Begin typing your search above and press return to search.

మంత్రికి ముద్దు తెచ్చిన తంటా!

By:  Tupaki Desk   |   28 Jun 2021 4:24 AM GMT
మంత్రికి ముద్దు తెచ్చిన తంటా!
X
ఎరక్కపోయి తన లేడీ పీఏకు ముద్దులు ఇచ్చాడు ఆ బ్రిటన్ మంత్రి.. ఇప్పుడు ఇరుక్కుపోయాడు. మంత్రి పదవిని పోగొట్టుకున్నాడు. కరోనా కల్లోలం వేళ కోవిడ్-19 నిబంధనలు ఉల్లంఘిస్తూ తన కార్యాలయంలో పనిచేసే పీఏని గట్టిగా కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్న బ్రిటన్ మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయన రాజీనామాను యూకే ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ శనివారం ఆమోదించారు. దీంతో ముద్దు పెట్టుకున్న పాపానికి మంత్రి పదవి ఊడిపోయింది.

బ్రిటన్ ఆరోగ్య శాఖ మంత్రి మాట్ హాంకాక్ తన పీఏను కార్యాలయంలోనే మద్దు పెట్టుకున్న ఫొటోలను ‘ది సన్’ పత్రిక ప్రచురించింది. అది బ్రిటన్ లో పెద్ద దుమారం రేపింది. ఆఫీసులోనే రాసలీలలు చేస్తున్న మంత్రిపై ప్రతిపక్షాలు, ప్రజలు మండిపడ్డారు.

ఇదివరకే పెళ్లి అయిన బ్రిటన్ఆరోగ్యశాఖ మంత్రి హాంకాక్ ఓ మహిళను ఏరికోరి తన అసిస్టెంట్ గా నియమించుకున్నాడు. ఆమెతో తన కార్యాలయంలోనే రాసలీలలు కొనసాగించాడు. ఆమెను ముద్దులు పెట్టుకుంటున్నట్టుగా ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

దీంతో ‘పీఏతో ఆరోగ్యమంత్రి రాసలీలలు’ అంటూ ‘ది సన్ పత్రిక’ ప్రముఖంగా ఆ ముద్దుల ఫొటోలను ప్రచురించింది. ఇది బ్రిటన్ వ్యాప్తంగా దుమారం రేపింది. ఈ ఫొటోలు మే 6 నుంచి మే 11 మధ్య ఆయన కార్యాలయంలోనే తీసినవి అని సమాచారం. ఈ ఫొటోలను పత్రిక ఎలా సంపాదించిందో మాత్రం వెల్లడించలేదు.

ఇక హాంకాక్ నియమించుకున్న మహిళ 2000 సంవత్సరంలో ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో చదివారని.. ఆమెను పోయిన నెలలోనే ఇన్ కంటాక్స్ విభాగంలో తన సహాయకురాలిగా నియమించుకున్నాడని తెలిసింది.

రాజీనామా చేస్తూ ప్రధాని జాన్సన్ కు ఆరోగ్య మంత్రి హాంకాక్ లేఖ రాశాడు.. ‘ఈ మహమ్మారి సమయంలో ఎంతో త్యాగం చేసిన వ్యక్తులకు నిజాయితీగా పనిచేసినందుకు మేము రుణపడి ఉంటాం. ఈ సంక్షోభం నుంచి మమ్మల్ని దృష్టి మరల్చేందుకే నాపై కుట్ర చేశారు. నా ప్రైవేటు జీవితంను వివాదాల్లోకి లాగారు’’ అని తన ఎఫైర్ తన ఇష్టమని.. ఇది ప్రభుత్వానికి సంబంధించింది కాదని పేర్కొన్నారు. లేఖలో ‘రాజీనామాను స్వీకరించిన తర్వాత క్షమించండి .. ఇప్పటివరకు చేసిన సేవకు గర్వపడుతున్నానని’ హాంకాక్ తెలిపాడు.

ఆరోగ్య మంత్రిగా తనకు సేవ చేసే భాగ్యం కలిగించినందుకు గర్వపడుతున్నా.. మీ మద్దతుకు నేను కృతజ్ఞుడను.. ప్రజాసేవకు మీ సహకారం ఎంతో ఉందని నమ్ముతున్నాను’ అని హాంకాక్ ప్రధాని జాన్సన్ కు భావోద్వేగంతో లేఖ రాశారు.

ఇక రాజీనామా చేసిన హాంకాక్ స్థానంలో ఆరోగ్యమంత్రిగా సాజిద్ జావిత్ అనే ఎంపీని నియమించారు. ఈ నియామకాన్ని క్వీన్ ఎలిజిబెత్ 11 ఆమోదించారు.

ఈ వివాదం ప్రారంభంలో ప్రధాని జాన్సన్ తన కేబినెట్ మంత్రి హాంకాక్ కు మద్దతు ఇవ్వడానికి ప్రయత్నించాడు.కానీ ‘ది సన్ పత్రిక’ దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం.. రచ్చ జరగడంతో ఇక తప్పనిసరి పరిస్తితుల్లో రాజీనామాను చేయించాల్సి వచ్చింది.