Begin typing your search above and press return to search.

ఇరాన్ మరో దుస్సాహసం.. బ్రిటన్ రాయబారి అరెస్ట్

By:  Tupaki Desk   |   12 Jan 2020 11:14 AM GMT
ఇరాన్ మరో దుస్సాహసం.. బ్రిటన్ రాయబారి అరెస్ట్
X
అమెరికాపై యుద్ధోన్మాదంతో చెలరేగిపోయిన ఇరాన్ ఆ క్రమంలో తమ దేశం నుంచి వెళుతున్న ఉక్రెయిన్ కు చెందిన ప్రయాణికుల విమానాన్ని కూల్చి ఘోరమైన తప్పిదం చేసింది. ఈ ఘటనకు ప్రపంచానికి ఇరాన్ సారీ కూడా చెప్పింది. అయితే 176మందిని పొట్టనపెట్టుకున్న ఇరాన్ వైఖరిపై ఇప్పటికే ప్రపంచదేశాలు భగ్గుమంటున్నాయి. ఈ ఘటనకు పాల్పడిన ఇరాన్ తమకు పరిహారం ఇవ్వాలని ఇప్పటికే ఉక్రెయిన్ డిమాండ్ చేసింది.

ఇక ఉక్రెయిన్ విమానాన్ని క్షిపణులతో కుప్పకూల్చడాన్ని నిరసిస్తూ ఇరాన్ లో తాజాగా బ్రిటీషర్లు, ఉక్రెయినర్లు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ నిరసనల్లో ఇరాన్ లోని బ్రిటీష్ రాయబారి రాబ్ మెక్ కెయిర్ కూడా పాల్గొన్నారు.

దీంతో ఇప్పటికే చిర్రెత్తిపోయిన ఇరాన్ తాజాగా ఆందోళన చేసిన బ్రిటన్ రాయబారి మెక్ కెయిర్ ను అరెస్ట్ చేసి జైలుకు పంపడం కలకలం రేపింది.. దీనిపై బ్రిటన్ మండిపడింది. తమ రాయబారిని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని.. దౌత్యపరమైన నిబంధనలు ఉల్లంఘించిన ఇరాన్ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.

అయితే బ్రిటన్ రాయబారిని అరెస్ట్ చేయడం.. అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడిపై ఇరాన్ ఎలాంటి స్పందన తెలియజేయలేదు.