Begin typing your search above and press return to search.
ప్లవ నామ సంవత్సర రాశి ఫలాలు : ఉగాది వేళ.. కొత్తసంవత్సరం మీకెలా ఉండనుంది?
By: Tupaki Desk | 13 April 2021 5:42 AM GMTతెలుగువారి కొత్త సంవత్సరం ఉగాది. ప్రతి ఏడాది చైత్రశుద్ధ పౌడ్యమిని కొత్త సంవత్సరంగా తెలుగువారు జరుపుకుంటాం. ఇంగ్లిషు క్యాలెండర్ ప్రకారం జనవరి 1 కొత్త సంవత్సరమైతే.. తెలుగు వారికి మాత్రం ఉగాదితో కొత్త ఏడాది షురూ అవుతుంది. పురాణాల ప్రకారం వేదాల్నిదొంగలించిన సోమకుని చంపిన విష్ణువు ఆ వేదాల్ని బ్రహ్మకు అప్పగించిన రోజును ఉగాది అంటారు. చైత్రశుక్ర పాడ్యమి రోజున బహ్మదేవుడు స్పష్టి మొదలుపెట్టిన రోజుగా పురాణాలు చెబుతుంటాయి. అలా ఎన్నో విశిష్ఠతలకు కేరాఫ్ అయిన ఉగాది అన్నంతనే చాలామందికి గుర్తుకు వచ్చేది.. కొత్త సంవత్సరంలో తమకు ఎలా ఉంటుందన్న ఆసక్తి. జన్మ నక్షత్రాల ప్రకారం.. పన్నెండు రాశులుగా విభజించి.. కొత్త సంవత్సరం ఎలా ఉంటుందన్న విషయాన్ని తెలియజేసే జ్యోతిష్య శాస్త్రం ఈఏడాది ఎవరికి ఎలా ఉంటుందో పంచాంగవేత్తలు చెబుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. మీ.. మీకు కావాల్సిన వారికి కొత్త సంవత్సరం ఎలా ఉంటుందో ఇక్కడ చదివేయండి.
మేషం
అశ్విని, భరణి, కృత్తిక 1 పాదం
ఆదాయం: 8, వ్యయం: 14
రాజపూజ్యం: 4, అవమానం: 3
శ్రీప్లవనామ సంవత్సరంలో మేష రాశివారు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో ప్రమోషన్లు, ఉన్నత పదవులకు అవకాశముంది. నూతన ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక విషయాల్లో పురోగతి సాధిస్తారు.
ఆస్తిపాస్తులు పెంపొందించుకుంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. న్యాయ పోరాటాల్లో విజయం సాధిస్తారు. రాజకీయ, ప్రభుత్వ, సహకార రంగాల వారికి ప్రోత్సాహకరం. శుభకార్యాలు జరుగుతాయి. విద్యార్థులకు ప్రోత్సాహకరం. జూన్ - అక్టోబర్ మాసాల మధ్య పెద్దల ఆరోగ్యం కలవరపెడుతుంది. ఖర్చులు అధికమవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురయినా చివరకు సత్ఫలితాలు సాధిస్తారు.
వ్యాపార రంగంలోని వారికి అధిక లాభాలు వస్తాయి. అధికారం, హోదా, గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. తల్లిదండ్రుల విషయంలో శుభపరిణామాలు కనిపిస్తాయి. రాజకీయ రంగంలోని వారికి ఉన్నత పదవులు లభిస్తాయి. జూన్ 21 - అక్టోబర్ 12 తేదీల మధ్య ఖర్చులు అంచనాలు మించుతాయి. ఎవరికైనా డబ్బు ఇస్తే సకాలంలో తిరిగి రాకపోవచ్చు.
మధ్యవర్తిత్వాలు బెడిసికొట్టే ప్రమాదం ఉంది. రుణబాధలు అధికం. షేర్ల లావాదేవీలు, పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. పన్నులు, బీమా, గ్రాట్యుటీ, రుణాల విషయాల్లో చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. కొత్త అనుబంధాల విషయంలో జాగ్రత్తలు పాటించడం అవసరం. శ్రీ దత్తాత్రేయ స్వామి ఆరాధన శుభప్రదం.
వృషభం
కృత్తిక 2,3,4; రోహిణి; మృగశిర 1,2 పాదాలు
ఆదాయం: 2, వ్యయం: 8
రాజపూజ్యం: 7, అవమానం: 3
వృషభ రాశి వారు 2021 నవంబర్ నుంచి 2022 మార్చి నెలాఖరు వరకు ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. ఆస్తిపాస్తులు పెంపొందించుకుంటారు. ఆర్థిక విషయాల్లో పురోగతి సాధిస్తారు. పెట్టుబడులు లాభిస్తాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. న్యాయపోరాటాల్లో విజయం సాధిస్తారు. ఉన్నత విద్యా విషయాలకు అనుకూలం. గృహనిర్మాణం యత్నాలు ఫలిస్తాయి.
జూన్ - అక్టోబర్ మాసాల మధ్య ఆందోళనలు అధికం. వృత్తిలో ఒత్తిడులకు లోనవుతారు. న్యాయ, ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి. లక్ష్య సాధనలో ఆటంకాలు ఎదురయినా పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు అనుకూలం. వృత్తి, వ్యాపారాల్లో శుభపరిణామాలు సంభవం. ప్రమోషన్లు సాధిస్తారు. వ్యాపార విస్తరణకు అనుకూలం. న్యాయ, ఆధ్యాత్మిక, బోధన, పత్రికలు, రక్షణ, కన్సల్టెన్సీ, ఆడిటింగ్, ఉన్నత విద్యా, విదేశీ రంగాలవారికి ప్రోత్సాహకరం.
సంతానప్రాప్తికి అనుకూలం. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి కనిపిస్తుంది. రాజకీయ రంగంలోని వారికి ఉన్నత పదవులు లభిస్తాయి. వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. విద్యార్థులు, క్రీడారంగంలోని వారికి శుభప్రదం. మీ పురోగతి చూసి అసూయపడేవారు పెరుగుతారు.
పెట్టుబడుల్లో జాగ్రత్త వహించాలి. వృత్తి వ్యాపారాల్లో శ్రమాధిక్యం. మోసపోయే అవకాశం ఉంది. బదిలీల కారణంగా అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపించాలి. వృత్తిపరంగా బాధ్యతలు అధికమవుతాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. చిన్నారుల పట్ల శ్రద్ధ చూపాలి. దంపతుల మధ్య అవగాహన లోపిస్తుంది. ప్రేమ వ్యవహారాలు బెడిసికొట్టే ప్రమాదం ఉంది. స్నేహానుబంధాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. విద్యార్థులు చదువులపై మరింత శ్రద్ధ చూపాలి. శత్రువులు అధికం అవుతారు. ఓరిమితో వ్యవహరిస్తే విజయం సాధించగలుగుతారు. దుర్గాదేవీ ఆరాధన సకల శుభాలను కలుగజేస్తుంది.
మిథునం
మృగశిర 3,4; ఆరుద్ర; పునర్వసు 1,2,3 పాదాలు
ఆదాయం: 5, వ్యయం: 5
రాజపూజ్యం: 3, అవమానం: 6
మిథున రాశి వారు ఈ ఏడాది ద్వితీయార్థంలో వృత్తి, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. ఉద్యోగం చేస్తూ అదనపు ఆదాయం కోసం ఏదైనా వ్యాపారం చేసేందుకు అనుకూలం. న్యాయ పోరాటాల్లో విజయం సాధిస్తారు. ఉన్నత చదువులు, విదేశీ గమనానికి చేసే యత్నాలు నెమ్మదిగా ఫలిస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. రుణబాధలు అధికం. జూన్ - అక్టోబర్ మాసాల మధ్య రాజకీయాలు, కళలు, సినీ, రక్షణ, విద్య, ఐ.టి రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి. డిపాజిట్లు, మ్యూచ్యువల్ ఫండ్స్, షేర్ల లావాదేవీల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తగవు.
ఈ ఏడాది ఆరోగ్యంపై శ్రద్ధ చూపించాలి. ఉద్యోగ వ్యాపారాల్లో మార్పు కోసం యత్నిస్తారు. కొత్త వ్యాపారాల ప్రారంభంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. రుణదాతల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. కాంట్రాక్టులు, అగ్రిమెంట్ల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ష్యూరిటీలు ఇవ్వకపోవడం మంచిది. పెట్టుబడుల్లో ఆచితూచి వ్యవహరించాలి. దూరప్రయాణాలు తగ్గించాలి. ఆస్తి వ్యవహారాల్లో నిదానం అవసరం.
న్యాయ, ఆధ్యాత్మిక, బోధన, పత్రికలు, రాజకీయ రంగాల వారికి ప్రోత్సాహకరం. ఉద్యోగులు ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. స్థిర చరాస్తులకు సంబంధించిన పత్రాలు సరిగా లేకపోవడంతో న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తలు పాటించాలి. కొత్త వ్యాపారాలకిది సమయం కాదు. పై చదువులకు ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది.
ఎముకలు, కండరాలకు సంబంధించిన సమస్యలు బాధిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో ఒత్తిడి కారణంగా మనశ్శాంతి లోపిస్తుంది. అదనపు ఆదాయం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. మనసు ఆందోళనగా ఉంటుంది. విలాసాలకు ఖర్చులు అధికం. విద్యలో కొన్ని ఆటంకాలు ఎదురైనా చివరకు సత్ఫలితాలు సాధిస్తారు. అపార్థాలు, కోపావేశాల కారణంగా సంబంధాలు దెబ్బతింటాయి. ఉదర సంబంధమైన సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి.ఈశ్వరుడి ఆరాధన శుభప్రదం.
కర్కాటకం
పునర్వసు 4; పుష్యమి, ఆశ్లేష
ఆదాయం: 14, వ్యయం: 2
రాజపూజ్యం: 6, అవమానం: 6
ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో ఆర్థికపరమైన అభివృద్ధి కనిపిస్తుంది. వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. కంపెనీ వాటాల విలువ పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. రుణప్రయత్నాలు ఫలిస్తాయి. ఫార్మా, వైద్యం, ఆహారం రంగాల వారికి ప్రోత్సాహకరం. జూన్ - అక్టోబర్ మాసాల మధ్య ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. పందాలు, పోటీలు, స్పెక్యులేషన్లలో నిదానం పాటించాలి. ఖర్చులు అంచనాలను మించిపోతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి.
వివాహయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు శుభప్రదం. సన్నిహితుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరం. ఉమ్మడి వ్యాపారాలు లాభిస్తాయి. స్పెక్యులేషన్లు, షేర్ల లావాదేవీల్లో లాభాలు గడిస్తారు. ప్రకటనలు, ఏజెన్సీ రంగాల వారికి అనుకూలం. రాజకీయం, కళలు, సినీ, రవాణా, విద్య, ఐ.టి. రంగాల వారికి ప్రోత్సాహకరం. జూన్ 21 - అక్టోబర్ 12 తేదీల మధ్య వైవాహిక జీవితంలో చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఉన్నత చదువుల్లో మొదట ఆటంకాలు ఎదురైనా చివరకు సత్ఫలితాలు సాధిస్తారు. వ్యాపార విస్తరణకు ఆటంకాలు ఎదురవుతాయి.
ఆర్థిక విషయాల్లో మోసపోయే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. వేడుకలు, శుభకార్యాలకు అవకాశం ఉంది. జనసంబంధాలు విస్తరిస్తాయి. అనుకోని బాధ్యతలు భుజానికి ఎత్తుకోవాల్సి రావచ్చు. పెట్టుబడుల విషయంలో నెమ్మది అవసరం. బంధుమిత్రుల నుంచి మాటపడాల్సి వస్తుంది. వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తలు పాటించండి. ఆర్థిక పరమైన నిర్ణయాల్లో తొందరపాటు తగదు.
సంతానం అరోగ్యం విషయంలో జాగ్రత్త పాటించాలి. మనసు చంచలంగా ఉంటుంది. ఫలితంగా తప్పుడు నిర్ణయాలు తీసుకుని నష్టపోతారు. మీకు మంచి చెప్పే వారిని అపార్థం చేసుకుంటారు. స్నేహానుబంధాల మధ్య విభేదాలు ఏర్పడతాయి. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగ, వ్యాపార రంగాల వారు నైపుణ్యాలను మెరుగుపరచుకుంటే మంచి ఫలితాలు సాధిస్తారు. ఆంజనేయ స్వామి ఆరాధన శుభాలను చేకూరుస్తుంది.
సింహం
మఖ, పుబ్బ, ఉత్తర 1 పాదం
ఆదాయం: 2, వ్యయం: 14
రాజపూజ్యం: 2, అవమానం: 2
ఈ రాశి వారు శ్రీ ప్లవనామ సంవత్సరంలో ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. వ్యవసాయం, పరిశ్రమలు, ఆహారం, ఫార్మా, వైద్య రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొత్త వ్యాపారాల ప్రారంభంలో ఆచితూచి వ్యవహరించాలి. నూతన ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. విదేశీ గమన యత్నాలకు అవాంతరాలు ఎదురవుతాయి.
ఆస్తిపాస్తుల కొనుగోలు విషయంలో ముందు వెనుకలు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఫార్మా, ఆస్పత్రులు, వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారికి అనుకూలం. ఉద్యోగ, వృత్తి, వ్యాపారాల్లో పురోగతి కనిపిస్తుంది. హోటల్, ఆహార ఉత్పత్తులు, ఔషధాలు, ఆస్పత్రులు, కేటరింగ్, నిత్యావసరాల రంగాల వారికి ప్రోత్సాహకరం. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. ఉమ్మడి వ్యాపారాలు లాభిస్తాయి. కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి.
వృత్తి, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. పట్టుదలతో పనిచేసి లక్ష్యాలు సాధిస్తారు. శ్రమకు తగిన ప్రతిఫలం అందుకుంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. శత్రువులు మిత్రులుగా మారతారు. వివాహ యత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరం. వ్యాపార విస్తరణకు ప్రయత్నిస్తారు. మే 24 - అక్టోబర్ 19 తేదీల మధ్య పెట్టుబడుల్లో నష్టం సంభవించే అవకాశం ఉంది. రుణబాధలు అధికమవుతాయి. వ్యాపార రంగంలోని వారికి నెమ్మదిగా పురోగతి కనిపిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపించాలి.
ఉద్యోగులు అదనపు బాధ్యతలు భుజానికి ఎత్తుకోవాల్సి వస్తుంది. పట్టుదలతో పనిచేసి లక్ష్యాలు సాధిస్తారు. వివాహ ప్రయత్నాలు నెమ్మదిగా ఫలిస్తాయి. ఉద్యోగ రంగంలోని వారికి సహోద్యోగుల నుంచి ఒత్తిళ్లు ఎదురవుతాయి. ఉదర సంబంధమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ప్రస్తుతం చేస్తున్న వ్యాపారం లేదా ఉద్యోగంలోనే కొనసాగడం మంచిది. ప్రేమ వ్యవహారాల్లో చికాకులు ఎదురయ్యే అవకాశం ఉంది. మహావిష్ణువు ఆరాధన శుభప్రదం.
కన్య
ఉత్తర 2,3,4; హస్త; చిత్త 1,2 పాదాలు
ఆదాయం: 5, వ్యయం: 5
రాజపూజ్యం: 5, అవమానం: 2
శ్రీ ప్లవనామ సంవత్సరం ద్వితీయార్థం నుంచి కన్య రాశివారికి ఆర్థికపరమైన పురోగతి సాధిస్తారు. విద్యార్థులకు శుభప్రదం. ఉన్నత చదువులకై చేసే యత్నాలు ఫలిస్తాయి. వివాహ యత్నాలు ఫలిస్తాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. న్యాయ, ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాల వారికి ప్రోత్సాహకరం. ప్రేమానుబంధాలు బలపడతాయి. న్యాయ సృజనాత్మక రంగాల వారు సత్ఫలితాలు అందుకుంటారు. జూన్ - అక్టోబర్ మాసాల మధ్య ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి. ప్రేమలు బెడిసికొట్టే అవకాశం ఉంది.
చిన్నారుల వ్యవహారశైలి మనస్తాపం కలిగిస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఆ తరువాత నవంబర్ 21 నుంచి సంవత్సరాంతం వరకు సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఉన్నత విద్యా యత్నాలు ఫలిస్తాయి. వాయిదాపడుతున్న పనులు పూర్తి చేస్తారు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. శాస్త్ర, విజ్ఞాన రంగాల వారికి ప్రోత్సాహకరం. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. పెద్దలతో పరిచయాలు లాభిస్తాయి.
విద్యార్థులు లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాలి. ఖర్చులు అంచనాలు మించుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. కష్టంలో వున్న వారికి సాయం చేస్తారు. ప్రేమ వ్యవహారాల్లో చికాకులు అధికం. విద్యార్థులు అశ్రద్ధ కారణంగా నష్టపోయే ప్రమాదం ఉంది. భారీ ప్రాజెక్టులకు అనుకూల సమయం కాదు. రావలసిన డబ్బు సకాలంలో అందక ఇబ్బందిపడతారు. ప్రియతములతో భేదాభిప్రాయాలు తలెత్తుతాయి. ప్రతిభకు తగిన గుర్తింపు లభించకపోవడంతో నిరాశకు గురవుతారు.
ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వైద్యం, కేటరింగ్, రిటైల్, హోటల్ రంగాల వారికి శుభప్రదం. ఒత్తిళ్ల కారణంగా ఆరోగ్యం మందగిస్తుంది. ఉదర సంబంధమైన సమస్యలకు అవకాశం ఉంది. చిన్న శస్త్ర చికిత్స అవసరం కావచ్చు. ఉద్యోగంలో బదిలీలకు అవకాశం ఉంది. న్యాయపరమైన వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. ఆర్థిక విషయంలో మధ్యవర్తిత్వం కారణంగా ఇబ్బందులు పడతారు. అవసరంలో వున్న వారికి సాయం చేస్తారు. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. ఏడాది ప్రారంభంలో కొన్ని చికాకులు, ఆటంకాలు ఎదురైనా ఏడాది ద్వితీయార్థంలో పరిస్థితి మెరుగుపడుతుంది. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆరాధన శుభప్రదం.
తుల
చిత్త 3,4; స్వాతి; విశాఖ 1,2,3 పాదాలు
ఆదాయం: 2, వ్యయం: 8
రాజపూజ్యం: 1, అవమానం: 5
తులా రాశి వారు ఈ ఏడాదిలో ఇల్లు, లేదంటే స్థలం కొనుగోలు చేస్తారు. ఇంటి కోసం విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు. ఉన్నత విద్యాభ్యాసానికి అనుకూలమైన కాలం. కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. పెద్దల ఆరోగ్యం మెరుగవుతుంది. ప్రేమలు ఫలిస్తాయి. పెద్దల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. గృహనిర్మాణం, రియల్ ఎస్టేట్ రంగాల వారు పురోగతి సాధిస్తారు. జూన్- అక్టోబర్ మధ్య ఖర్చులు అధికం.
ప్రమోషన్ల విషయంలో చిన్నపాటి సమస్యలు ఎదురవుతాయి. ఇంట్లో వేడుకలు, వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. పై చదువులకై చేసే యత్నాలు ఫలిస్తాయి. రుణభారాలు తగ్గుతాయి. తల్లిదండ్రుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ప్రతికూలత కనిపిస్తుంది. కుటుంబసభ్యుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. వ్యాపారరంగంలోని వారికి ప్రోత్సాహకరం. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు.
వైద్యం, ఆస్పత్రులు, సేవలు, స్టీల్, స్టేషనరీ వ్యాపారాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరం. బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది. ఆస్తి వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. మే 24 - అక్టోబర్ 18 తేదీల మధ్య ప్రతి పనిలో ఆలస్యం, ఆటంకాలు ఎదురవుతాయి. ప్రియతములతో ఎడబాట్లు తప్పకపోవచ్చు. విద్యార్థులు స్నేహాల వల్ల చదువుల పట్ల అశ్రద్ధ చూపే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో చిక్కులు, ఆటంకాలెదురైనా ఓరిమితో అందరినీ ఒప్పించేందుకు ప్రయత్నిస్తారు. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు నెమ్మదిగా ఫలిస్తాయి. స్నేహితులు అపార్థం చేసుకునే అవకాశం ఉంది.
ఖర్చులు అంచనాలు మించుతాయి. డ్రైవింగ్‌లో నిదానం అవసరం. కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాల్సి రావచ్చు. ఇతరులకు ఇచ్చిన డబ్బు సకాలంలో తిరిగి రాకపోవచ్చు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తగవు. ఆర్థిక విషయాల్లో మోసపోయే అవకాశం ఉంది. క్రయవిక్రయాలకు తగిన సమయం కాదు. వాగ్వివాదాలకు దూరంగా.. మౌనంగా ఉండటం మేలు. ఇంద్రాక్షీ స్తోత్ర పారాయణ శుభఫలితాలనిస్తుంది.
వృశ్చికం
విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ
ఆదాయం: 8, వ్యయం: 14
రాజపూజ్యం: 4, అవమానం: 5
ఈ రాశి వారికి ఈ ఏడాది ద్వితీయార్థం నుంచి ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. వ్యాపార విస్తరణకు అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లలు చదువుల్లో రాణిస్తారు. ఉన్నత చదువులకై విదేశాలకు వెళ్లేందుకు చేసే యత్నాలు ఫలిస్తాయి. బదిలీ యత్నాలు ఫలిస్తాయి. ప్రమోషన్‌లు అందుకుంటారు. ప్రచురణ, మార్కెటింగ్, రవాణా, కన్సల్టెన్సీ, ఏజెన్సీలు, విద్యారంగాల వారికి ప్రోత్సాహకరం. కాంట్రాక్టులు, ఒప్పందాలు లాభిస్తాయి.
జూన్ - అక్టోబర్‌ల మధ్య విద్యార్థుల్లో అశ్రద్ధ పెరుగుతుంది. మార్పులు, చేర్పులు అసౌకర్యం కలిగిస్తాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. వృత్తి, వ్యాపారాల్లో శుభపరిణామాలు చోటుచేసుకుంటాయి. సోదరీసోదరులు, బంధువుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. దూరప్రయాణాలకు అనుకూలం. ఉద్యోగ, వ్యాపారాల్లో చిన్నపాటి మార్పులు చేస్తారు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్థిరాస్తులు సమకూర్చుకుంటారు.
ఉద్యోగులకు ప్రశంసలు, ప్రమోషన్లు లభిస్తాయి. ఉద్యోగం చేస్తూ పై చదువులు చదివేందుకు అనుకూలం. పరిచయస్తుల నుంచి సహకారం అందుకుంటారు. గురువు వక్రించిన జూన్ 21 - అక్టోబర్ 12 తేదీల మధ్య మధ్య వృత్తి, వ్యాపారాల్లో కొంత నిరుత్సాహకరంగా ఉంటుంది. అన్నదమ్ముల మధ్య అపార్థాలకు అవకాశం ఉంది. ఆస్తి విషయాల్లో సమస్యలు తలెత్తుతాయి. ఇచ్చిన మాట నిలుపుకోవడం కష్టం. ష్యూరిటీలు ఇచ్చే విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. గౌరవ మర్యాదలకు భంగం కలిగే అవకాశం ఉంది. వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి.
కుటుంబ విషయాల్లో చికాకులు అధికం. విద్యార్థులకు చదువుల పట్ల అశ్రద్ధ పెరుగుతుంది. అన్నదమ్ముల మధ్య మనస్పర్థలు తలెత్తే అవకాశం ఉంది. విలాసాలకు వెచ్చిస్తారు. కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఇల్లు, స్థలం కొనుగోలు చేస్తారు. బదిలీ యత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. ఇంట్లో, కార్యాలయంలో బాధ్యతలు అధికం. పెట్టుబడులు, స్పెక్యులేషన్లలో నెమ్మది పాటించాలి. ఆర్థిక విషయాల్లో ఇతరులకు సాయం చేసే విషయంలో ఒకటి రెండుసార్లు అలోచించాలి. వివాహ సంబంధాల్లో ఒడిదుడుకులు ఎదురవుతాయి. ప్రేమానుబంధాలు బెడిసికొట్టే అవకాశం ఉంది. శత్రుబాధ అధికం. శ్రీ లక్ష్మీ స్తోత్ర పారాయణ, అమ్మవారి ఆరాధన శుభ ఫలితాలనిస్తుంది.
ధనుస్సు
మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పాదం
ఆదాయం: 11, వ్యయం: 5
రాజపూజ్యం: 7, అవమానం: 1
ఈ ఏడాది ధనుస్సు రాశి వారు ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. నవంబర్ నుంచి ఉద్యోగంలో బదిలీలు, ప్రమోషన్లకు అవకాశం ఉంది. సంతానం విషయంలో పురోగతి కనిపిస్తుంది. పెట్టుబడులు లాభిస్తాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. వ్యాపారంలో ఒడిదుడుకులు ఎదురైనా చివరకు పట్టుదలతో అభివృద్ధి సాధిస్తారు. సొంత ఇల్లు, లేదా స్థలం సమకూర్చుకుంటారు. పై అధికారులతో సఖ్యత ఏర్పడుతుంది. బంధుమిత్రుల సహకారంతో మంచి ఫలితాలు సాధిస్తారు. జూన్ - అక్టోబర్ మాసాల మధ్య రుణ ప్రయత్నాలు ఫలించకపోవచ్చు.
వృత్తి వ్యాపారాలలో లాభాలకు, ఉద్యోగంలో పురోగతికి అవకాశం ఉంది. సృజనాత్మకంగా వ్యవహరించి ఉద్యోగ, వ్యాపారాల్లో ఉత్తమ ఫలితాలు అందుకుంటారు. ప్రస్తుతం చేస్తున్న వ్యాపారంలో చిన్నపాటి మార్పులు చేయడం వల్ల లాభాలు ఆర్జిస్తారు. కుటుంబ వ్యవహారాలు ఆనందం కలిగిస్తాయి. విద్యార్థులు పట్టుదలతో కృషి చేసి సత్ఫలితాలు సాధిస్తారు. సోదరులు, సన్నిహితులతో సదవగాహన ఏర్పడుతుంది. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. విద్యాసంస్థలు, కన్సల్టెన్సీ, ఏజెన్సీ, ఆడిటింగ్ రంగాల వారికి శుభప్రదం. ఉద్యోగం చేస్తూ చదువుకునేందుకు అనుకూలం. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అన్నదమ్ములతో సఖ్యత ఏర్పడుతుంది.
వివాహ యత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ అవకాశాలు అధికం. ఆర్థిక విషయాల్లో నిదానం అవసరం. పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఖర్చులు అధికమవుతాయి. ఆర్థిక విషయాల్లో మధ్యవర్తిత్వం కారణంగా మాటపడాల్సి వస్తుంది. డబ్బు సకాలంలో చేతికి అందక ఇబ్బంది పడతారు. ప్రమోషన్లు అందుకుంటారు. వ్యాపారంలో ఇబ్బందులు ఎదురైనా చివరకు మంచి ఫలితాలు సాధిస్తారు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. మనసు చికాకుగా ఉంటుంది. ఇతరుల నుంచి మాటపడాల్సి రావచ్చు.
వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. పై అధికారుల నుంచి ఒత్తిడికి గురవుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. మనసంతా చికాకుగా ఉంటుంది. స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త వహించాలి. ఉన్నత చదువుల కోసం చేసే యత్నాలకు ఆటంకాలు ఎదురవుతాయి. అనవసర ఖర్చులు అధికం. వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తలు పాటించాలి. శ్రీ ఆంజనేయ స్తోత్రం, శ్రీ రామరక్షా పారయణం శుభప్రదం.
మకరం
ఉత్తరాషాఢ 2,3,4; శ్రవణం; ధనిష్ఠ 1,2 పాదాలు
ఆదాయం: 14, వ్యయం: 14
రాజపూజ్యం: 3, అవమానం: 1
మకర రాశి వారికి ఈ ఏడాది ప్రధమార్థం ఆర్థిక విషయాల్లో కొంత నెమ్మదిగా ఉన్నా ద్వితీయార్థ అనుకూలంగా ఉంటుంది. స్థిరచరాస్తులు సమకూర్చుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త పరిచయాలు లాభిస్తాయి. ఉన్నత చదువులు, విదేశీయానం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు విజయం సాధిస్తారు. బంధుమిత్రుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు.
ఆడిటింగ్, వైద్యం, రాజకీయ సినీరంగాల వారికి ప్రోత్సాహకరం. ఆస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆలస్యాలు, ఆటంకాల వల్ల కొంత అశాంతికి లోనవుతారు. పెట్టుబడుల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. సంవత్సరాంతంలో ఆర్థికపరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. సృజనాత్మక ప్రతిభతో వినూత్నమైన ప్రాజెక్టులు చేపడతారు. ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మందగించే అవకాశం ఉంది. బదిలీలు జరగవచ్చు. బాంధవ్యాలు బలపడతాయి. కొత్త భాగస్వామ్యాలు లాభిస్తాయి.
ఉన్నత విద్య, విదేశీ గమన యత్నాలు ఫలిస్తాయి. విద్య, వైజ్ఞానిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక, రాజకీయ రంగాల వారికి పురోగతి కనిపిస్తుంది. వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. తొందరపాటు నిర్ణయాల కారణంగా నష్టపోయే అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాల్లో చిక్కులు ఎదురవుతాయి. ప్రమోషన్‌ల విషయంలో ఆలస్యానికి ఆస్కారం ఉంది. వైద్యం, ఫార్మా, బీమా రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతాయి.
మనసు చంచలంగా ఉంటుంది. ఏ విషయంలోనూ ఒక స్థిరమైన నిర్ణయానికి రాలేకపోతారు. విద్యార్థులు అశ్రద్ధ కారణంగా నష్టపోతారు. ఆర్థిక విషయాల్లో వివాదాలు తలెత్తుతాయి. ఆర్థిక విషయాల్లో మోసపోయే అవకాశాలున్నాయి. మంచికి పోతే చెడు ఎదురవుతుంది. బదిలీ కోసం మీరు చేసే యత్నాలకు ఆటంకాలెదురవుతాయి. ఇచ్చిన మాట నిలుపుకోవడం కష్టం. రుణ బాధలు అధికమవుతాయి. ఆర్థిక విషయాల్లో ఒత్తిడికి లోనవుతారు. విద్యార్థులు లక్ష్యసాధన కోసం అధికంగా శ్రమించాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. క్రయవిక్రయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగంలో ఒత్తిళ్ల కారణంగా రాజీనామా దాకా వెళతారు. ఓరిమితో వ్యవహరించాలి. ఇచ్చిన మాట నిలుపుకోలేకపోతారు.శ్రీ దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ, ఆరాధన శుభప్రదం.
కుంభం
ధనిష్ఠ 3,4; శతభిషం; పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
ఆదాయం: 14, వ్యయం: 14
రాజపూజ్యం: 6, అవమానం: 1
కుంభ రాశి వారికి ఈ ఏడాది ద్వితీయార్థం నుంచి ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. ఆస్తిపాస్తులు పెంపొందించుకుంటారు. ప్రమోషన్‌లు, కోరుకున్న చోటకు బదిలీలు సంభవం. గృహనిర్మాణం, స్థలసేకరణ చేస్తారు. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. సృజనాత్మక రంగాల్లో రాణిస్తారు. విహానుబంధాలు బలపడతాయి. శుభకార్యాలు జరుగుతాయి. క్రీడలు, పరిశోధన, విద్యా రంగాల వారికి విజయం. రాజకీయ, సినీ, బోధన, న్యాయ, రక్షణ, మైనింగ్ రంగాలవారికి శుభప్రదం. జూన్-అక్టోబర్ మాసాల మధ్య ఆరోగ్యంపై శ్రద్ధ చూపించాలి. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక విషయాల్లో తొందరపాటు తగదు. ఊహించని ఖర్చులు వస్తాయి.
విలాసాలకు, దూరప్రయాణాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. రాజకీయ నేతలకు అనుకూలమైన కాలం. సినీరంగాలకు చెందిన వారు మంచి ప్రాజెక్టులు చేపడతారు. టెక్స్‌టైల్స్, ఎగుమతులు, రవాణా, ఉన్నత విద్య ఆడిటింగ్ రంగాల వారికి అనుకూలం. స్నేహ బాంధవ్యాలు పెంపొందుతాయి. వివాహయత్నాలు ఫలిస్తాయి. విశ్వాసంతో అనుకున్న పనులు నిరాటంకంగా పూర్తిచేయగలుగుతారు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. రుణ బాధలు అధికం. కుటుంబ వ్యవహారాలు మనస్తాపం కలిగిస్తాయి. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ప్రతి పనికి ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఓరిమితో వ్యవహరిస్తే లక్ష్యాలు సాధించగలుగుతారు.
రాబడి బాగున్నా, ఖర్చులు అంతకంటే ఎక్కువగా ఉంటాయి. బదిలీలు అసౌకర్యం కలిగిస్తాయి. రుణబాధలు పెరుగుతాయి. వృత్తిపరంగా సంచారం పెరుగుతుంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి. బాధ్యతలు అధికమవుతాయి. వ్యాపారం మందకొడిగా సాగుతుంది. అనుభవజ్ఞుల సలహాలు పాటించి వ్యాపార రంగంలో మంచి ఫలితాలు సాధిస్తారు. తీర్థయాత్రలు, దానధర్మాలు, విలాసాలకు ఖర్చు చేస్తారు. ప్రేమలు ఫలిస్తాయి. పెద్దల సలహాలతో ముందడుగు వేయాలి. కుటుంబ సభ్యులతో ఎడబాటు తప్పకపోవచ్చు. చిన్నపాటి శస్త్ర చికిత్సకు అవకాశం ఉంది. వ్యాపార విస్తరణ ఆలోచనలు వాయిదా వేయడం మంచిది. ఉన్నత విద్యా విషయాలు, దూరప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి.
రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారు లక్ష్య సాధనలో ఆటంకాలు ఎదుర్కొంటారు. ఆస్తిపత్రాల విషయంలో సమస్యలు ఎదురవుతాయి. బదిలీలు, మార్పులు అసౌకర్యం కలిగిస్తాయి. పై అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల కారణంగా చికాకులు అధికమవుతాయి. దంపతుల మధ్య అపోహలు, అపార్థాల కారణంగా మనశ్శాంతి లోపిస్తుంది. అశ్రద్ధ వల్ల విద్యార్థులు నష్టపోయే అవకాశముంది. ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నా ఓరిమితో వ్యవహరించాలి. మార్పునకు సమయం కాదు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధ న సత్ఫలితాలను ఇస్తుంది.
మీనం
పూర్వాభాద్ర 4; ఉత్తరాభాద్ర, రేవతి
ఆదాయం: 14, వ్యయం: 5
రాజపూజ్యం: 2, అవమానం: 4
మీన రాశి వారు ఈ ఏడాది ద్వితీయార్థంలో ఆస్తిపాస్తులు సమకూర్చుకుంటారు. ఆర్థిక విషయాల్లో అభివృద్ధి సాధిస్తారు. గృహనిర్మాణ యత్నాలు ఫలిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది. అనుబంధాలు బలపడతాయి. ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. విదేశీగమన యత్నాలు ఫలిస్తాయి. జూన్ - అక్టోబర్ మాసాల మధ్య ఆర్థిక వ్యవహారాల్లో కొంత నిరుత్సాహంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఒత్తిళ్లు ఎదురవుతాయి. సన్నిహితుల నుంచి మాటపడాల్సి రావచ్చు.
ఆదాయం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. సంతానం విషయంలో అభివృద్ధికి, శుభకార్యాలకు అవకాశం ఉంది. వైవాహిక జీవితం ఉల్లాసంగా గడుస్తుంది. మార్కెటింగ్, విద్య, వైజ్ఞానిక, ప్రచురణలు, ప్రకటనలు, బోధన, న్యాయ, సినీ, రాజకీయ రంగాలవారికి ఆర్థికంగా ప్రోత్సాహం లభిస్తుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. స్నేహాను బంధాలు పెంపొందుతాయి. విద్యార్థులకు శుభప్రదం. ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి.
నవంబర్ 20 నుంచి టెక్స్‌టైల్స్, చలనచిత్రాలు, మత్స్య, రవాణా, టైల్స్, ఫొటోగ్రఫీ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగంలో స్థిరత్వం సాధిస్తారు. విదేశీ గమనానికి, విదేశాలలో చదువుల కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. జూన్ 21 - అక్టోబర్ 12 తేదీల మధ్య ఉద్యోగం, వ్యాపారాల్లో శ్రమ అధికం. పెద్దల ఆరోగ్యం మందగించే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఖర్చులు అంచనాలు మించుతాయి. అన్నదమ్ముల మధ్య అవగాహన లోపిస్తుంది.
వ్యాపారంలో లాభాలు ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు. విందులు, విలాసాలకు ఖర్చులు అధికమవుతాయి. రుణబాధలు ఎక్కువగా ఉంటాయి. పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. బంధుమిత్రుల కారణంగా బాధ్యతలు అధికమవుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. వృత్తిపరమైన పనులతో ఒత్తిడికి లోనవుతారు. విద్యార్థులకు అనుకూలం. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. క్రమశిక్షణతో, ఓరిమితో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. బంధుమిత్రుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. సహోద్యోగుల నుంచి ఒత్తిళ్లు ఎదురవుతాయి. ఆదాయం ఉన్నా ఖర్చులు అంతకు మించి ఉంటాయి. ఉద్యోగంలో బదిలీలు, మార్పులు చేర్పులకు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఏడాది మొదటి భాగంలో కొంత అసంతృప్తిగా వున్నా ద్వితీయార్థంలో పరిస్థితి మెరుగవుతుంది. విలాసాలకు ఖర్చులు అధికమవుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. స్నేహితులతో మాటపడాల్సి రావచ్చు. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. కామాక్షీదేవి ఆరాధన సమస్యలను తొలగించి సత్ఫలితాలనిస్తుంది.