Begin typing your search above and press return to search.
బీహార్ రాజకీయాల్లో సంచలనం.. సీఎం అభ్యర్థిగా మహిళ
By: Tupaki Desk | 9 March 2020 10:30 AM GMTత్వరలోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం ఆ రాష్ట్రంలో ఇప్పటి నుంచే కసరత్తు మొదలైంది. రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఇప్పటికే అధికారంలో ఉన్న జనతాదళ్ (యూ) తిరిగి అధికారంలోకి వచ్చేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. అయితే పార్టీ మాజీ ఉపాధ్యక్షుడు, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అడ్డుగా మారాడు. పార్టీ నుంచి బహిష్కరించినప్పటి నుంచి ఆయన పక్కలో బల్లెంలా తయారయ్యాడు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ బాత్ బిహార్ కీ పేరిట ప్రత్యేక కార్యక్రమం తో యువతకు దగ్గరవుతున్నాడు. ఆయన యువతను రాజకీయాల్లో భాగస్వామ్యం చేసేందుకు చర్యలు చేపట్టాడు. అయితే ఒక్కసారిగా బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీహార్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తాను పోటీలో ఉన్నానని ఓ మహిళ ప్రకటించింది. తాను బిహార్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగనున్నట్లు లండన్ నుంచి పుష్పం ప్రియా చౌదరి సోషల్ మీడియా లో ప్రకటించి బీహార్ లో సంచలనం రేపింది. ఆమె ప్రకటన బీహార్ లో తీవ్ర చర్చకు దారితీసింది.
‘‘ బిహార్‌కు మార్పు అవసరం, బిహార్‌కు రెక్కలు అవసరం. చెత్త రాజకీయాలను తిరస్కరించండి. 2020లో ఎగిరేందుకు, పరిగెత్తేందుకు ప్లూరల్స్‌తో చేతులు కలపండి. ఎందుకంటే బిహార్ మెరుగైనవి పొందేందుకు అర్హత కలిగి ఉంది. ఆ మార్పు సాధ్యమవుతుంది’’ అంటూ ట్విటర్ లో ఆమె పేర్కొన్నారు. 2025- 2030లో బిహార్ అభివృద్ధికి బ్లూప్రింట్, రోడ్‌మ్యాప్‌ను పూరల్స్ సిద్ధం చేసిందని ఆమె పార్టీ పేరును ప్రకటించారు. అయితే ఈ ప్రకటన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం ట్వీట్ చేశారు. ఆమెవరోనని సర్వత్రా ఆసక్తిగా మారింది.
ఆమె ఎవరో కాదు కాగా బిహార్‌లోని జేడీయూ ఎమ్మెల్సీగా పనిచేసిన వినోద్ చౌదరి కుమార్తె. బీహార్ లోని దర్భాంగా గ్రామంలో ప్రియా చౌదరి జన్మించింది. ప్రస్తుతం లండన్‌లో నివసిస్తోంది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్‌లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ చేసిన ప్రియ రాజకీయాలపై ఆసక్తి పెంచుకుంది. ఇటీవల రాజకీయాలపై సోషల్ మీడియాలో ప్రకటిస్తూ సంచలనం రేపుతోంది. దీంతో త్వరలోనే ఆమె బీహార్ కు వచ్చి క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఆమెకు వినోద్ చౌదరి అండదండగా ఉంటున్నట్లు సమాచారం.