Begin typing your search above and press return to search.

గోల్డెన్ వీసా: యూకేకు భారత మిలియనీర్ల జంప్

By:  Tupaki Desk   |   13 July 2021 9:45 AM GMT
గోల్డెన్ వీసా: యూకేకు భారత మిలియనీర్ల జంప్
X
భారత్ లో అప్పులు తీసుకొని వాటిని తీర్చకుండా విదేశాల్లో నిల్వ చేసి.. అక్కడి ప్రభుత్వాల నిబంధనల మేరకు పెట్టుబడి పెట్టి అక్కడి వీసాలు తీసుకుంటున్నారు. వాటితో భారత్ లో అప్పులు ఎగ్గొట్టి ఎంచక్క విదేశాలకు పారిపోతున్నారు భారత్ కు చెందిన మిలయనీర్లు. నీరవ్ మోడీ, చోక్సీ సహా నిందితులు ఇలా పారిపోయిన వారే..

గోల్డెన్ వీసా వాడుకొని 2008 నుంచి 254 మంది ఇండియన్ మిలియనీర్లు యూకేలో సెటిల్ అయ్యారని తాజాగా ఒక చారిటీ బయటపెట్టింది. గోల్డెన్ వీసా వాడుకొని 2008 నుంచి 254 మంది ఇండియన్ మిలియనీర్లు యూకేలో సెటిల్ అయ్యారని తేల్చింది. యూకేకు చెందిన యాంటీ కరప్షన్ చారిటీ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఇండియన్ టైర్ (1 ఇన్వెస్టర్) వీసా పొందిన ధనిక దేశాల్లో ఏడోదిగా ఉంది.

చైనా 4106మందితో టాప్ 1లో ఉండగా.. రష్యా 2526, హాంకాంగ్ 692, అమెరికా 685, పాకిస్తాన్ 283, కజక్ స్థాన్ 278 లు ఇండియా కంటే ముందు స్థానంలో ఉన్నారు. అంటే అత్యధికంగా చైనాలో మన మిలియనీర్లు పెట్టుబడి పెట్టి వీసాలు తీసుకున్నారు. ఇక ఇండియా కంటే తర్వాత స్థానంలో సౌదీ అరేబియా 223మందితో , టర్కీ 221 మందితో, ఈజిప్ట్ 206మందితో టాప్ 10 జాబితాలో ఉంది.

గోల్డెన్ వీసా అంటే యూకేలో రిజిస్ట్రర్ అయిన కంపెనీల్లో పెట్టుబడులతో అధికారికంగా అనుమతి పొందడం.. 2 మిలియన్ పౌండ్లు పెట్టుబడి పెడితే మూడేళ్ల పాటు యూకేలో ఉండటానికి వెంటనే హక్కు దక్కించుకోవచ్చు. దాని తర్వాత రెండేళ్ల పాటు పొడిగించుకోవచ్చు.

10 మిలియన్ పౌండ్లు పెట్టుబడి పెడితే ఫాస్ట్ ట్రాక్ అప్రూవల్ పొందేసి రెండేళ్ల పాటు లేదా మూడేళ్ల పాటు ఉండిపోవచ్చు. ఆ తర్వాత యూకే పౌరసత్వం కూడా పొందే అవకాశం ఉంటుంది.

భారత్ కు చెందిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ.. ఇండియాలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కాంలో నిందితుడిగా ఉండి యూకే పారిపోయాడు. ఈ మేరకు ఆయన విచారణలో 2015లో ఇన్వెస్టర్ వీసాకు ఇలానే దరఖాస్తు చేసినట్లు తేలింది. ఆ సమయంలో యూకేలో ఉండటానికి సూపర్ రిచ్ పర్సన్లకు 2 మిలియన్ పౌండ్ల పెట్టుబడితో నివాస హక్కులు దక్కించుకున్నాడట..

నిందితులు , బడా పారిశ్రామికవేత్తలు ఇలా లూప్ హోల్స్ ను పట్టుకొని విదేశాలకు పారిపోయి ఆశ్రయం పొందుతుండడంతో 2015 నుంచి 2018 కాలం మధ్యలో ఇష్యూ అయిన వీసాలపై ప్రస్తుతం నిబంధనలు కఠినం చేశారు. యూకే ప్రభుత్వం దీనిపై సమీక్ష నిర్వహిస్తోంది.