Begin typing your search above and press return to search.
రష్యా సైన్యాన్ని ఉక్రెయిన్ తిప్పికొడుతోందా ?
By: Tupaki Desk | 3 April 2022 6:30 AM GMTక్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. గడచిన 35 రోజుల యుద్ధంలో రష్యా సైన్యం స్వాధీనం చేసుకున్న అనేక నగరాలు, ప్రాంతాలను ఉక్రెయిన్ సైన్యం తిరిగి తమ ఆధీనంలోకి తీసుకుంటోంది. ఉక్రెయిన్లోని చాలా ప్రాంతాలు, నగరాల నుండి రష్యా సైన్యం తిరిగి వెళిపోతున్నట్లు సమాచారం అందుతోంది. కీవ్, చెర్ని హైవ్ తదితర నగరాలను ఉక్రెయిన్ సైన్యం పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నది.
కీవ్, చెర్నహైవ్ తదితర ప్రాంతాలు, నగరాల నుండి రష్యా సైన్యం బెలారస్ వైపు వెళిపోతున్నాయి. అయితే యుద్ధంలో నుండి రష్యా సైన్యాలు తిరిగి వెళిపోతున్నాయా ? లేకపోతే ఇంకేదైనా వ్యూహం ఉందా అన్నదే ప్రస్తుతానికి అర్థం కావటంలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే వెనక్కు వెళుతున్న రష్యా సైన్యాలు అన్నిచోట్లా ల్యాండ్ మైన్స్ ను అమర్చుతున్నాయి. అంటే ఇవి ఏ క్షణంలో అయినా పేలచ్చు.
ల్యాండ్ మైన్స్ పేలటం వల్ల జరిగే విధ్వంసం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉక్రెయిన్లోని అనేక ప్రాంతాలు, నగరాల్లో ఇప్పటికి కొన్ని వేల ల్యాండ్ మైన్స్ ను అమర్చినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ గోల పెడుతున్నారు. వీటిని కనిపెట్టి బయటకు తీయాలంటే తమకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయంటున్నారు జెలెన్ స్కీ. ఉక్రెయిన్ లెక్కల ప్రకారం యుద్ధంలో 18 వేల మంది రష్యా సైనికులు చనిపోయారు.
మరోవైపు రెండు దేశాల మధ్య జరిగిన చర్చలు పెద్దగా సక్సెస్ కావటం లేదు. ఇప్పటికి ఎనిమిది సార్లు రెండు దేశాల మధ్య కీలక వ్యక్తులు భేటీలు జరిపినా ఉపయోగం లేకపోయింది. ఇదే సమయంలో ఉక్రెయిన్ లో రష్యా సైన్యం విధ్వంసాలు జరుగుతునే ఉన్నాయి.
రష్యా దగ్గర ఆయుధాలు నిండుకున్నాయని బ్రిటన్ రక్షణ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే ఇందుకు అవకాశం లేకపోయినా పాశ్చాత్య దేశాల మీడియా మాత్రం పదే పదే ఇదే విషయాన్ని బాగా ప్రచారం చేస్తోంది. కాకపోతే యుద్ధంలో రష్యాకు చెందిన యుద్ధ ట్యాంకులు, యుద్ధ వాహనాలు, క్షిపణులను ఉక్రెయిన్ సైన్యం ధ్వంసం చేసిన విషయం మాత్రం వాస్తవం.