Begin typing your search above and press return to search.

ఇంకో ప్ర‌ముఖ దేశం షాక్‌..6వేల వీసాలు రిజెక్ట్‌

By:  Tupaki Desk   |   17 May 2018 2:06 PM GMT
ఇంకో ప్ర‌ముఖ దేశం షాక్‌..6వేల వీసాలు రిజెక్ట్‌
X

అమెరికా - బ్రిటన్‌ తోపాటు సింగపూర్ - ఆస్ట్రేలియా - న్యూజీలాండ్ దేశాలు వీసా నిబంధనలను కఠినతరం చేయడం, అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి కారణంగా గ‌త ఏడాది మ‌న దేశానికి చెందిన వివిధ రంగాల నిపుణులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఏడాది కొద్దిగా పరిస్థితులు సద్దుమణగుతున్న సమయంలో యూకే మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఏకంగా ఆరువేల‌మందికి పైగా భార‌తీయుల వీసాలు రిజెక్ట్ చేసింది. వీరిలో ఇండియాకు చెందిన ఇంజనీర్లు - ఐటీ ప్రోఫెషనల్స్ - డాక్టర్లు - టీచర్లతో పాటు పలు రంగాల్లోని ప్రొఫెషనల్స్‌ కు యూకే వీసాలను నిరాకరిస్తున్నట్టు నివేదికలు వివ‌రిస్తున్నాయి.

సీఏఎస్ఈ అనే సంస్థ ప‌లు గణాంకాల‌తో వీసాలు పొందుతున్న వివ‌రాల‌ను వెల్ల‌డించింది. టైర్ 2 వీసా కేటగిరిలో భాగంగా కంపెనీలు ఈయూ వెలుపల నుండి ఏడాదికి సుమారు 20వేల 700 మంది విదేశీ ఉద్యోగులను నియమించుకొనే అవకాశాన్ని కల్పించగా ఇందులో నైపుణ్యం ఉన్న భారతీయులకు యూకే వీసాలు కేవలం 57 శాతం మాత్రమే దక్కుతున్నాయని వివ‌రించింది. ఇందులో ప్ర‌ధానంగా ఇటీవ‌ల పెద్ద ఎత్తున కోత‌లు పెట్టార‌ని వెల్ల‌డించింది. గడచిన ఆరేళ్ళుగా నెలకు 1600 మంది చొప్పున ఉన్న పరిమితిని కేవలం ఒకే ఒక్కసారికి పెంచారు. కానీ, గత ఏడాది డిసెంబర్ నుండి ఈ పరిమితిని తగ్గిస్తున్నారు. ఈ కారణంగానే 2017 డిసెంబర్ నుండి 2018 మార్చి వరకు సుమారు 6,080 మంది ఇండియన్స్‌కు వీసాలు నిరాకరించారని సంస్థ తెలిపింది.

వీసా విధానం వ‌ల్ల ల‌బ్ధి పొందిన‌ప్ప‌టికీ ఇటీవ‌ల విధానం మార్చుకోవ‌డంతో ఈ తిర‌స్క‌ర‌ణ‌లు జ‌రుగుతున్నాయ‌ని సీఎఎస్ఈ డిప్యూటీ డైరెక్టర్ నయోమీ వేర్ విశ్లేషించారు. ప్ర‌ధానంగా సైన్స్, ఇంజనీరింగ్ , టెక్నాలజీ రంగాల్లో భారత్, యూకేల మధ్య మేధోమదనం, సహాయ సహకారాల వల్ల తాము లాభం పొందామని అయితే, యూకే ఇమ్మిగ్రేషన్ విధానం కారణంగా ఇప్పుడు మెజార్టీ తిర‌స్క‌ర‌ణ‌ల‌కు గుర‌వుతున్నాయ‌ని తెలిపారు. అందుకే నైపుణ్య‌వంతులైన ఉద్యోగుల‌ను ఆహ్వానించే విధంగా ఉండేలా విధానాలు ఉండాల‌ని తాము సూచించ‌నున్న‌ట్లు న‌యోమీ తెలిపారు.