Begin typing your search above and press return to search.

కూల్చిన విమానాలు.. పోయిన ప్రాణాలెన్ని?

By:  Tupaki Desk   |   13 Jan 2020 8:43 AM GMT
కూల్చిన విమానాలు.. పోయిన ప్రాణాలెన్ని?
X
అమెరికా-ఇరాన్ దేశాల మధ్య యుద్ధోన్మాదానికి తాజాగా ఉక్రెయిన్ విమానం నేలకూలి అందులోని 176మంది అసువులు బాసారు. ఈ పాపం చేసింది తామే తప్పు జరిగిందని ఇరాన్ అధ్యక్షుడు చెప్పినా కానీ ప్రపంచ వ్యాప్తంగా ఆ దేశం పై అందరూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. అంతమందిని పొట్టన పెట్టుకున్న ఇరాన్ పై దుమ్మెత్తి పోస్తున్నారు.

ఒక్క ఉక్రెయిన్ విమానమే కాదు.. చరిత్ర లో ఇలా క్షిపణి దాడులకు బలైన విమానాలు, వివిధ దేశాలు యుద్ధోన్మాదంతో నేల కూల్చిన విమానాలు చాలా ఉన్నాయి.

* 1973 ఫిబ్రవరి 21న ఇజ్రాయిల్ దేశం తమ సీనాయ్ ఏడారి ప్రాంతం నుంచి వెళుతున్న లిబియా దేశానికి చెందిన విమాన్ని కూల్చింది.ఈ ప్రమాదంలో 112 మంది చనిపోయారు.

*1983 సెప్టెంబర్ 1న సౌత్ కొరియా కు చెందిన విమానాన్ని నాటి సోవియట్ రష్యా ఫైటెర్ జెట్ సఖాలిన్ దీవులపై కూల్చేసింది. ఈ ప్రమాదంలో ఏకంగా 269మంది ప్రయాణికులు మరణించారు.

*1988 జూలై 3న ఇరాన్ ఎయిర్ లెన్స్ విమానాన్ని దుబాయ్ వెళుతుండగా అమెరికా ప్రయోగించిన క్షిపణులు ఢీకొట్టడంతో విమానం కూలింది. ఈ ఘటనలో ఏకంగా 290మంది ప్రయాణికులు మరణించారు. ఈ పనిచేసిన అమెరికా ఇరాన్ కు నష్టపరిహారంగా 101.8 మిలియన్ డాలర్లు చెల్లించింది.

*2007 మార్చి 23న బెలారస్ దేశానికి విమానాన్ని సోమాలియా దేశంలో ఓ రాకెట్ డీకొనడంతో కూలి పోయింది. ఈఘటనలో 11మంది మరణించారు.

*2004 అక్టోబర్ 3న నల్ల సముద్రంపై రష్యాకు చెందిన విమానాన్ని ఉక్రెయిన్ క్షిపణి ఢీకొట్టడంతో కూలింది. ఈఘటనలో 78మంది మరణించారు.

*2014 జూలై 17న అమ్ స్టార్ డమ్ నుంచి కౌలంలంపూర్ బయలుదేరిన మలేషియా విమానం ఉక్రెయిన్ గగనతలంలో క్షిపణి ఢీకొట్టడంతో కూలింది. ఈ ఘటనలో ఏకంగా 298మంది మరణించారు.

తాజాగా ఇరాన్ క్షిపణి దాడిలో ఉక్రెయిన్ విమానం కూలి 176మంది మరణించారు.