Begin typing your search above and press return to search.

యూఎస్ కాకుంటే యూకే కు ప్లాన్ చేసుకోండి

By:  Tupaki Desk   |   27 Dec 2017 8:57 AM GMT
యూఎస్ కాకుంటే యూకే కు ప్లాన్ చేసుకోండి
X
చ‌దువుకోవ‌టం కోస‌మైనా.. ఉద్యోగానికైనా అగ్ర‌రాజ్య‌మై అమెరికాను ల‌క్ష్యంగా పెట్టుకున్నోళ్ల‌కు చుక్క‌లు క‌నిపిస్తున్నాయి. ఇలాంటి వేళ ఒక స్వీట్ న్యూస్ మ‌రో అగ్ర‌రాజ్య‌మైన యూకే నుంచి వ‌చ్చింది. యూకేలో చ‌దువుకుంటున్న విద్యార్థుల‌కు వీసాకు సంబంధించి మ‌రింత సౌక‌ర్య‌వంతంగా ఉండేలా నిబంధ‌న‌లు మారనున్నాయి.

వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 11 నుంచి కొత్త ఇమ్మిగ్రేష‌న్ విధానం అమ‌ల్లోకి రానుంది. ఈ కొత్త విధానంలో స్టూడెంట్ వీసా నుంచి వ‌ర్క్ వీసాలోకి మారేందుకు రూల్స్ మ‌రింత స‌ర‌ళంగా మార‌నున్నాయి. ఓప‌క్క అమెరికాలో హెచ్ 1బీ వీసా నిబంధ‌న‌లు క‌ఠిన‌త‌రంగా మారుతున్న వేళ‌.. అందుకు భిన్నంగా యూకే రూల్స్ మ‌న‌కు అనుకూలంగా ఉండ‌టం గ‌మ‌నార్హం.

యూఎస్ లో ఉద్యోగం ఉంటే త‌ప్ప వీసాలు దొర‌క‌ని వేళ‌.. అందుకు భిన్నంగా యూకేలో వీసాలు ఇండియన్ విద్యార్తుల‌కు శుభ‌వార్త‌గా మారుతుంద‌ని చెబుతున్నారు. తాజాగా మార‌నున్న రూల్ ప్ర‌కారం విద్యార్థి వీసాల‌తో యూకేలో ఉన్న వారు.. త‌మ కోర్సు పూర్తి అయిన వెంట‌నే వ‌ర్క్ వీసాలోకి మారే అవ‌కాశం ఉంటుంది. దీంతో.. ఉపాధికి సంబంధించి ఇబ్బందులు ఉండ‌వ‌ని నిపుణులు చెబుతున్నారు.

యూకే తీసుకున్న తాజా నిర్ణ‌యం నేప‌థ్యంలో విదేశాల్లో విద్యా.. ఉపాధి అవ‌కాశాల మీద ఇంట్ర‌స్ట్ చూపించే వారు.. ఇక‌పై యూఎస్ కంటే యూకే మీద దృష్టి పెడితే మంచిదని చెప్పొచ్చు. టైర్ 2 వీసాను విద్యార్థులు పొందాలంటే గ‌తంలోక‌నీసం డిగ్రీ పూర్తి చేయాలి.

మారిన రూల్స్ ప్ర‌కారం కోర్సు పూర్తి కావ‌టానికి కొన్ని నెల‌ల ముందే టైర్ 2 వీసా కోసం విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకునే సౌల‌భ్యం ఉంటుంది. దీంతో.. కోర్సు పూర్తి కావ‌టానికి ముందే ఉద్యోగ వేట‌ను పూర్తి చేసుకునే వెసులుబాటు ఉంటుంది. గతంలో కోర్సు వీసాతో పాటు.. అద‌నంగా నాలుగు నెల‌లు మాత్ర‌మే వీసా చెల్లుబాటు ఉండేది.

దీంతో.. కోర్సు పూర్తి అయిన వెంట‌నే నాలుగు నెల‌ల వ్య‌వ‌ధిలో ఉద్యోగ వేట‌ను పూర్తి చేయాల్సి వ‌చ్చేది. తాజాగా మారిన రూల్ ప్ర‌కారం.. ముందే వ‌ర్క్ వీసాకు అవ‌కాశం ఉండ‌టంతో.. ఉపాధి అవ‌కాశాల్ని చేజిక్కించుకునే వెసులుబాటు విద్యార్థుల‌కు ఉంటుంది. సో.. మారిన రూల్స్ నేప‌థ్యంలో యూఎస్ తో పోలిస్తే.. యూకే వైపు మొగ్గు చూపితే మంచిద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.