Begin typing your search above and press return to search.

మౌనంగా ఉంటున్నాం అనుకోకు: కంగనకు ఠాక్రే వార్నింగ్

By:  Tupaki Desk   |   13 Sep 2020 2:00 PM GMT
మౌనంగా ఉంటున్నాం అనుకోకు: కంగనకు ఠాక్రే వార్నింగ్
X
మహారాష్ట్రలోని శివసేన సర్కార్ కు.. బాలీవుడ్ హీరోయిన్ కంగన రనౌత్ కు పెద్ద యుద్ధమే నడుస్తోంది. సుశాంత్ సింగ్ మరణం వెనుక శివసేన సర్కార్ ఉందని.. బాలీవుడ్ లోని కొందరినీ దాస్తోందని కంగనా ఆరోపించింది.ముంబైని పీవోకేతో పోల్చింది.

ఈ క్రమంలోనే శివసేన భగ్గుమంది.కంగనా ఇంటిని కూల్చివేసే ప్రయత్నం చేసింది. ఈ యుద్ధంలోకి ఇప్పుడు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే కూడా ఎంటర్ అయ్యారు. వారం రోజులుగా సాగుతున్న వీరిద్దరి మధ్య వివాదం తాజాగా గవర్నర్ వద్దకు చేరింది. ఆదివారం సాయంత్రం కంగనా మహారాష్ట్ర గవర్నర్ ను కలవబోతున్నారు.

ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే మీడియా సమావేశం నిర్వహించారు. కరోనాతోపాటు తమను విమర్శిస్తున్న వారితో పోరాటం చేస్తున్నామని ఉద్దవ్ తెలిపారు. తాము మౌనంగా ఉన్నామంటే దానికి అర్థం చేతకాని తనం కాదని కంగనను పరోక్షంగా హెచ్చరించారు. తాను రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి ఎన్నో అవాంతరాలను, ఆటుపోట్లను ఎదుర్కొన్నానని ఉద్దమ్ తెలిపారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు పెద్ద ఎత్తున కుట్రలు సాగుతున్నారని ఆయన ఆరోపించారు.

కరోనాపై పోరాడుతున్నామని మహారాష్ట్రలో రికవరీ రేటు పెరిగిందన్నారు. వైరస్ ను అరికట్టేందుకు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టామని తెలిపారు.

కాగా కంగన ఆఫీసు కూల్చడంపై మహారాష్ట్ర గవర్నర్ కోశ్యారీ సీరియస్ అయ్యారు. మహారాష్ట్ర చీఫ్ సెక్రెటరీని వివరణ కోరారు. ఈ నేపథ్యంలో గవర్నర్ ను కంగన కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.