Begin typing your search above and press return to search.

ప్ర‌వాసుల‌కు గుడ్‌ న్యూస్ చెప్పిన యూకే

By:  Tupaki Desk   |   2 April 2020 5:10 AM GMT
ప్ర‌వాసుల‌కు గుడ్‌ న్యూస్ చెప్పిన యూకే
X
చిన్నాపెద్ద దేశాలు సంబంధం లేదు.. ఆ దేశ‌మేదైనా త‌న పంజా విసురుతూ మాన‌వాళిని ప‌ట్టి పీడిస్తున్న వైర‌స్ క‌రోనా. ఈ క‌రోనా బారిన ల‌క్ష‌ల సంఖ్య‌లో ప్ర‌జ‌లు స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. ఆ క‌రోనాను ఎదుర్కొనేందుకు ప్ర‌పంచ దేశాలు కంటి మీద కునుకు లేకుండా ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. అయినా ఆ కేసులు త‌గ్గుముఖం ప‌ట్ట‌క‌పోగా తీవ్ర‌మ‌వుతున్నాయి. అయితే క‌రోనా బాధితులు, అనుమానితుల‌కు వైద్యులు, వైద్య సిబ్బంది విశేష సేవ‌లు అందిస్తున్నారు. త‌మ సెల‌వులు, కుటుంబ‌స‌భ్యుల‌ను వ‌దిలేసి నిరంత‌రం క‌రోనా బాధితుల కోసం ప‌ని చేస్తున్నారు. ఈ స‌మ‌యంలో వారికి కూడా క‌రోనా వైర‌స్ పాకుతోంది.

అయితే వైద్యుల సేవ‌లు గుర్తించి ప్ర‌పంచ దేశాలు వారికి అన్ని స‌దుపాయాలు, సౌక‌ర్యాలు, వ‌స‌తులు క‌ల్పిస్తున్నారు. వారికి ప్ర‌త్యేకంగా పారితోషికం అందిస్తున్నాయి కూడా. అయితే భారతీయులు అధికంగా పనిచేసే అమెరికా, యూకేేల్లో చిక్కుకున్నారు. ప్ర‌స్తుతం వారు భారత‌దేశానికి రాలేని పరిస్థితి. యూకేతోపాటు అమెరికా తదితర పొరుగు దేశాల్లో వైద్య, పారామెడిక‌ల్ సిబ్బందిగా అనేక మంది భారతీయులు ఇమ్మిగ్రెంట్ వీసాలపై పని చేస్తున్నారు. త్వరలోనే వారి గడువు ముగుస్తోంది. ఈ క్ర‌మంలో వీసా పొడిగింపుపై ఆందోళ‌న చెందుతున్న స‌మ‌యంలో ఓ శుభవార్త వినిపించింది.

యూకేలో సేవలు అందిస్తున్న విదేశీ వైద్యులు, నర్సులు, పారా మెడికల్‌ సిబ్బంది వీసా కాల పరిమితిని ఏడాదిపాటు ఆటోమేటిక్ గా పొడిగిస్తున్నట్లు యూకే హోం శాఖ కార్యదర్శి ప్రీతి పటేల్ ప్ర‌క‌టించి అంద‌రికీ తీపి క‌బురు అందించారు. కరోనా మహమ్మారి పై పోరులో వారంతా భాగస్వాములై తమదేశానికి ఎంతో సేవ చేస్తున్నారని, అందుకోస‌మే వారికి ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. తాజా నిర్ణయంతో యూకేలోని 2,800 మంది వలస జీవులకు ప్రయోజనం ఏర్ప‌డింది.

వాస్త‌వంగా భారత్‌ సహా ఇతర దేశాల నుంచి వచ్చి యూకే లో నివసిస్తున్న వైద్య సిబ్బంది వీసా గడువు అక్టోబరులో ముగియనుంది. ఈ క్ర‌మంలో ఇప్పుడు తీసుకున్న తాజా నిర్ణయంతో వారంతా ఏడాది పాటు సంతోషం గా యూకేలో ఉండే అవ‌కాశం లభించింది. కరోనాతో పోరాడుతూ ప్రజల ప్రాణాలను రక్షించేందుకు వారెంతో శ్రమిస్తున్నారని, వారి పట్ల కృతజ్ఞతాభావం చాటుకునే సమయం ఇదేన‌ని యూకే కార్య‌ద‌ర్శి ప్రీతి తెలిపారు. వీసా పొడిగింపునకు సంబంధించిన ఖర్చులు కూడా ప్రభుత్వమే భరిస్తుందని, వైద్య సిబ్బంది కుటుంబ సభ్యులకు కూడా ఇది వర్తిస్తుందని ప్రకటించారు.

అయితే అమెరికాలో కూడా వీసా గ‌డుపు పెంపు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వైద్య రంగం, దానికి అనుబంధంగా పనిచేసే లీగల్ ఇమ్మిగ్రెంట్స్ వీసాల గడువును పొడిగించాలని వినతులు వస్తున్నాయి. అమెరికా ఏం నిర్ణ‌యం తీసుకుంటుందో ఎదురు చూడాలి.