Begin typing your search above and press return to search.
భారతీయులకు మరో గుడ్ న్యూస్.. 15 రోజుల్లోనే టూరిస్టు వీసాలు..!
By: Tupaki Desk | 17 Dec 2022 11:30 AM GMTబ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొన్నేళ్లుగా భారత్-బ్రిటన్ మధ్య సత్సంబంధాలు ఉండగా రిషి సునాక్ వాటిని మరింత ముందుకు తీసుకెళ్తున్నారు. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ భారత్ తో మైత్రీ బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ ఏడాది బాలిలో జరిగిన జీ 20 సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ సహా ఆయా దేశాల అధినేతలు పాల్గొని పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా బ్రిటన్ ప్రధాని రిషి సునాక్.. భారత ప్రధాని మోదీ మధ్య కీలక చర్చలు జరిగాయి. ఈ క్రమంలోనే రిషి సునాక్ ను భారత పర్యటనకు రావాలని మోదీ ఆహ్వానించారు.
వీరిద్దరి కలయిక తర్వాత బ్రిటన్ ప్రధాని కార్యాలయం ఒక కీలక ప్రకటన విడుదల చేసింది. భారతీయులకు ఇప్పటి వరకు ఇస్తున్న వీసా కోటాను పెంచుతున్నట్లు పేర్కొంది. ప్రతి ఏడాది మూడు వేలకు పైగా బ్రిటన్ వీసాలను భారతీయులను అదనంగా ఇవ్వనున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే.
18 నుంచి 30 ఏళ్ల లోపు ఉండి కలిగి డిగ్రీ పట్టా ఉన్న భారతీయులు తమ దేశంలో రెండేళ్లపాటు పని చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు బ్రిటన్ విదేశీ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ నిర్ణయం ద్వారా భారత్ బ్రిటన్ మధ్య మైగ్రేషన్.. మొబిలిటీ పార్ట్‌నర్‌షిప్ మరింత బలపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేసింది.
ఇండో ఫసిపిక్ రీజయన్ లోని అన్ని దేశాల కంటే భారత్ తోనే బ్రిటన్ అత్యంత సన్నితంగా కొనసాగుతోందని పేర్కొంది. ఇక విదేశాల నుంచి బ్రిటన్ వస్తున్న విద్యార్థుల్లో భారతీయులే నాలుగోవంతు ఉన్నారని వెల్లడించింది. తాజాగా బ్రిటన్ భారతీయులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై బ్రిటన్ కు పర్యటన వచ్చే భారతీయులకు 15 రోజుల్లోనే టూరిస్టు వీసాలను అందజేయనున్నారు.
ఈ విషయాన్ని బ్రిటిష్ హై కమిషనర్ అలెక్స్ ఎల్లీష్ తాజాగా ప్రకటించారు. ఈ ఏడాది చివరి నాటికి భారతీయులకు 15రోజుల్లోనే విజిట్ వీసాలు ఇస్తామని తాము రెండు నెలల క్రితమే ప్రకటించామని తెలిపారు. ఇంకా ముందుగా కావాలనుకువారే 'ప్రియారిటీ వీసా' విధానాన్ని కూడా ఉపయోగించుకోవచ్చని తెలిపారు. వీరికి ఐదు రోజుల్లో వీసా వస్తుందని తెలిపారు. స్టూడెంట్ వీసాలను పెద్ద సంఖ్యలో ఇస్తున్నామని భారతీయులు వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.