Begin typing your search above and press return to search.
మాల్యా మైండ్ బ్లాంక్..భారత్ కు అప్పగింతకు బ్రిటన్ సంతకం
By: Tupaki Desk | 5 Feb 2019 5:26 AM GMTవిలాస పురుషుడు...బ్యాంకులకు రూ.వేల కోట్లు టోకరా పెట్టి బ్రిటన్కు పారిపోయిన పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యా మైండ్ బ్లాంకయ్యే నిర్ణయం వెలువడింది. సుమారు రూ.9 వేల కోట్ల మేర బ్యాంకులను మోసగించి విదేశాలకు పారిపోయిన మాల్యాను భారత్ కు రప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, మాల్యాను భారత్ కు అప్పగించేందుకు ఆమోదం తెలుపుతూ బ్రిటన్ సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై ఆ దేశ హోం శాఖ మంత్రి సాజిద్ జావీద్ సంతకాలు చేశారు.
2017 ఏప్రిల్లో మాల్యాను అరెస్ట్ చేసిన స్కాట్లాండ్ పోలీసులు అనంతరం బెయిల్ పై విడుదల చేశారు. తనను భారత్ కు అప్పగిస్తూ వెస్ట్ మినిస్టర్ కోర్టు వెలువరించిన తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేస్తానని మాల్యా ఇప్పటికే వెల్లడించారు. గతేడాది డిసెంబర్ 10న న్యాయమూర్తి ఆర్బుత్ నాట్ తీర్పు వెలువరిస్తూ... తన ఆర్థిక లావాదేవీలపై మాల్యా భారత్ కోర్టుల్లో సమాధానం చెప్పాల్సిన అవసరం కనిపిస్తున్నదని పేర్కొన్నారు. తప్పుడు పత్రాల ద్వారా రుణాలు పొందినట్లు స్పష్టంగా తెలుస్తున్నదని - మనీ ల్యాండ్రింగ్ కు మాల్యా కుట్ర పన్నినట్లు ప్రాథమికంగా తేలినట్లు చెప్పారు. మాల్యాను భారత్ కు అప్పగించిన తరువాత ఆయనను ఉంచబోయే ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో ఉన్న బ్యారక్ 12లో వసతులు సరిగా లేవని, ఇది మానవ హక్కుల ఉల్లంఘన అని మాల్యా తరఫు న్యాయవాది వాదనను ఆమె తోసిపుచ్చారు. అక్కడి వసతులపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో మాల్యాను భారత్ కు పంపే ప్రక్రియ ప్రారంభమైంది.
మాల్యాను భారత్ కు అప్పగించాలని గతేడాది డిసెంబర్ 10న బ్రిటన్ లోని వెస్ట్ మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు తీర్పునిచ్చింది. అప్పగింత ఒప్పంద ప్రక్రియలో భాగంగా చీఫ్ మెజిస్ట్రేట్ ఆదేశాలను హోం శాఖ మంత్రికి పంపారు. మాల్యా అప్పగింతపై ఉత్తర్వులు జారీ చేసే అధికారం ఆయనకు మాత్రమే ఉంది. రెండు నెలల్లోగా ఆయన దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా - సోమవారం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై సంతకాలు చేశారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం మాల్యాను భారత్ కు అప్పగించేందుకు జావీద్ ఆమోదం తెలిపారని హోం శాఖ సోమవారం ధ్రువీకరించింది. కాగా, ఈ నిర్ణయంపై బ్రిటన్ లోని హైకోర్టులో అప్పీల్ చేస్తానని మాల్యా ట్విట్టర్ లో వెల్లడించారు. హోం శాఖ కార్యదర్శి నిర్ణయం అనంతరం 14 రోజుల్లోగా కోర్టు తీర్పుపై అప్పీల్ చేసేందుకు మాల్యా అనుమతి పొందాల్సి ఉంటుంది. ఆ అప్పీల్ కు అనుమతి లభిస్తే హైకోర్టులో విచారణ ప్రారంభమవుతుంది. మాల్యాను భారత్ కు అప్పగిస్తూ బ్రిటన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని భారత్ స్వాగతించింది. న్యాయ ప్రక్రియను త్వరగా ముగించాలని కోరింది.