Begin typing your search above and press return to search.

వీలునామా రాసి ఆసుపత్రులకు వెళుతున్న వైద్యులు!

By:  Tupaki Desk   |   13 April 2020 12:30 AM GMT
వీలునామా రాసి ఆసుపత్రులకు వెళుతున్న వైద్యులు!
X
కరోనా వేళ ప్రపంచంలో ఇప్పటివరకూ ఎప్పుడూ చోటు చేసుకోని సంఘటనలు బోలెడన్ని జరుగుతున్నాయి. మిగిలిన దేశాలతో పోలిస్తే.. కరోనా ప్రభావం కాస్త తక్కువనే చెప్పాలి. 135 కోట్ల జనాభా ఉన్న ఒక సాదాసీదా దేశంలో ఇప్పటివరకూ నమోదైన కేసులు.. వాటి రికవరీ ఆశావాహ పరిస్థితుల్లోనే ఉండగా.. మరణాలు కూడా తక్కువగా ఉన్నట్లు చెప్పక తప్పదు. ఇందుకు భిన్నంగా అగ్రరాజ్యాలైన అమెరికా.. బ్రిటన్ లో పరిస్థితి ఉంది. ఇప్పటివరకూ కరోనా కారణంగా భారీగా దెబ్బతిన్నది ఇటలీ అన్న మాట వినిపిస్తుండగా.. అమెరికాలో చోటు చేసుకుంటున్న విధ్వంసం అందరిని అవాక్కు అయ్యేలా చేస్తోంది.

ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో బ్రిటన్ లోని వైద్యులు వినూత్నంగా వ్యవహరిస్తున్నారట. ప్రస్తుతం బ్రిటన్ లోని ఆసుపత్రుల్లో బెడ్లు మూడింట రెండు వంతులు కరోనా వైరస్ బాధితులతో నిండినట్లు చెబుతున్నారు. అంతకు మించిన దారుణం ఏమంటే.. ఆసుపత్రుల్లో జాయిన్ అయ్యే వారిని ఎంపిక చేసుకొని మాత్రమే వైద్యం అందించాల్సి రావటంపై విపరీతమైన ఆవేదన వ్యక్తమవుతోంది. ఒక వైద్యుడికి.. రోగులంతా ఒక్కటే. కానీ.. పాజిటివ్ ల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నాయి. దీంతో.. తీవ్రత ఎక్కువగా ఉన్న వారు.. బతికే అవకాశం పెద్దగా లేని వారికి వైద్యం చేయటం లేదు.

ఇలాంటి పరిస్థితిపై బ్రిటన్ లోని వైద్యులు తీవ్రమైన ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇక.. ఈ దేశంలో ఉన్న భారతీయ వైద్యుల పరిస్థితి మరింత ఇబ్బందిగా మారుతోంది. రేపు ఏమవుతుందో కూడా తెలీటం లేదంటున్నారు. ఆసుపత్రికి వచ్చిన వైద్యులు.. రేపు వస్తామా? రామా? అన్న సందేహంతోనే పని చేస్తున్నారట. అంతేకాదు.. ఆసుపత్రికి వెళ్లటానికి ముందే వీలునామాలు రాసేసి వైద్యసేవలు అందించటానికి వెళుతున్న దారుణ పరిస్థితి బ్రిటన్ లో ఉందంటున్నారు.

ఇటీవల వైద్యులకు అందజేసే రక్షణ పరికరాల్ని మరింత పెంచాల్సిందిగా బ్రిటన్ లోని బంగ్లాదేశ్ కు చెందిన మహిళా డాక్టర్ ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. బ్యాడ్ లక్ ఏమంటే.. సదరు లేడీ డాక్టర్ సైతం రెండు రోజుల క్రితం మరణించినట్లు చెబుతున్నారు. ఇప్పటివరకూ ఎప్పుడూ లేనంత తీవ్రమైన మానసిక ఒత్తిడిని బ్రిటన్ లోని వైద్యులు ఉన్నారట.