Begin typing your search above and press return to search.

పాజిటివ్ ల్ని పట్టుకునేందుకు కుక్కలు..?

By:  Tupaki Desk   |   17 May 2020 5:30 PM GMT
పాజిటివ్ ల్ని పట్టుకునేందుకు కుక్కలు..?
X
విన్నంతనే ఉలిక్కిపడటమే కాదు.. నిజమా? అన్న సందేహం కలుగుతుంది. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మాయదారి రోగానికి మందు కనిపెట్టేందుకు వీలుగా ప్రపంచ వ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతుంటే.. ఈ లోపు ఎవరికి వారు.. రోగుల సంఖ్య తగ్గించేందుకు వినూత్న మార్గాల్ని అనుసరిస్తున్నారు. తాజాగా ఆ కోవకే చెందుతుంది తాజా ప్రయోగం.

కరోనా లక్షణాలు మనిషిలో బయటపడటానికి సమయం తీసుకోవటం.. ఆ లోపు.. సదరు వ్యక్తి ద్వారా మరికొందరికి వ్యాప్తిస్తున్న వైనం తెలిసిందే. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు వీలుగా యూకేలో వినూత్న పరిశోధనల్ని అక్కడి ప్రభుత్వం మొదలు పెట్టింది.

మాయదారి రోగం సోకిన మనుషుల్ని గుర్తించేందుకు వీలుగా కుక్కలకు ట్రైనింగ్ ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా పరిశోధనలు షురూ చేశారు. పాజిటివ్ లెక్క తేల్చే కిట్ల కొరత ఉండటం.. ఆర్థికంగా భారం కావటంతో.. ఈజీగా గుర్తించేందుకు కుక్కలకు తగినంత శిక్షణ ఇవ్వటం ద్వారా ఈ సమస్యను అధిగమించాలన్న ఆలోచనలో ఉన్నారు.

పాజిటివ్ గా తేలిన వ్యక్తి నుంచి శాంపిల్ తీసుకోవటం.. కోవిడ్ లేని వారి నుంచి శాంపిల్స్ సేకరిస్తారు. అనంతరం శిక్షణ పొందిన కుక్కల వద్ద వాటిని ఉంచి.. వాసనతో మాయదారి వ్యాధి ఉందో లేదో అన్న విషయాన్ని గుర్తించే ట్రైనింగ్ ప్రోగ్రాం సాగుతోంది. ఈ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు.. అనుమానాలు వ్యక్తమవుతున్నా.. అధికారులు మాత్రం తమ పని తాము కానిస్తుండటం గమనార్హం.