Begin typing your search above and press return to search.

మార్కెట్ పై ఉక్రెయిన్ ఎటాక్ ?

By:  Tupaki Desk   |   17 Feb 2022 6:31 AM GMT
మార్కెట్ పై ఉక్రెయిన్ ఎటాక్ ?
X
ఉక్రెయిన్ సరిహద్దుల నుండి రష్యా సైన్యం వెనుకకు వెళ్తున్నట్టులేదు అనే వార్త కి నిన్న పొద్దంతా పెరిగిన మార్కెట్ నెగెటివ్ లోకి వెళ్ళింది కదా, మార్కెట్ క్లోజ్ అయ్యాక సైన్యం వెనుకకు వెళ్తున్నట్టు ఆఫీషల్ గా కంఫర్మ్ చేశారు. ఇప్పుడు మళ్లీ నిన్నటిలా పెరగడం అంటే, ముందే పరీక్ష పేపర్ లీక్ అవ్వడం లాంటిదే...అని సంహిత అనే మార్కెట్ అన‌లిస్ట్ అంటున్నారు. ఆమె చెబుతున్న మాటల ప్ర‌కారం..మార్కెట్ పై వీటి ప్ర‌భావం సుస్ప‌ష్టంగా ఉంటుంద‌నే తేలిపోయింది.అటు ర‌ష్యా కానీ

ఇటు అమెరికా కానీ మార్కెట్ల‌ను, మ‌ర్చెంట్ పాల‌సీల‌ను ప్ర‌భావితం చేయ‌డంలో ఇప్పుడు ముందుంటున్నాయి. మొన్న‌టి వ‌ర‌కూ క‌రోనా ప్ర‌భావంతో త‌ల్ల‌డిల్లిన మార్కెట్ల‌కు ఇప్పుడొక కొత్త ద‌రిద్రం పట్టుకుంది.అమెరికా ఊగిస‌లాట‌లు, రష్యా ఊహాగానాలు వెర‌సి మార్కెట్ల‌ను విప‌రీతంగా కదిపి కుదిపేందుకు సిద్ధంగా ఉన్నాయి. అస‌లే చాలా సున్నితం అయిన విష‌యాల‌కు స్పందించే మార్కెట్ల‌కు తాజా ఉదంతాలు లేదా ప‌రిణామాలు తీవ్రంగానే ప్ర‌భావితం చేయ‌నున్నాయి.

మొన్న‌టివ‌ర‌కూ క‌రోనా థ‌ర్డ్ వేవ్ కార‌ణంగా మొద‌టి త్రైమాసిక ఫ‌లితాలు ఏవీ అనుకూలంగాలేదు.మార్కెట్ల‌కు సంక్రాంతి కూడా పెద్ద‌గాక‌లిసి రాలేదు. కొన్ని సంస్థ‌ల‌కు మిన‌హా మార్కెట్ల‌లో మిగిలిన‌వి కోలుకున్న‌వి లేవు.ఇప్పుడీ ఉక్రెయిన్ ఉదంతం ఏ క్ష‌ణాన ఆ దేశంపై ర‌ష్యా దాడులు చేస్తుందో తెలియ‌ని వైనం ఇవ‌న్నీ క‌ల్లోలితాల‌కు కార‌ణం అవుతున్నాయి.ఇప్ప‌టికే అక్క‌డ అమెరికా కాన్సులేట్ ర‌ద్ద‌యింది. అక్క‌డున్న వారిని వెన‌క్కు ర‌ప్పించే ప్ర‌య‌త్నాలు కూడా జ‌ర‌గుతున్నాయి.అదేవిధంగా భార‌త సంతతి కూడా వెన‌క్కు వ‌చ్చేయాల‌ని సంబంధిత వ‌ర్గాలు నుంచి విన్న‌పాలు వ‌స్తున్నాయి. ఇప్పుడిప్పుడే క‌రోనా మూడో ద‌శ త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో కోలుకుంటున్న మార్కెట్ల‌కు ఉక్రెయిన్ ఉదంతం ముందున్న కాలంలో ఇంకెంత ప్ర‌భావితం చేయ‌నుందో?

దేశాల మ‌ధ్య నెల‌కొనే యుద్ధ వాతావ‌ర‌ణాన్ని చ‌ల్చార్చే ప్ర‌య‌త్నాలు,శాంతి పున‌రుద్ధ‌ర‌ణ అన్న‌వి స‌త్వ‌ర‌మే ఐక్య‌రాజ్య స‌మితి చేయ‌కుంటే మార్కెట్ మాట దేవుడెరుగు మ‌నుషులు మిగిలేందుకు అవ‌కాశాలున్నాయో లేదో చూడండి ముందు అని అంటున్నారు ఇంకొంద‌రు ప్ర‌జాస్వామిక వాదులు,ప్ర‌పంచ శాంతికామ‌కులు.ఈ నేప‌థ్యంలో సంహిత అనే మార్కెట్ ఎన‌లిస్ట్ ఏమంటున్నారంటే ఏ కాస్త నెగెటివ్ న్యూస్ వచ్చినా మార్కెట్ లో పెట్టిన పెట్టుబడులు ఉపసంహరించుకుంటారు.

అలాగే గుడ్ న్యూస్ వినిపిస్తే పెట్టుబడులు పెడతారు. ఇది కామన్ ప్రక్రియ...అంటూ స‌రిహ‌ద్దు వివాదాలు,క‌ల్లోలితాలు అన్న‌వి ఏ విధంగా మార్కెట్ ను క‌దిపికుదిపేస్తాయో అన్న‌ది వివ‌రిస్తున్నారు.

ప్రతి చిన్న వార్త మార్కెట్ ను ప్రభావితం చేస్తుంది.రష్యా,ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం జరగబోతుంది అని తెలియగానే మొన్న ఒక రోజు మార్కెట్ పడిపోయింది.సరిహద్దుల వరకు వచ్చిన రష్యా సైన్యం వెనుకకు వెళ్తుందన్నవార్త తో మార్కెట్ మళ్ళీ పుంజుకుంది. ఇంత‌లోనే రష్యా సైన్యం వెనుకకు వెళ్తున్నట్టు కనిపించడం లేదు అనే వార్తతో మళ్ళీ మార్కెట్ పడింది.తాజా వార్త ప్రకారం రష్యన్ సైన్యం వెనుకకు వెళ్తున్నాయ‌న్న వార్త‌లు కూడా వ‌స్తున్నాయి క‌నుక ఇవాళ మార్కెట్ ఎలా ఉండ‌నుందో అన్న‌ది ఇప్పుడిక ఓ ఆస‌క్తిదాయక ప‌రిణామం..అని అంటున్నారామె.