Begin typing your search above and press return to search.
మనోళ్ల కోసం బ్రిటన్ తల్లడిల్లిపోతోంది
By: Tupaki Desk | 11 March 2018 6:18 AM GMTప్రపంచవ్యాప్తంగా భారతీయుల సత్తా ఏంటో మరోమారు తెలుసుకునే సందర్భం ఇది. అత్యుత్తమ నైపుణ్యవంతులుగా ఇప్పటికే మనోళ్లు ప్రపంచవ్యాప్తంగా నిరూపించుకున్న సంగతి తెలిసిందే. అయితే మనోళ్లు టాలెంట్ కారణంగానే ప్రపంచ దేశాలను ఆలోచనలో పడేయటం లేదు. మనం వివిధ దేశాల్లో పర్యటించకపోయినా ఆ దేశాలు ఆవేదన చెందుతున్నాయి. అంతేకాదు... భారతీయులను గౌరవించుకోవాలని చెప్తున్నాయి. గత రెండేళ్లుగా బ్రిటన్ కు భారత పర్యాటకుల తాకిడి తగ్గిపోయింది. మరోవైపు బ్రిటన్ తో పోలిస్తే పక్కనే ఉన్న ఫ్రాన్స్ కు వెళ్లే భారతీయుల సంఖ్య పెరుగుతోంది. ఇలా జరగకుండా భారతీయ పర్యాటకులను ఆకట్టుకోవాలంటే వారి వీసా ధరలను తగ్గించాలని సూచిస్తోంది యూకేలోని మేధోవర్గం.
రాయల్ కామన్ వెల్త్ సొసైటీ(ఆర్ సీఎస్) అధ్యయనం చేసి 'బ్రిటన్ అండ్ ఇండియా: బిల్డింగ్ ఏ న్యూ వీసా పార్ట్ నర్ షిప్` పేరుతో నివేదిక ప్రకారం విడుదల చేసిన 2016లో భారత్ నుంచి 6లక్షల మంది భారత పర్యాటకులు ఫ్రాన్స్ కు వెళ్లారు. యూకేతో పోలిస్తే ఈ సంఖ్య 1,85,000 ఎక్కువ. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 2016లో యూకేలో భారత పర్యాటకుల సంఖ్య 1.73శాతం తగ్గగా.. ఫ్రాన్స్ లో మాత్రం 5.3శాతం పెరిగింది. అయితే వీసా ధరను తగ్గిస్తే భారత పర్యాటకులను ఆకట్టుకోవచ్చు అని నివేదిక పేర్కొంది. ఇందుకోసం సరికొత్త యూకే-ఇండియా వీసా ఒప్పందాన్ని ప్రతిపాదించింది. దీని ప్రకారం.. ప్రస్తుతమున్న రెండేళ్ల వీసా ధరను 388 పౌండ్ల (సుమారుగా రూ.35 వేలు) నుంచి 89 పౌండ్లకు (సుమారుగా రూ.8 వేలు) తగ్గించాలని నివేదిక సూచించింది. ఇలా చేయడం వల్ల వాణిజ్యపరంగా, పర్యాటక పరంగా దేశం మరింత అభివృద్ధి చెందుతుందని, అంతేగాక ఇరుదేశాల మధ్య వ్యాపార బంధాలు బలోపేతమవుతాయని మేధోవర్గం అభిప్రాయపడుతోంది. మొత్తంగా భారతీయుల సత్తా ఏంటో బ్రిటన్ ఈ రూపంలో కూడా గుర్తించిందని అంటున్నారు.