Begin typing your search above and press return to search.
రష్యాకు ఉక్రెయిన్ సైన్యం షాక్
By: Tupaki Desk | 12 Sep 2022 4:42 AM GMTరెండు దేశాల మధ్య యుద్ధం మొదలైన ఆరు మాసాలకు ఉక్రెయిన్ సైన్యం రష్యాకు పెద్ద షాకే ఇచ్చింది. ఉక్రెయిన్లో అత్యంత ముఖ్యమైన ఓడరేవు నగరమైన ఖర్కీవ్ లోని రెండు ప్రాంతాలను ఉక్రెయిన్ సైన్యం తిరిగి తన ఆధీనంలోకి తెచ్చుకున్నది. యుద్ధం మొదలైన మూడు నెలలకు రష్యా సైన్యం ఖర్కీవ్ ను తన ఆధీనంలోకి తీసుకున్నది. ఉక్రెయిన్ నుండి బయట ప్రపంచానికి జరిగే వ్యాపారం మొత్తం ఇక్కడ ఓడరేవుల ద్వారానే జరుగుతాయి. దీన్నిబట్టే ఉక్రెయిన్ కు ఖర్కీవ్ ఎంత ముఖ్యమైన ప్రాంతమో అర్ధమవుతోంది.
ఇలాంటిది గడచిన పదిహేనురోజులుగా ఖర్కీవ్ ను తిరిగి సంపాదించుకోవాలని ఉక్రెయిన్ సైన్యం తీవ్రంగా పోరాటాలు చేసింది. మిస్సైల్స్ ఎటాక్, గొరిల్లా ఎటాక్ తదితర మార్గాల ద్వారా రష్యా సైన్యంపై విరుచుకుపడింది. దీని దెబ్బకు రష్యా సైన్యం ఖర్కీవ్ ను వదిలేసి వెళ్ళిపోయింది.
ఖర్కీవ్ నుండి తన సైన్యాన్ని ఉపసంహరించుకున్నట్లు స్వయంగా రష్యానే ప్రకటించింది. దీన్ని ఉక్రెయిన్ తన విజయంగా పేర్కొన్నది. ఇదే సమయంలో ఇజియం అనే మరో ముఖ్యమైన పట్టణాన్ని కూడా ఉక్రెయిన్ సైన్యం తిరిగి స్వాధీనం చేసుకున్నది.
రష్యా సైన్యం చేతుల్లోనుండి ఉక్రెయిన్ సైన్యం ఈ నెలలో 2 వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రకటించారు. రష్యా ఆధీనంలో ఉన్న ఇతర పట్టణాలు, నగరాలను కూడా తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఉక్రెయిన్ సైన్యం రెట్టించిన ఉత్సాహంతో దూసుకుని వెళుతున్నారు.
ఇజియం పట్టణాన్ని రష్యా సైన్యం ఖాళీ చేసిన తర్వాత చూస్తే అక్కడ మందుగుండు సామగ్రితో పాటు కొన్ని ఆయుధాలు, యంత్రాలను కూడా రష్యా సైన్యం వదిలేసినట్లు తెలుస్తోంది. నిజానికి రష్యా ముందు ఉక్రెయిన్ చిట్టెలుకనే చెప్పాలి.
మరలాంటపుడు ఇన్ని నెలలపాటు రష్యాను ఉక్రెయిన్ నిలువరించటమే కాకుండా ఇపుడు ఎదురుదాడులు కూడా చేస్తోంది. అంతేకాకుండా తమ భూభాగాలను రష్యా నుండి స్వాదీనం చేసుకుంటోంది. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే అమెరికా, మిత్రదేశాల మద్దతే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.