Begin typing your search above and press return to search.
దక్షిణాదిన మరో రాజకీయ వారసుడి హంగామా!
By: Tupaki Desk | 16 April 2019 11:49 AM GMTఒకవైపు ఏపీలో ఈ సారి నారా లోకేష్ బాబు తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగారు. ఇప్పటికే ఎమ్మెల్సీగా మంత్రిగా వ్యవహరించిన లోకేష్ ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికల్లో తన లక్ ను పరీక్షించుకుంటున్నారు. మంగళగిరిలో లోకేష్ గెలుస్తారా? అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇక మరోవైపు కర్ణాటకలో కుమారస్వామి తనయుడు నిఖిల్ తన లక్ ను పరీక్షించుకుంటున్నారు. సీనియర్ నటి సుమలతతో అక్కడ రాజకీయంగా ఢీ అంటున్నారు నిఖిల్.
ఇలా ఏపీ, కర్ణాటకల్లో ఇద్దరు రాజకీయ వారసులు హంగామా చేస్తూ ఉండగా, మరోవైపు తమిళనాట కూడా ఒక వారసుడు ప్రచార పర్వంలో యాక్టివ్ గా వ్యవహరించాడు. అతడే ఉదయనిధి స్టాలిన్. ప్రస్తుత డీఎంకే ముఖ్య నేత స్టాలిన్ తనయుడు అయిన ఉదయనిధి సినిమాల్లో నటించడం ద్వారా తెలుగు వాళ్లకు కూడా కొద్దో గొప్పో పరిచయస్తుడే. ఇప్పుడు తన సినీ గ్లామర్ ను పార్టీ ప్రచారం కోసం ఉపయోగిస్తున్నాడితను. డీఎంకే తరఫున తమిళనాట విస్తృతంగా ప్రచారం చేశాడు.
మంగళవారంతో అక్కడ కూడా ప్రచార పర్వం ముగిసింది. గురువారం తమిళనాడులోని అన్ని లోక్ సభ స్థానాలకూ పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో డీఎంకే కూటమిని గెలిపించాలని, ఇప్పుడు గెలిపిస్తే, ఆ తర్వాత వెనువెంటనే తన తండ్రి స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి కూడా అయ్యే అవకాశం ఉందని ఉదయనిధి ప్రచారం చేశాడు. నిజంగానే ఈ ఎన్నికల్లో డీఎంకే కు చాలా కీలకమైనవి. దీంతో డీఎంకే వాళ్లు గట్టిగా కష్టపడుతూ ఉన్నారు.