Begin typing your search above and press return to search.
పుతిన్ శత్రువులను బతకనివ్వడు.. ఉక్రెయిన్ మోడల్ సంచలన వ్యాఖ్యలు
By: Tupaki Desk | 14 March 2022 12:32 PM GMTఉక్రెయిన్ రష్యా చేస్తున్న యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ఈ యుద్ధాన్ని ప్రపంచవ్యాప్తంగా ఖండిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు, మేధావులు, వివిధ దేశాధినేతలు దీన్ని వ్యతిరేకించారు. తాజాగా మిస్ ఉక్రెయిన్ ఫైనలిస్ట్ అయిన మోడల్ అన్నా డ్యూరిస్కా స్పందించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ కు వ్యతిరేకంగా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.
పుతిన్ తన శత్రువులను ఎట్టి పరిస్థితుల్లో క్షమించరని అన్నా ఆరోపించారు. ఇదివరకూ పుతిన్ పై విమర్శలు చేసిన అలెగ్జాండర్ లిట్వినెంకో, అలెక్సీ నావల్నీని దుండగులు చంపేశారని ఆరోపించింది. వారు పుతిన్ మనుషులే అంటోంది అన్నా.
2015 ఫిబ్రవరిలో మాస్కోలోని బ్రిడ్జిని అర్ధరాత్రి దాడుతుండగా రష్యా ప్రతిపక్ష నేత అయిన బోరిస్ నెంట్సోవ్ ను ఎవరో కాల్చి చంపారు. వాళ్లు పుతిన్ మనుషులే అని అన్నా ఆరోపించింది. ఎవరు చంపారో అధికారికంగా తేలలేదు. అదో మిస్టరీగా మిగిలిపోయింది.
ఆ హత్యను కళ్లారా చూసిన 23 ఏళ్ల అన్నా.. అప్పట్లో బోరిస్ నెంట్సోవ్ కు గర్ల్ ఫ్రెండ్ గా ఉండేది. ఆమె చూసినప్పుడు ఎవరో కారులో వచ్చి కొన్ని రౌండ్లు కాల్పులు జరిపారు. వారెవరో ఆమెకు తెలియదు. వాళ్లు పుతిన్ తాలూకే అంటోంది అన్నా.