Begin typing your search above and press return to search.

పాకిస్తాన్ చేస్తున్న పని తెలుసా..అందుకే ఉద్ధవ్ అలా అన్నారు

By:  Tupaki Desk   |   19 Sep 2019 4:34 AM GMT
పాకిస్తాన్ చేస్తున్న పని తెలుసా..అందుకే ఉద్ధవ్ అలా అన్నారు
X
దేశభక్తి వ్యాఖ్యలతో పాటు వివాదాలకు కేంద్రబిందువుగా ఉండే శివసేన మరోసారి సంచలనం వ్యాఖ్యలు చేసింది. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి తొలి ప్రధాని అయ్యుంటే కశ్మీర్ సమస్య ఉత్పన్నమయ్యేది కాదని ఇంతకుముందే వ్యాఖ్యానించిన శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే.. తాజాగా మరో సంచలన కామెంట్ చేశారు. దామోదర్ వీర్ సావర్కర్ కనుక ప్రధాని అయ్యుంటే అసలు పాకిస్తాన్ ప్రత్యేక దేశంగా ఏర్పడేది కాదన్నారు. హిందు మహసభ నిర్వహించిన ఓ కార్యాక్రమంలో ఆయన వీర సావర్కర్ పోస్టర్‌ ను ఆవిష్కరిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు భారత రత్న అవార్డు ప్రకటించాలని కూడా ఉద్ధవ్ ప్రభుత్వాన్ని కోరారు.

భారత తొలి ప్రధాని నెహ్రూ జైలుకు వెళ్లొచ్చారు కానీ సావర్కార్‌ 14 ఏళ్లు జైలు జీవితం అనుభవించారని అన్నారు. సావర్కర్ ప్రధాని కాకుండా నెహ్రూ అడ్డుకున్నారని ఆరోపించారు.

ఉద్ధవ్ వంటివారు పాకిస్తాన్ అంటే మండిపడడానికి ఆ దేశం తీరూ కారణమే. తాజాగా పాకిస్తాన్ భారత్ పట్ల తనకు ఎంత అసూయ - అక్కసు ఉన్నాయో చాటుకుంది. త్వరలో న్యూయార్క్ పర్యటనకు వెళ్లనున్న భారత ప్రధాని మోది విమానానికి పాకిస్థాన్ గగనతలం గుండా వెళ్లేందుకు అనుమతి నిరాకరించింది పాక్. ఈ మేరకు అనుమతి నిరాకరిస్తున్నట్టు పాక్ విదేశాంగ శాఖ మంత్రి ఖురేషి ప్రకటించారు. ఈ విషయాన్ని భారత రాయబార కార్యాలయానికి తెలిపారు. కాగా, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇటీవల మూడు దేశాల పర్యటనకు వెళ్లినప్పుడు కూడా పాక్ గగనతలంపై నుంచి వెళ్లేందుకు అనుమతించలేదు. పాకిస్థాన్ తాజా నిర్ణయంతో భారత్ పై విషం చిమ్ముతోందన్న విషయం స్పష్టం అర్థమవుతోంది.