంటి వేళలో అతడి కార్టూనిస్టు మాత్రం అతడి దుర్మార్గాల్ని ఎత్తి చూపిన వైనాన్ని గుర్తు చేసుకున్నారు. దీంతో.. ఆ కార్టూనిస్టు మరణించాలని హిట్లర్ కోరుకున్న వైనాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘ఈ విషయాన్ని మా నాన్న ఒక సందర్భంలో నాకు చెప్పారు.బీజేపీ ఈడీ.. సీబీఐలపై ఆధారపడుతోంది.
దేశంలో ఇంకెక్కడ ప్రజాస్వామ్యం ఉంటుంది? సంజయ్ రౌత్ పట్ల నాకు గర్వంగా ఉంది. ఆయన ఎలాంటి ఒత్తిడికి తలొగ్గకుండా ముందుకు సాగుతున్నారు. ఆయనో శివసైనికుడు. అంతకు మించి పాత్రికేయుడు. తాను చెప్పాలనుకున్నది నిర్బయంగా చెబుతారు’ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు.
ఈ సందర్భంగా పుష్పలోని ఫేమస్ డైలాగ్ ను ప్రస్తావిస్తూ.. సంజయ్ రౌత్ తగ్గేదేలే అన్నట్లు వ్యవహరిస్తున్నట్లుగా చెప్పిన ఉద్దవ్ మాటలు ఆసక్తికరంగా మారాయి. ఎంత ఒత్తిడికి గురి చేసినా తగ్గకుండా ముందుకు సాగుతున్నారని.. అతను అస్సలు తగ్గట్లేదని ప్రశంసించారు. రౌత్ తీరుపై ఉద్దవ్ చేసిన తాజా వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.