Begin typing your search above and press return to search.

కొడితే సీఎం కుర్చీ.. ఉద్దవ్ ది అదృష్టం

By:  Tupaki Desk   |   28 Nov 2019 11:10 AM GMT
కొడితే సీఎం కుర్చీ..  ఉద్దవ్ ది అదృష్టం
X
మహారాష్ట్ర సీఎంగా శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే మరికొన్ని గంటల్లోనే ప్రమాణం చేయబోతున్నారు. శివసేన పార్టీ సిద్ధాంతాల ప్రకారం ఆ అధినేతలు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీ లాంటి పదవులు చేపట్టరాదు. అలానే ఉద్దవ్ కూడా దూరంగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఓ అరుదైన ఘనతను ఉద్దవ్ సాధించబోతున్నారు.

శాసనసభలో గానీ, శాసన మండలిలోగానీ ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా కాకుండానే శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే ఏకంగా సీఎం కాబోతుండడం సంచలనంగా మారింది. ప్రస్తుతం మహారాష్ట్ర సీఎం కాబోతున్న ఉద్దవ్ ఠాక్రే ఇప్పుడు ఎమ్మెల్యే కాదు.. ఎమ్మెల్సీ కాదు. అయినా ఆయన సారథ్యంలోనే మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుండడం విశేషం.

పోయిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్దవ్ ఠాక్రే పోటీచేయలేదు. ఆయన కుమారుడు ఆధిత్య ఠాక్రే పోటీచేశాడు. 67వేల మెజార్టీతో గెలిచాడు. వెనుకాల ఉండి సర్వం తానై పార్టీ అభ్యర్థులను గెలిపించే ఉద్దవ్ ఒక్కసారి కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనలేదు. ఇలా ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా కాకుండానే సీఎం అయిన వ్యక్తులు దేశంలోనే చాలా అరుదుగా చెప్పవచ్చు. తాజాగా ఉద్దవ్ టాక్రే కూడా ఈ అరుదైన ఫీట్ ను సాధిస్తున్నారు.

దేశవ్యాప్తంగా ఇలా సీఎం అయిన ఎనిమిదో వ్యక్తి ఉద్దవ్. మహారాష్ట్రలో సుశీల్ కుమార్ షిండే, శరద్ పవార్ కూడా ఇలానే సీఎం అయ్యారు. ఇక సీఎం అయిన ఆరు నెలల్లో ఉద్దవ్ ఠాక్రే ఎమ్మెల్యేగా కానీ, ఎమ్మెల్సీగా కానీ ఎన్నిక కావాలి. మరి ఆయన ఏదారి ఎంచుకుంటాడన్నది వేచిచూడాలి.