Begin typing your search above and press return to search.

పవన్‌ విజ్ఞప్తిపై వెంటనే స్పందించిన మరాఠా సీఎం

By:  Tupaki Desk   |   31 March 2020 3:00 PM GMT
పవన్‌ విజ్ఞప్తిపై వెంటనే స్పందించిన మరాఠా సీఎం
X
కరోనాతో దేశ వ్యాప్త లాక్‌ డౌన్‌ ప్రకటించడంతో ముఖ్యంగా కూలీ పనులు చేసుకునేందుకు వివిధ ప్రాంతాలకు వెళ్లిన వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. లాక్‌ డౌన్‌ నేపథ్యంలో సొంత ప్రాంతాలకు వెళ్లలేక అక్కడే పని లేకుండా ఉండలేక లక్షలాది మంది కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దిల్లీ.. ముంబయితో పాటు ఇంకా పలు మెట్రో నగరాల్లో లక్షలాది మంది చిక్కుకు పోయారు. వారిని ప్రభుత్వాలు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. దాంతో వలస కూలీలు దిక్కులేని వారిగా మారిపోతున్నారు.

తాజాగా మహారాష్ట్రలో ఉన్న కొంతమంది తెలుగు వలస కూలీలు తమ పరిస్థితి దారుణంగా ఉంది తినడానికి తిండి లేదు.. తిరిగి వచ్చేందుకు వీలు లేకుండా పోయిందని ఒకే చోట పదుల సంఖ్యలో ఉండాల్సిన పరిస్థితి. తమను స్థానిక అధికారులు పట్టించుకోవడం లేదు. కనీస అవసరాలకు కూడా బయటకు వెళ్లలేని పరిస్థితి. పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు అంటూ ఒక వ్యక్తి వీడియో తీశాడు. ఆ వీడియోను పవన్‌ కళ్యాణ్‌ ట్వీట్‌ చేసి మహారాష్ట్ర సీఎంఓను ట్యాగ్‌ చేశాడు.

వీడియోతో పాటు మరాఠీలో ఒక లేఖను కూడా మహారాష్ట్ర సీఎంకు పవన్‌ పంపించడం జరిగింది. వారిని ఆదుకోవాలంటూ పవన్‌ చేసిన విజ్ఞప్తిపై మహారాష్ట్ర సీఎంఓ వెంటనే స్పందించింది. మహారాష్ట్ర పీఎంఓ ట్విట్టర్‌ లో.. పవన్‌ జీ మీరు చింతించకండి. ఈ సంక్షోభ సమయంలో ఇబ్బందుల్లో ఉన్న వారందరికీ సాయం చేయడం మన బాధ్యత. వారిని వెంటనే సంప్రదించి సాయం చేస్తామంటూ హామీ ఇస్తూ ట్వీట్‌ చేయడం జరిగింది.

మహారాష్ట్ర పీఎంఓ స్పందనపై పవన్‌ ట్విట్టర్‌ లో స్పందిస్తూ... గౌరవనీయులైన ఉద్దవ్‌ గారు మీ సమాధానానికి కృతజ్ఞతలు. మీరు తప్పకుండా వారికి సహాయం చేస్తారని నాకు తెలుసు. మరోసారి మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.