Begin typing your search above and press return to search.
మాల్యా ఆస్తులపై యూకే కోర్టు సంచలన తీర్పు
By: Tupaki Desk | 5 July 2018 2:19 PM GMTలిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు గట్టి షాక్ తగిలింది. ఇన్నాళ్లు తనకేం కాదని ధీమాగా ఉన్న మాల్యాకు మైండ్ బ్లాంక్ అయ్యే తీర్పు వచ్చింది. ఇండియాలో బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన మాల్యా.. లండన్ పారిపోయిన క్రమంలో 13 బ్యాంకులు కేసులు పెట్టిన విషయం తెలిసిందే. మాల్యా పరారీపై బ్యాంకులు యూకేలో పోరాటం చేస్తున్నాయి. ఈ క్రమంలో యూకేలోని మాల్యా ఇంట్లోకి వెళ్లి అక్కడున్న ఆస్తులను స్వాధీనం చేసుకునే అవకాశాన్ని యూకే హైకోర్టు కల్పించింది. 13 బ్యాంకులు కలిసి వేసిన కేసును విచారిస్తున్న సందర్భంగా యూకే హైకోర్టు.. ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి - ఆయన ఏజెంట్లు హెర్ట్ ఫోర్డ్ షైర్ లోని మాల్యా ఉంటున్న భవనాల్లోకి వెళ్లొచ్చని అనుమతి ఇచ్చింది.
2016లోనే మాల్యా విదేశాలకు పారిపోయాడు. ఆయన ప్రస్తుతం లండన్‌లో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. అయితే బ్యాంకు రుణాల ఎగవేత కేసులో మాల్యాను తీసుకువచ్చేందుకు భారత ప్రభుత్వం బ్రిటన్ పై వత్తిడి తెస్తోంది. అప్పగింత వారెంట్ కింద మాల్యాను గత ఏడాది యూకేలో అరెస్టు చేశారు. ఎస్ బీఐ బ్యాంకుల వద్ద మాల్యా సుమారు 9వేల కోట్ల రుణం తీసుకున్నారు. ప్రజారంగ బ్యాంకుల అప్పులను చెల్లించేందుకు అన్ని ప్రయత్నాల చేశానని, కానీ రాజకీయంగా జోక్యం చేసుకుంటే తానేమీ చేయలేనని మాల్యా ఇటీవలే లేఖ రాశారు. మరోవైపు బ్యాంకులు యూకే హైకోర్టులో తమ వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో లండన్ లోని మాల్యా ఇంట్లోని ఆస్తులను స్వాధీనం చేసుకోవచ్చని యూకే హైకోర్ట్ గురువారం తీర్పు ఇచ్చింది .
టెవిన్ లోని లేడీవాక్ - బ్రాంబిల్ లాడ్జ్ లలో మాల్యా ఆస్తులు ఉన్నాయి. ఎన్ ఫోర్స్ మెంట్ ఆఫీసర్ - ఆయన ఏజెంట్లు ..యూకేలోని హెర్ట్ ఫోర్డ్ షైర్ లోని మాల్యా ఉంటున్న ఇంట్లోకి వెళ్లొచ్చని హైకోర్ట్ ఇచ్చిన ఆ ఆదేశాల ప్రకారం ఎన్ ఫోర్స్ మెంట్ ఆఫీసర్ అక్కడికి వెళ్లి.. సోదాలు నిర్వహించి, అందులో ఉన్న అన్ని వస్తువులను తమ ఆధీనంలోకి తీసుకునే వీలు కలగనుంది. హైకోర్టు జడ్జి జస్టిస్ బ్రయాన్ జూన్ 26న ఈ ఆదేశాలను జారీ చేశారు. అవసరాన్ని బట్టి హైకోర్టు ఎన్ ఫోర్స్ మెంట్ ఆఫీసర్ ఎప్పుడైనా మాల్యా ఇంట్లోకి వెళ్లొచ్చని తెలిపింది. అయితే ఈ ఆదేశాలపై అప్పీలుకు వెళ్లే అవకాశం కల్పించాలని కోర్ట్ ఆఫ్ అప్పీల్ లో మాల్యా పిటిషన్ దాఖలు చేశాడు.