Begin typing your search above and press return to search.

రష్యాను గడగడలాడిస్తున్న స్నేక్ ఐలాండ్... మామూలుగా లేదుగా!

By:  Tupaki Desk   |   8 May 2022 2:30 PM GMT
రష్యాను గడగడలాడిస్తున్న స్నేక్ ఐలాండ్... మామూలుగా లేదుగా!
X
ఒక చిన్న దీవి రష్యాను గడగడలాడిస్తోంది. ఉక్రెయిన్ పై దాడి మొదలు పెట్టిన తొలి రోజే రష్యా దళాలు స్నేక్ ఐలాండ్ ను చుట్టుముట్టాయి. ఇక్కడి సైనికులను అదుపులోకి తీసుకున్నాయి. అప్పట్లో మాస్కోవా నౌక ఈ దాడిలో కీలక పాత్ర పోషించింది. ఉక్రెయిన్ నుంచి తేలిగ్గా ఈ ద్వీపాన్ని స్వాధీనం చేసుకున్న ఆనందం రష్యా కు మూడు నెలలు కూడా నిలవకుండా ేసింది. ఇది రష్యా నావికా దళానికి మృత్యు దీవి గా మారింది.

రష్యా అధీనంలోకి తీసుకున్న ఈ చిట్టి ద్వీపం ఇప్పుడు మింగుడు పడటం లేదు. ఈ ద్వీపాన్ని అధీనంలోకి తీసుకున్న నౌకతో సహా ఇప్పటి వరకు రష్యాకు చెందిన మూడు కు పైగా చిన్నా, పెద్దా, నౌకలు మునిగిపోయాయి. మృతుల సంఖ్య కూడా భారీగా ఉంది. నల్ల సముద్రంలో ఈ వ్యూహాత్మక ద్వీపాన్ని అధీనంలో ఉంచుకోవడం రష్యాకు తలకు మించిన భారం గా మారుతోంది. మరో పక్క ఈ ద్వీపం వదులుకున్న ఉక్రెయిన్ మాత్రం రష్యా కు దాన్ని దక్కనీయడం లేదు.

తాజాగా రష్యాకు చెందిన మరో భారీ నౌక ను ఈ ద్వీపం ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ రక్షణ శాఖ ట్విట్టర్ లో వీడియో తో సహా విడుదల చేసింది. మొత్తం పావు చదరపు కిలో మీటరు వైశాల్యంతో ఉన్న ఈ ద్వీపం నల్ల సముద్రంలో వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ప్రదేశం. ఇది సముద్ర మట్టం కంటే 41 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఉక్రెయిన్ ఆర్థిక కేంద్రమైన ఒడెస్సా పోర్టుకు 80 మైళ్ల దూరంలో ఉంటుంది. దీనిపై పట్ట సాధించిన దేశం నల్ల సముద్రంలో నౌకల కదలికలపై నిఘా పెట్టో సామర్థ్యాన్ని దక్కించుకుంటోంది.

మూడు శతాబ్దాలుగా ఇది రష్యా, టర్కీ, రోమేనియ, ఉక్రెయిన్ ల చెత్తుల్లోకి వెళ్లింది. తాజాగా ఉక్రెయిన్ పై దాడి చేసిన తొలి రోజే రష్యా దళాలు ఈ ద్వీపాన్ని చుట్టుముట్టాయి. మాస్కోవా యుద్ధ నౌక రంగంలోకి దిగి.. ఈ ద్వీపంపై  క్రూజ్ క్షిపణి వర్షం కురిపించింది. దీనిపై కట్టడాలు, లైట్ హౌస్ ను కూల్చి వేసింది. రష్యా స్వాధీనం చేసుకున్న అనంతరం... అక్కడ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ పరికరాలు, సెస్సార్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలను ఏర్పాటు చేసింది.

ఏప్రిల్ 13న మాస్కోవా నౌక స్నేక్ ఐలాండ్ సమీపంలో ప్రయాణిస్తుండగా.. రెండు నెఫ్ట్యూన్ క్షిపణులు దాన్ని ధ్వంసం చేశాయి. ఏప్రిల్ 26న ఈ ద్వీపంపై ఉన్న స్టెర్లా-10 క్షిపణి వ్యవస్థను ఉక్రెయిన్ బైరక్తర్ డ్రోన్ ధ్వంసం చేసింది. ఏప్రిల్ 30న మరో స్టెర్లను పేల్చేసింది. మే 2వ తేదీన మరోసారి బైరక్తర్లు ఇక్కడ దాడి చేశాయి. తాజాగా మరోసారి దాడి చేసి భారీ యుద్ధ నౌకను ధ్వంసం చేసింది.