Begin typing your search above and press return to search.
బ్రిటన్ లో తొలి మరణం.. మొదలైన ‘ఒమిక్రాన్’ మరణ మృదంగం
By: Tupaki Desk | 13 Dec 2021 12:36 PM GMTప్రపంచాన్ని మరోసారి భయంలోకి నెట్టింది ఒమిక్రాన్. అత్యంత వేగంగా ఈ వైరస్ విస్తరిస్తోంది. అంతకుముందున్న వేరియంట్ కంటే ఇది ఐదురేట్ల జెట్ స్పీడ్ తో మనుషుల శరీరాల్లోకి ప్రవేశిస్తోంది. కరోనా నివారణకు రెండు డోసుల టీకా వేసుకున్న వారిని సైతం ఒమిక్రాన్ వదిలిపెట్టడం లేదు. ఇప్పటి వరకు 50 దేశాలకు విస్తరించిన ఒమిక్రాన్ ఆ తరువాత మరికొన్ని దేశాలకు వెళ్తుందనడంలో సందేహం లేదంటున్నారు వైద్య నిపుణులు. దీంతో చాలా దేశాలు అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేశారు. ముఖ్యంగా దక్షిణాఫ్రికా నుంచి వచ్చే విమానాలపై భారీ నిఘా పెట్టారు. అయితే తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటి వరకు ఒమిక్రాన్ మరణం నమోదు కాలేదని తెలిపింది. ఈ వైరస్ ను కొనుగొన్న సౌతాఫ్రికాలోనూ ఎవరూ చనిపోలేదని అక్కడి వైద్య శాస్త్రవేత్తలు ప్రభుత్వానికి నివేదించారు.
గత నెల 25న దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ ను కొనుగొన్నారు. ఇదే నెల 9న సేకరించిన నమూనాకు జినోమ్ సీక్వెన్సింగ్ చేయంగా కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది. అయితే 19 నుంచి 23 తేదీల మధ్య దీనిని గుర్తించినట్లు నెదర్లాండ్ ప్రభుత్వం తెలుపుతోంది. దీంతో దక్షణిఫ్రికా, నెదర్జాండ్ దేశాల్లోనా అనేది స్పష్టత లేకుండా పోయింది. అయితే సౌతాఫ్రికా నుంచి ఇతర దేశాల్లోకి వెళ్లిన వారిలోనే ఇది ఇతర దేశాలకు వెళ్లినట్లు భావిస్తున్నారు. సౌతాఫ్రికాలో అధికారికంగా ప్రకటన వెలువడకముందే ఇతర దేశాల్లోకి వెళ్లినట్లు భావిస్తున్నారు.
ఒమిక్రాన్ ఎఫెక్ట్ దక్షిణాఫ్రికాలో కంటే బ్రిటన్ లోనే అధికంగా ఉన్నట్లు లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్, ట్రాపికల్ మెడిసిన్ తెలిపింది. అదనపు రక్షణ చర్యలు తీసుకోకపోతే యూకేలో భారీ ప్రాణనష్టం తప్పదని హెచ్చరించింది. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి 25వేల నుంచి 75వేల మరణాలు సంభవించే అవకాశం ఉందని తాజాగా వెల్లడించింది. ఆస్పత్రిలో చేరే వారి సంఖ్య 60శాతం పెరగనున్నట్టు తెలిపింది.
బ్రిటన్ లో తాజాగా ఒమిక్రాన్ తీవ్ర రూపం దాల్చుతోంది. ఒమిక్రాన్ సోకిన తొలి వ్యక్తి బ్రిటన్ లో మరణించినట్టు ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. సోమవారం ఒక్కరోజే దాదాపు 1000 కేసులు బయటపడ్డాయి. కాగా ప్రస్తుతానికి ‘ఒమిక్రాన్’ కేసుల్లో బ్రిటన్ మొదటి స్థానంలో ఉంది. దీంతో అక్కడ ఒమిక్రాన్ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఈ మరణంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. రాబోయే రెండు నుంచి నాలుగు వారాల్లో స్థానికంగా బయటపడే మొత్తం కేసుల్లో సగం ఒమిక్రాన్ కేసులో ఉంటాయని బ్రిటన్ ఆరోగ్యశాఖ తెలిపింది. ఇలాగే కొనసాగితే ఈనెలాఖరుకు కేసుల సంఖ్య 10 లక్షలు దాటవచ్చని ప్రకటించింది.
ఒమిక్రాన్ సోకిన వారిలో స్వల్ప లక్షణాలున్నా జాగ్రత్తలు పాటించాల్సిందేనని అంటున్నారు. కరోనా నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని తెలిపింది. గతంలోనూ మొదట్లో వైరస్ వ్యాప్తి చెంది, ఆ తరువాత మరణాలు సంభవించాలని పేర్కొంది. అయితే ఇది వేగంగా వ్యాప్తిం చెందడంతోవారిలో ఉండే దీర్ఘకాలిక వ్యాధులతో పోరాడే అవకాశం ఉందని అంటున్నారు. దీనికి వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమన్నారు. మరణాలు సంభవించకపోవడానికి వ్యాక్సిన్ కూడా అడ్డుకుంటుందని అనుకోవచ్చని అంటున్నారు. వ్యాక్సిన్ వేసుకున్న వారికి ఒమిక్రాన్ సోకినా మరణం నుంచి కాపాడే అవకాశం ఉందని తెలుపుతున్నారు. ఈ సమయంలో జాగ్రత్తలు కూడా పాటించాలంటున్నారు.