Begin typing your search above and press return to search.
నాసా లైవ్ లో గ్రహాంతరవాసుల వాహనం
By: Tupaki Desk | 18 Nov 2016 10:11 AM GMTగ్రహాంతరవాసులున్నారా...? దీనిపై ఎన్నో నమ్మకాలు.. మరెన్నో అనుమానాలు... పరిశోధనలు... అయినా, ఇంతవరకు మాత్రం కచ్చితమైన ఆధారాలు లేవు. ఫ్లయింగు సాసర్లని - యూఎఫ్ వో(అన్ నోన్ ఫ్లయింగ్ ఆబ్జెక్టు) లని అప్పుడప్పుడు కలంకలం మాత్రం రేగుతుంటుంది. తాజాగానూ నాసా లైవ్ లో ఒక ఒక యూఎఫ్ ఓ కనిపించిందని ఇంటర్నెట్ లో పెద్ద ఎత్తున హల్ చల్ జరుగుతోంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ ఎస్) సమీపంలో వేగంగా ప్రయాణిస్తున్న వస్తువు ఒక్కటి నాసా లైవ్ ప్రసారంలో కనిపించడం సంచలనంగా మారింది. ఇది కనిపించిన కాసేపటికే ప్రసారాలు నిలిచిపోయాయట. దీంతో అది యూఎఫ్ వో అయి ఉంటుందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
అంతరిక్షంలో భూపరిధికి కాస్త ఎత్తులో చీకటి నుంచి వేగంగా ప్రయాణిస్తున్న చిన్న చుక్కలాంటి వస్తువు ఒక్కటి ఐఎస్ ఎస్ చానెల్ లో కనిపించింది. ఇది ఐదు సెకన్లు మాత్రమే కనిపించింది. ఆ వెంటనే లైవ్ ప్రసారాలు నిలిచిపోయాయి. అయితే... నాసా కూడా దీన్ని గుర్తించిందని.. ఆ విషయం గుట్టుగా ఉంచడానికే లైవ్ నిలిపివేసిందని ప్రచారం జరుగుతోంది. నాసా మాత్రం లైవ్ ఆగిపోవడానికి సాంకేతిక కారణాలను చూపిస్తోంది.
కాగా గ్రహాంతరవాసుల గురించి పరిశోధనలు చేసేవారు మాత్రం ఇది మేలి మలుపని చెబుతున్నారు. భూమికి సమీపంలో గ్రహాంతరవాసులు తిరుగుతున్నారనడానికి ఇది సాక్ష్యమని అంటున్నారు. నాసా వద్ద దీనికి సంబంధించిన సమాచారం ఉండొచ్చని చెబుతన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/