Begin typing your search above and press return to search.

బ్రేకింగ్ :మరో 6 నెలలు దేశం మొత్తం లాక్ డౌన్!

By:  Tupaki Desk   |   28 March 2020 12:50 PM GMT
బ్రేకింగ్ :మరో 6 నెలలు దేశం మొత్తం లాక్ డౌన్!
X
కరోనా వైరస్ ..విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచంలోని పలు దేశాలకు ఇప్పటికే లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. అయినప్పటికీ ఈ కరోనా ప్రపంచం వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తుంది. ప్రతి దేశంలో కూడా కరోనా భాదితులు రోజురోజుకి ఊహించని స్థాయిలో పెరిగిపోతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు లాక్‌ డౌన్‌ ను మరో 6 నెలలు పొడిగించాలని బ్రిటన్‌ భావిస్తోంది. కరోనా రెండో దశకు చేరకుండా అడ్డుకోవాలంటే సెప్టెంబర్‌ వరకు లాక్‌ డౌన్‌ ఉంచాల్సిన అవసరం ఉందని బ్రిటన్‌ డిప్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌ జెన్నీ హారిస్‌ అభిప్రాయపడ్డారు.

దేశంలో కరోనా ని పూర్తిగా అరికట్టాలంటే .... కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందే అని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ కరోనా కి ఇంకా సరైన మందు లేకపోవడంతో ..లాక్ డౌన్ ఒక్కటే సరైన మార్గమని - లాక్‌ డౌన్‌ సమయంలో ప్రజలు బయటకు రాకుండా ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వం కోరుకుంటుంది అని ఆమె తెలిపారు.

ఇప్పడే లాక్‌ డౌన్‌ ఎత్తివేయాలని మేము అనుకోవడం లేదు. ఒక్కసారిగా నిర్బంధం తొలగిస్తే మా ప్రయత్నాలన్నీ వృధా అవుతాయి. మొత్తం పరిస్థితులను బట్టి చూస్తే మరో ఆరు నెలలకు పైగా లాక్‌ డౌన్‌ కొనసాగించాల్సిన అవసరం రావొచ్చు. అయితే ఇంత పెద్ద స్థాయిలో లాక్‌ డౌన్‌ చేయాల్సిన ఆగత్యం ఏర్పడకపోవచ్చు. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటాం. కొన్ని చర్యలను కంట్రోల్డ్‌ మేనర్‌ లో మరింత ఎక్కువగా అమలు చేస్తామని జెన్నీ హారిస్‌ వివరించారు.

ఇంకా ఆమె మాట్లాడుతూ ..ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నప్పటికీ .. ప్రజలు ఇంటికి పరిమితమైతే వైరస్‌ ప్రభావం తగ్గుతుందని - బ్రిటన్‌ లో గత వారం కొత్తగా 6,903 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఈ వారం ఆరంభంలో ఇప్పటివరకు 2,710 మంది కోవిడ్‌ బారిన పడ్డారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో లండన్‌ లో వచ్చే రెండు మూడు వారాల్లో గడ్డుకాలం తప్పదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా, యువరాజు చార్లెస్‌ తో పాటు ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ - ఆరోగ్యశాఖ మంత్రి మట్‌ హన్‌ కాక్‌ ఇప్పటికే కరోనా మహమ్మారి బారిన పడిన విషయం తెలిసిందే.