Begin typing your search above and press return to search.

రష్యా ప్రతిపాదనకు ఉక్రెయిన్ అంగీకారం..: నాటో పై ఆగ్రహం

By:  Tupaki Desk   |   9 March 2022 5:22 AM GMT
రష్యా ప్రతిపాదనకు ఉక్రెయిన్ అంగీకారం..: నాటో పై ఆగ్రహం
X
రష్యా, ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధం కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రష్యా చేసిన ప్రతిపాదనలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు అంగీకరించడంతో ఆందోళన వాతావరణానికి తెరపడే సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు. తనకు వెన్నంటూ ఉంటుందనుకున్ నాటో సరైన సమయంలో చేతులు ఎత్తేయడంతో రష్యా ప్రతిపాదనలకు అంగీకరించక తప్పలేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఓ వీడియోలో ప్రసంగం చేశారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా నెలక్కన్న ఉత్కంఠ వీడనున్నట్లు సమాచారం.

ఉక్రెయిన్ పై ఆధిపత్యం కోసం రష్యా కొన్ని సంవత్సరాలుగా చర్చలు జరుపుతోంది. ప్రధానంగా నాటో దళంలో ఉక్రెయిన్ చేరకూడదని, అందుకు లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వాలని రష్యా కోరుతోంది. కానీ ఉక్రెయిన్ అధ్యక్షుడు అందుకు ఒప్పుకోలేదు. తాను నాటోలో చేరమని హామీ ఇవ్వలేని చెప్పింది. అటు నాటో దేశాలు ఉక్రెయిన్ ను చేర్చుకోమని చెబుతున్నా లిఖిత పూర్వక హామీకి ఒప్పుకోలేదు. దీంతో కొన్ని నెలల కిందట మరోసారి చర్చలు జరిపిన రష్యా యుద్ధానికి బరిలో దిగింది.

యుద్ధం ప్రారంభమైనా ఉక్రెయిన్ అధ్యక్షుడు రష్యా మాట వినలేదు. అయితే రష్యాపై యుద్ధానికి నాటో అండగా ఉంటుందని భావించారు. కానీ ఇందులో సభ్యత్వం లేనందున సాయం చేయలేమని ఇందులోని దేశాలు స్పష్టం చేశాయి. పరోక్ష సాయం అందిస్తామని, ప్రత్యక్షంగా మిలటరీ సాయం చేయమని చెప్పాయి.

ఇందులో సభ్యత్వ దేశమైనా అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్పష్టమైన ప్రకటన చేశారు. దీంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు ఒంటరిగానే యుద్ధం లోకి దిగారు. ఆ తరువాత తీవ్ర నష్టాన్ని భరించిన జెలెన్ స్కీ 13 రోజుల పాటు వెయిట్ చేశాడు. కానీ రష్యా మాత్రం తన మాట వినాలని బాంబుల దాడి కురిపిస్తూనే ఉంది.

మరోవైపు రష్యాపై ఆంక్షలు విధిస్తున్నారే గానీ.. ఆ దేశంపై ఇతర దేశాలు యుద్ధం చేయడానికి సాహసించడం లేదు. దీంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ యూటర్న్ తీసుకున్నాడు. తాజాగా ఆయన ఓ న్యూస్ చానెల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘ మా అభ్యర్థనలు నాటో పట్టించుకోవడం లేదు. దీంతో నాటో లో చేరే ఆలోచనను విరమించుకుంటున్నాం. సోవియట్ నుంచి విడిపోయిన దేశాల మధ్య నాటో చిచ్చుపెట్టింది. నాటోలో చేరుతామని ఇప్పటి వరకు అడిగాం. కానీ మోకాళ్లపై ప్రాథేయపడాల్సిన అవసరం లేదు. రష్యా యుద్ధానికి ముందు పెట్టిన ప్రతిపాదనలకు ‘రాజీ’కి సిద్ధం’ అని ప్రకటించారు.

అయితే ఇప్పటి వరకు ఉక్రెయిన్ కు మద్దతు ఇచ్చిన దేశాల పరిస్థితి ఏంటనే చర్చ సాగుతోంది. అంతేకాకుండా ఉక్రెయిన్ పూర్తిస్థాయి మిలటరీ రహిత దేశంగా మార్చాలని అనుకుంటోంది. మరి దీనికి ఉక్రెయిన్ ఒప్పుకుంటుందా..? అని అంటున్నారు. దానికి తోడు క్రిమియాను రష్యాను అంతర్భాగం చేయాలని అంటోంది. ఇదిలా ఉండగా జెలెన్ స్కీ రాజీకి రావడంతో రష్యా యుద్ధం ఆపుతుందా..? అనేది చూడాలి.