Begin typing your search above and press return to search.
బీజేపీ కి షాకిచ్చిన ఉద్దవ్ ఠాక్రే
By: Tupaki Desk | 24 Dec 2019 9:34 AM GMTబీజేపీ తో దోస్తీ కటీఫ్ కాగానే శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే దాని విధానాల నుంచి కూడా బయటపడుతున్నారు. గత మహారాష్ట్ర ప్రభుత్వపు నిర్ణయాలను కూడా సమీక్షిస్తూ బీజేపీ కి షాకుల మీద షాకులు ఇస్తున్నారు.
దేశ వ్యాప్తంగా జాతీయ పౌర చట్టం (ఎన్నార్సీ)ని అమలు చేసేందుకు బీజేపీ రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అక్రమ వలసదారుల కోసం నిర్భంధ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.
ఇదే క్రమంలో మొన్నటివరకూ మహారాష్ట్ర ను పాలించిన బీజేపీ సీఎం ఫడ్నవీస్ మహారాష్ట్ర లోని నెరుల్ ప్రాంతంలో అక్రమ వలస దారుల కోసం నిర్బంధ కేంద్రాన్ని అభివృద్ధి చేయడానికి గత ప్రభుత్వం లో ప్రతిపాదించారు.
తాజాగా ఫడ్నవీస్ ప్రతిపాదించిన నిర్బంధ కేంద్రాలకు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే మంగళం పాడారు. మహారాష్ట్ర లో నిర్బంధ కేంద్రాలకు అనుమతించేది లేదని స్పష్టం చేశారు. వాటిని రద్దు చేస్తున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించారు. సుప్రీం కోర్టు లో 22న ఎన్నార్సీ పై విచారణ జరగనుందని.. ఆ తీర్పు తర్వాతే ఈ ఎన్నార్సీ నిర్బంధ కేంద్రాల పై నిర్ణయం వెల్లడిస్తానని ఉద్దవ్ స్పష్టం చేశారు. దీంతో ఎన్నార్సీ ముందుకెళుదామనుకున్న బీజేపీ కి షాక్ తగిలింది.