Begin typing your search above and press return to search.

ఉక్రెయిన్ సైనికులకు లొంగిపోయిన రష్యా సైనికులు.. కారణమిదే

By:  Tupaki Desk   |   28 Feb 2022 8:34 AM GMT
ఉక్రెయిన్ సైనికులకు లొంగిపోయిన రష్యా సైనికులు.. కారణమిదే
X
ఉక్రెయిన్ పై యుద్ధానికి ఉసిగొల్పిన రష్యా అధ్యక్షుడు పుతిన్.. తమ సైనికులకు కనీసం వసతులు కల్పించలేదని అర్థమవుతోంది. రష్యన్ సైనికులకు తిండి లేక ఆకలితో పోరాడలేక తాజాగా ఉక్రెయిన్ లోని అతిపెద్ద రెండో నగరం ఖార్గివ్ లో లొంగిపోయినట్టు సమాచారం. ఈ మేరకు ఖార్గివ్ గవర్నర్ ‘ఓలే సినెహుబువ్’ ఫేస్ బుక్ లో పోస్టు చేసిన సైనికుల ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

రష్యాన్ సైనికులు యుద్ధం చేయలేక ఆకలితో అలమటిస్తున్నారని గవర్నర్ తెలిపారు. ఇక వారు రష్యా సైన్యంతో సంబంధాలు కోల్పోయారు. ఎందుకు యుద్ధం చేస్తున్నారో? ఎక్కడ చేయాలో? ఎలా చేయాలో వారికి అర్థం కాలేదు. ఆకలితో అలమటిస్తూ ఇక యుద్ధం చేయలేమని ఉక్రెయిన్ సైన్యానికి తాజాగా లొంగిపోయారని గవర్నర్ తెలిపారు.

ఉక్రెయిన్ పై యుద్ధం మొదలుపెట్టి మూడు రోజులు అవుతున్నా ఈ సైనికులకు కనీసం రష్యన్ సైన్యం ఆహారాన్ని కూడా అందివ్వలేకపోయిందని వారు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే యుద్ధం చేయలేకవారు లొంగిపోయారు.

ఇప్పటికే ఉక్రెయిన్ పై బాంబుల వర్షం కురిపించిన రష్యా ఆ దేశాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.అయితే అణు ఆయుధాలను సిద్ధం చేయండి.. అన్న వ్యాఖ్యలు ఇతర దేశాలను కూడా టార్గెట్ చేయడానికి రెడీ అవుతుందని విశ్లేషకులు అంటున్నారు. దీంతో మిగతా దేశాలు కూడా అప్రమత్తమవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఇక నాటో దేశాలు రంగంలోకి దిగితే యుద్ధం తీవ్రంగా ఉంటుందని కొందరు అంటున్నారు. అయితే పుతిన్ చేసిన ఈ వ్యాఖ్యలు సమర్థించుకుంటారా..? లేదా..? అన్నది వేచి చూడాల్సిన అవసరం ఉందన్నారు. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో నాటో దేశాలు ఏ విధంగా స్పందిస్తాయో చూడాలి.

రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం నేపథ్యంలో రష్యాపై యూరప్ దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ప్రపంచ దేశాలతో ఆర్థిక సంబంధాలు కలిగిన ఉన్న స్విప్ట్, ప్రపంచ బ్యాంకు నుంచి రష్యాను దూరం పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కన్నెర్ర జేసినట్లు సమాచారం. దీంతో అణ్వాయుధాలు సిద్ధం చేయాలని సైనికులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకుఉక్రెయిన్ పై మాత్రమే దాడి చేస్తున్న రష్యా ముందు ముందు ఏ దేశంపై విరుచుకుపడుతుందోనన్న చర్చ సాగుతోంది.

ఉక్రెయిన్ పై ఇప్పటికే బాంబుల వర్షం కురిపిస్తున్న రష్యా తమ దేశ సైనికులకు మరింత అప్రమత్తం చేస్తూ యుద్ధానికి సిద్ధం కావాలని సంకేతాలు పంపుతోంది. అయితే వారికి కనీస సౌకర్యాలు కల్పించలేకపోతోంది